MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • ముంబై కెప్టెన్‌గా పృథ్వీషా, అర్జున్ టెండూల్కర్‌కి పిలుపు... కేరళ జట్టులో శ్రీశాంత్...

ముంబై కెప్టెన్‌గా పృథ్వీషా, అర్జున్ టెండూల్కర్‌కి పిలుపు... కేరళ జట్టులో శ్రీశాంత్...

87 ఏళ్ల ఘనమైన చరిత్ర ఉన్న రంజీ ట్రోఫీ, వచ్చే నెలలో పునఃప్రారంభం కానున్న విషయం తెలిసిందే. 1934లో ప్రారంభమైన రంజీ ట్రోఫీ, 86 ఏళ్ల పాటు నిరాంటకంగా సాగింది. అయితే గత ఏడాది కరోనా కారణంగా రంజీ ట్రోఫీని నిర్వహించని బీసీసీఐ, జనవరి- మార్చి 2022లో ఈ టోర్నమెంట్‌ను నిర్వహించేందుకు సిద్ధమవుతోంది...

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : Dec 30 2021, 01:51 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
111

రంజీ ట్రోఫీ 2021-22 సీజన్‌లో ముంబై జట్టుకి పృథ్వీషా కెప్టెన్‌గా వ్యవహరించబోతున్నాడు. 41 సార్లు రంజీ టైటిల్ గెలిచిన ముంబై జట్టు, గ్రూప్ Cలో 9 జట్లతో మ్యాచులు ఆడుతుంది...

211

కెప్టెన్‌గా ముంబైకి విజయ్ హాజారే ట్రోఫీ 2021 టోర్నీని అందించిన పృథ్వీషాతో పాటు శివమ్ దూబే, ఆదిత్య తారే, ధవల్ కుల్‌కర్ణి వంటి సీనియర్లకు జట్టులో చోటు దక్కింది...

311

సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్, ముంబై జట్టులో చోటు దక్కించుకున్నాడు. అర్జున్ టెండూల్కర్‌కి ఇదే మొట్టమొదటి రంజీ సీజన్ కానుంది...

411

ముంబై జట్టు: పృథ్వీ షా (కెప్టెన్), యశస్వి జైస్వాల్, అకర్షిత్ గోమల్, అర్మన్ జాఫర్, సర్ఫరాజ్ ఖాన్, సచిన్ యాదవ్, ఆదిత్య తారే, హార్ధిక్ తోమర్, శివమ్ దూబే, అమన్ ఖాన్, శామ్స్ ములన్, తనుష్ కోటియన్, ప్రశాంత్ సోలంకి, శశాంక్ అట్టార్డే, ధవల్ కుల్‌కర్ణి, మోహిత్ అవస్తీ, ప్రిన్స్ బడియాని, సిద్ధార్థ్ రౌత్, రోషన్ దాస్, అర్జున్ టెండూల్కర్

511

ఉత్తరప్రదేశ్ టీమ్‌ని రంజీ ట్రోఫీలో సీనియర్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ నడిపించబోతున్నాడు. కర్ణ్ శర్మతో పాటు రింకూ సింగ్, ప్రియమ్ గార్గ్, శివమ్ మావి, అంకిత్ రాజ్‌పుత్ వంటి ఐపీఎల్ స్టార్లకు యూపీ రంజీ టీమ్‌లో చోటు దక్కింది...

611

ఉత్తరప్రదేశ్ జట్టు: కుల్దీప్ యాదవ్ (కెప్టెన్), కర్ణ్ శర్మ (వైస్ కెప్టెన్), మాధన్ కౌషిక్, అల్మాస్ సౌకత్, సామ్రాట్ సింగ్, హర్దీప్ సింగ్, రింకూ సింగ్, ప్రియమ్ గార్గ్, అర్క్‌దీప్ నాథ్, సమీర్ చౌదరి, క్రిత్యాగ సింగ్, అర్యన్ జుయల్, దృవ్ చంద్ర, శివమ్ మావి, అంకిత్ రాజ్‌పుత్, యశ్ దయల్, కునల్ యాదవ్, ప్రిన్స్ యాదవ్, రిషబ్ భన్సల్, షన్ణు సైనీ, జస్మీర్, జీషన్ అన్వీరీ, శివమ్ శర్మ, పార్థ్ మిశ్రా

711

తమిళనాడు జట్టును విజయ్ శంకర్ నడిపించబోతున్నాడు. వాషింగ్టన్ సుందర్ రంజీ ట్రోఫీలో తమిళనాడుకి వైస్ కెప్టెన్‌గా వ్యవహరించబోతున్నాడు...

811

తమిళనాడు జట్టు: విజయ్ శంకర్ (కెప్టెన్), వాషింగ్టన్ సుందర్ (వైస్ కెప్టెన్), ఇంద్రజిత్, అపరాజిత్, ఎన్ జగదీశన్, షారుక్ ఖాన్, సాయి సుదర్శన్, ప్రదోశ్ రంజన్ పాల్, సూర్యప్రకాశ్, కౌషిక్ గాంధీ, గంగా శ్రీధర్ రాజు, సందీప్ వారియర్, మహమ్మద్, సిలంబరసన్, శరవణ కుమార్, అశ్విన్ క్రిస్ట్, విఘ్నేశ్, సాయి కిషోర్, సిద్ధార్థ్, ఆర్ కెవిన్

911

కేరళ జట్టును సచిన్ బేబీ నడిపించబోతున్నాడు. విష్ణు వినోద్‌కి వైస్ కెప్టెన్సీ దక్కింది. సయ్యద్ ముస్తాక్ ఆలీ, విజయ్ హాజారే ట్రోఫీల్లో కేరళను నడిపించిన సంజూ శాంసన్‌, రంజీ ట్రోఫీలో ఆడుతున్నా, కెప్టెన్సీ చేయడం లేదు...

1011

భారత మాజీ పేసర్ శ్రీశాంత్, 9 ఏళ్ల తర్వాత రంజీ ట్రోఫీలో రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు. రంజీ ట్రోఫీ 2021-22 టోర్నీకి ప్రకటించిన 24 మందిలో శ్రీశాంత్‌కి చోటు దక్కింది. అయితే రాబిన్ ఊతప్ప ఫిట్‌నెస్ లేమీ కారణంగా జట్టులో చోటు కోల్పోయాడు.

1111

కేరళ జట్టు: సచిన్ బేబీ (కెప్టెన్), విష్ణు వినోద్ (వైస్ కెప్టెన్), ఆనంద్ కృష్ణన్, రోహన్ కున్నుమల్, వత్సల్ గోవింద్, రాహుల్ పీ, సల్మాన్ నిజర్, సంజూ శాంసన్, జలజ్ సక్సేనా, సిజోమన్ జోసఫ్, అక్షర్ కే సీ, మిథున్ ఎస్, బాసిల్ ఎన్‌పీ, నిదీశ్, మను కృష్ణన్, బాసిల్ తంపి, ఫనూస్ ఎఫ్, శ్రీశాంత్, అక్షయ్ చంద్రన్, వరుణ్ నాయనర్, ఆనంద్ జోసఫ్, వినూప్ మనోహరన్, అరుణ్, వైశాఖ్ చంద్రన్

About the Author

CR
Chinthakindhi Ramu
Latest Videos
Recommended Stories
Recommended image1
IPL 2026 : వీరి అనుభవమే ఆయుధం.. ధోని, కోహ్లీ, రోహిత్ లే కాదు, అదరగొట్టేందుకు సిద్దమైన టాప్ 8 వెటరన్ ప్లేయర్స్
Recommended image2
IPL 2026: టీమిండియాలోకి వస్తే వాడు చాలా డేంజర్.. బ్యాటింగ్ ఆడితే వీడియో గేమ్‌లా ఉంటుంది
Recommended image3
CSK : ధోని టీమ్‌కు బిగ్ షాక్.. ఐపీఎల్ 2026 నుంచి స్టార్ బౌలర్ అవుట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved