టెస్ట్ క్రికెట్ వీడ్కోలు.. దిమ్మదిరిగే అశ్విన్ బౌలింగ్ రికార్డులు ఇవి
భారత స్పిన్ దిగ్గజం ఆర్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్‌కి వీడ్కోలు పలికారు. టెస్ట్ క్రికెట్‌లో అశ్విన్ బెస్ట్ బౌలింగ్ గణాంకాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
భారత స్పిన్ దిగ్గజం ఆర్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్‌కి వీడ్కోలు పలికారు. 100 కి పైగా టెస్ట్‌లు ఆడిన కొద్దిమంది భారతీయ క్రికెటర్లలో ఆయన ఒకరు. అతి వేగంగా 500 వికెట్లు తీసిన భారతీయుడు కూడా. 36 సార్లు ఐదు వికెట్లు తీశారు. భారత లెజెండరీ బౌలర్ అనిల్ కుంబ్లే తర్వాత అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్ గా ఘతన సాధించాడు. టెస్ట్ క్రికెట్‌లో భారత జట్టుకు అనేక విజయాలు అందించాడు.
5. 7/103 vs ఆస్ట్రేలియా
అంతర్జాతీయ క్రికెట్ లో అనేక సార్లు రవిచంద్రన్ అశ్విన్ అద్భుతమైన ప్రదర్శనలు ఇచ్చాడు. 2013లో ఆస్ట్రేలియాపై భారత్ 4-0తో వైట్‌వాష్ సాధించింది. ఈ విజయంలో అశ్విన్ కీలక పాత్ర పోషించారు. ఆస్ట్రేలియా ఆటగాళ్లను కంగారెత్తించాడు. చెన్నైలో జరిగిన తొలి టెస్ట్‌లో అద్భుత బౌలింగ్ ప్రదర్శన సిరీస్‌కే హైలైట్ గా నిలిచింది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో అశ్విన్ 100 పరుగులు ఇచ్చి 7 వికెట్లు (7/103) తీసుకున్నాడు.
4. 7/83 vs వెస్టిండీస్
వెస్టిండీస్ తో తన టెస్టు క్రికెట్ ప్రయాణం మొదలుపెట్టిన రవిచంద్రన్ అశ్విన్ అనేక సార్లు విండీస్ బిగ్ షాకిచ్చాడు. 2016 వెస్టిండీస్ పర్యటన భారత్‌కి చిరస్మరణీయంగా మార్చాడు. ఇక్కడ భారత జట్టు విజయంలో అశ్విన్ కీలక పాత్ర పోషించారు. ఆంటిగ్వా టెస్ట్‌లో ఆయన ఆల్‌రౌండ్ ప్రదర్శన సిరీస్‌కే హైలైట్ గా నిలిచింది. అద్భుతమైన బౌలింగ్ తో పాటు బ్యాట్‌తో రాణిస్తూ 113 పరుగులు చేశాడు అశ్విన్.
3. 7/71 vs వెస్టిండీస్
2023 డొమినికా టెస్ట్‌లో వెస్టిండీస్‌పై అశ్విన్ అద్భుత ప్రదర్శన చేశారు. 21.3 ఓవర్లలో 7/71 తీసుకున్నారు. ఇది ఆయన మూడో అత్యుత్తమ బౌలింగ్ గణాంకం.
2. 7/66 vs దక్షిణాఫ్రికా
2015 IND vs SA సిరీస్‌లోని నాగ్‌పూర్ టెస్ట్‌లో అశ్విన్ దక్షిణాఫ్రికా బ్యాటింగ్‌ను ధ్వంసం చేశారు. దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 79 పరుగులకే ఆలౌట్ అయ్యింది. అశ్విన్ 32 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీసుకున్నాడు.
1. 7/59 vs న్యూజిలాండ్