- Home
- Sports
- Cricket
- Bazball: చూడ్డానికే బానే ఉంది కానీ టెస్టుల పరిస్థితి తలుచుకుంటేనే.. : అశ్విన్ షాకింగ్ కామెంట్స్
Bazball: చూడ్డానికే బానే ఉంది కానీ టెస్టుల పరిస్థితి తలుచుకుంటేనే.. : అశ్విన్ షాకింగ్ కామెంట్స్
Ashwin About Bazball: టెస్టులలో ఇంగ్లాండ్ అనుసరిస్తున్న కొత్త విధానానికి ఆ జట్టు పెట్టుకున్న పేరు బ్యాజ్ బాల్. దూకుడుగా ఆడటమే దీని ఉద్దేశం.

ఇంగ్లాండ్ క్రికెట్ లో పెను సంచలనం రేపుతున్న బ్యాజ్ బాల్ పై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. బ్యాజ్ బాల్ అంటే.. టెస్టులను కూడా బోర్ కొట్టించకుండా ఆడటమే. స్టేడియానికి వచ్చిన ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తూనే ప్రత్యర్థి మీద ఆధిపత్యం చెలాయించడం.
ఇంగ్లాండ్ కు టెస్టులలో కొత్త కోచ్ (బ్రెండన్ మెక్ కల్లమ్), కొత్త కెప్టెన్ (బెన్ స్టోక్స్) వచ్చాక దీనిని ముందుకు తీసుకెళ్లుతున్నారు. న్యూజిలాండ్ తో మూడు టెస్టులతో పాటు ఇండియాతో ఎడ్జబాస్టన్ లో ముగిసిన టెస్టులో కూడా ఇంగ్లాండ్ ఇదే విధానాన్ని అనుసరించి విజయాలు సాధించింది.
ఈ విధానం పై బిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సంప్రదాయక టెస్టు క్రికెట్ ను ఈ విధానం భ్రష్టు పట్టిస్తుందని ఇప్పటికే టీ20లకు అలవాటు పడ్డ క్రికెటర్లు .. ఈ విధానాన్ని అలవరుచుకుంటే భవిష్యత్ లో టెస్టులు రెండ్రోజులు కూడా జరగడం కష్టమేనని భావిస్తున్నారు.
తాజాగా టీమిండియా వెటరన్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఇదే విషయమై షాకింగ్ కామెంట్స్ చేశాడు. తన యూట్యూబ్ ఛానెల్ లో మాట్లాడుతూ.. ‘చూడటానికి ఇది బాగానే ఉంది. కానీ ఒక బౌలర్ గా ఆట ఎక్కడికి పోతుందో అనే ఆందోళన కలుగుతున్నది. నాకు తెలిసి ఇంగ్లాండ్ లో పిచ్ లు, బాల్ కూడా ఇంగ్లాండ్ ఈ తరహా క్రికెట్ ఆడేందుకు దోహదపడుతున్నాయని అనిపిస్తున్నది.
ఈ విధానం (బ్యాజ్ బాల్) పై మనం జాగ్రత్తగా ఉండాలి. టెస్టు క్రికెట్ అనేది గడిచిన వంద సంవత్సరాలుగా దాని సొగసును కోల్పోకుండా అలాగే నిలిచిఉంది. అయితే ఈ తరహా క్రికెట్ ఆడితే అది ఎంతకాలం మనగలుగుతుందానేది చర్చనీయాంశం..’ అని కామెంట్ చేశాడు.
బ్యాజ్ బాల్ విధానం ద్వారా కివీస్ తో సిరీస్ ను గెలిచి ఇండియా తో సిరీస్ సమం చేసిన ఆ జట్టు సారథి బెన్ స్టోక్స్ మాత్రం.. జట్టు ఏదైనా తాము ఆడే విధానం మాత్రం మారబోదని.. దూకుడే తమ మంత్రమని చెప్పిన విషయం తెలిసిందే.