వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి అశ్విన్, వాషింగ్టన్ సుందర్... ఆ సమయానికి అక్షర్ కోలుకోకుంటే..
వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి రిజర్వు ప్లేయర్లుగా రవిచంద్రన్ అశ్విన్, వాషింగ్టన్ సుందర్‌లను ప్రకటించింది బీసీసీఐ. ప్రపంచ కప్‌కి ముందు మ్యాచ్ ప్రాక్టీస్ కోసం ఈ ఇద్దరూ ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో ఆడబోతున్నారు..
ఆస్ట్రేలియాతో జరిగే మూడు వన్డేల సిరీస్‌లో స్పిన్ ఆల్‌రౌండర్లు రవిచంద్రన్ అశ్విన్, వాషింగ్టన్ సుందర్‌కి చోటు దక్కింది. వీరితో పాటు ఆసియా క్రీడల్లో భారత జట్టుకి కెప్టెన్సీ చేయబోతున్న యంగ్ ప్లేయర్ రుతురాజ్ గైక్వాడ్ కూడా ఆసీస్‌తో రెండు వన్డేలు ఆడతాడు..
Ravichandran Ashwin
సెప్టెంబర్ 27న ఆస్ట్రేలియాతో మూడో వన్డే ఆడుతుంది భారత జట్టు. మూడో వన్డే సమయానికి అక్షర్ పటేల్ పూర్తిగా కోలుకోకపోతే.. రవిచంద్రన్ అశ్విన్‌కి వన్డే వరల్డ్ కప్ 2023 టీమ్‌లో చోటు దక్కుతుంది..
Ashwin
‘రవిచంద్రన్ అశ్విన్ దాదాపు 150 వన్డేలు ఆడాడు, 100 దాకా టెస్టులు ఆడాడు. నా ఉద్దేశంలో రవిచంద్రన్ అశ్విన్, వన్డే వరల్డ్ కప్ టీమ్‌లో ఉండాలి. అతను కొన్నాళ్లుగా వన్డేలు ఆడకపోతుండొచ్చు కానీ అశ్విన్‌కి ఎంతో క్రికెట్ ఆడిన అనుభవం ఉంది..
Ashwin
అవసరమైతే అశ్విన్‌ని వన్డే వరల్డ్ కప్ ఆడించే విషయం గురించి, అతనితో ఇప్పటికే మాట్లాడాం... వాషింగ్టన్ సుందర్‌ని కూడా దగ్గర్నుంచి పరిశీలిస్తున్నాం..’ అంటూ కామెంట్ చేశాడు రోహిత్ శర్మ..
Washington Sundar
వాషింగ్టన్ సుందర్‌కి ఆసియా క్రీడలు ఆడే భారత పురుషుల క్రికెట్ జట్టులో చోటు దక్కింది. అతను సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 8 వరకూ చైనాలో ఉంటాడు. అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో మొదటి వరల్డ్ కప్ మ్యాచ్ ఆడుతుంది టీమిండియా..
Washington Sundar
చైనా నుంచి వచ్చిన తర్వాత వాషింగ్టన్ సుందర్, టీమ్‌తో కలిసినా అక్టోబర్ 14న పాకిస్తాన్‌తో జరిగే మ్యాచ్ నుంచి టీమ్‌తో కలిసి ఆడడానికి కావాల్సినంత సమయం దొరుకుతుంది. అయితే ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో అతని పర్ఫామెన్స్ ఆధారంగా సుందర్, వరల్డ్ కప్ ఛాన్సులు ఆధారపడి ఉంటాయి.