MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Sports
  • Cricket
  • రాజస్థాన్ రాయల్స్ ను రాహుల్ ద్రావిడ్ ఎందుకు వీడారు?

రాజస్థాన్ రాయల్స్ ను రాహుల్ ద్రావిడ్ ఎందుకు వీడారు?

Rajasthan Royals: రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్ పదవి నుంచి భారత క్రికెట్ లెజెండ్ రాహుల్ ద్రావిడ్ తప్పుకున్నారు. ఆయన తప్పుకోవడం వెనుక సంజూ శాంసన్ ఉన్నారనే రూమర్లు కూడా వినిపించాయి. అయితే, తాజాగా మరో విషయం వెలుగులోకి వచ్చింది.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Sep 01 2025, 10:22 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
రాజస్థాన్ రాయల్స్ కోచ్ పదవి నుంచి రాహుల్ ద్రావిడ్ వైదొలగడం వెనుక కారణం ఏంటి?
Image Credit : Getty

రాజస్థాన్ రాయల్స్ కోచ్ పదవి నుంచి రాహుల్ ద్రావిడ్ వైదొలగడం వెనుక కారణం ఏంటి?

రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్‌గా ఉన్న రాహుల్ ద్రావిడ్.. ఒకేఒక్క సీజన్ తర్వాత ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. రాజస్థాన్ జట్టు సోషల్ మీడియాలో ఈ విషయాన్ని వెల్లడించింది. ఇది ఆయన వ్యక్తిగత నిర్ణయమని స్పష్టం చేసినప్పటికీ, తాజా నివేదికలు మాత్రం వేరే విషయాన్ని చెబుతున్నాయి. దీనికి ముందు సంజూ శాంసన్ కారణం అనే అంశం కూడా హాట్ టాపిక్ గా మారింది.

DID YOU
KNOW
?
ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్
2008లో ఐపీఎల్ టైటిల్ గెలిచిన తర్వాత, రాజస్థాన్ రాయల్స్ 2013, 2015, 2018, 2022, 2024 సీజన్లలో ప్లేఆఫ్స్‌కు చేరుకుంది.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
జట్టు మేనేజ్‌మెంట్ నిర్ణయాల కారణంగా ద్రావిడ్ తప్పుకున్నారా?
Image Credit : Getty

జట్టు మేనేజ్‌మెంట్ నిర్ణయాల కారణంగా ద్రావిడ్ తప్పుకున్నారా?

జట్టులో నాయకత్వంపై వచ్చిన విభేదాలే ద్రావిడ్ వైదొలగడానికి అసలు కారణమని భారత క్రికెట్ సర్కిల్ లో టాక్ నడుస్తోంది. ద్రావిడ్‌కు జట్టులో పెద్ద బాధ్యతలు ఇస్తామని రాయల్స్ మేనేజ్‌మెంట్ హామీ ఇచ్చింది. కానీ కీలక నిర్ణయాల నుంచి ఆయనను దూరంగా ఉంచినట్లు మాజీ సిబ్బంది తెలిపినట్టు పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. ముఖ్యంగా, జట్టు నాయకుడి ఎంపికలో ఆయన అభిప్రాయం పట్టించుకోకపోవడం ద్రావిడ్‌ను నిరాశపరిచిందని సమాచారం.

35
రియాన్ పరాగ్ కారణమా?
Image Credit : ANI

రియాన్ పరాగ్ కారణమా?

సంజూ శాంసన్ జట్టును వదిలే ఆలోచన వ్యక్తం చేసిన తర్వాత రియాన్ పరాగ్‌ను తదుపరి కెప్టెన్‌గా నియమించాలన్న మేనేజ్‌మెంట్ నిర్ణయానికి ద్రావిడ్ ఏకీభవించలేదని సమాచారం. గత సీజన్‌లో సంజూ గాయపడినప్పుడు పరాగ్ ఐదు మ్యాచ్‌లలో నాయకత్వం వహించారు. అయితే అందులో నాలుగు మ్యాచ్‌ల్లో జట్టు ఓటమి పాలైంది. పరాగ్ గత ఆరు సీజన్లుగా రాయల్స్ తరఫున ఆడుతున్నా, 2024 ఒక్క సీజన్‌లోనే 500కి పైగా పరుగులు సాధించారు. మిగతా సీజన్లలో పెద్దగా ఆకట్టుకోలేకపోయారు.

45
యశస్వి జైస్వాల్ పై ద్రావిడ్ విశ్వాసం
Image Credit : Getty

యశస్వి జైస్వాల్ పై ద్రావిడ్ విశ్వాసం

రియాన్ పరాగ్ కంటే యశస్వి జైస్వాల్ ఎక్కువ ప్రతిభావంతుడని ద్రావిడ్ అభిప్రాయం. భారత జట్టులో మూడు ఫార్మాట్లలో స్థానం సంపాదించుకున్న జైస్వాల్‌ను భవిష్యత్ కెప్టెన్‌గా చూడాలని ఆయన కోరుకున్నారని నివేదికలు చెబుతున్నాయి. జట్టు భవిష్యత్తు దృష్ట్యా ఈ నిర్ణయం సరైనదని ద్రావిడ్ నమ్మినట్లు తెలుస్తోంది.

55
సంజూ శాంసన్ రాజస్థాన్ జట్టును వీడుతున్నారా?
Image Credit : Getty

సంజూ శాంసన్ రాజస్థాన్ జట్టును వీడుతున్నారా?

సంజూ శాంసన్ రాజస్థాన్ రాయల్స్ నుంచి తప్పుకోవచ్చన్న వార్తలు వస్తున్నాయి. అలా జరిగితే రియాన్ పరాగ్ కెప్టెన్‌గా అవకాశం దక్కుతుందని అంచనా. మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్, కోల్ కతా నైట్ రైడర్స్ సంజూను తమ జట్టులోకి తీసుకోవాలని ప్రయత్నిస్తున్నాయి. 

చెన్నైతో చర్చలు ఫలితం ఇవ్వకపోయినా, కేకేఆర్ ఇంకా ప్రయత్నాలు కొనసాగిస్తోంది. కోచ్‌గా ద్రావిడ్, కెప్టెన్‌గా సంజూ కలిసి కోల్ కతా జట్టులో చేరతారేమో అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గత సీజన్ ముగిసిన తర్వాత కేకేఆర్ కోచ్ చంద్రకాంత్ పండిట్ కూడా పదవి నుంచి వైదొలిగిన సంగతి తెలిసిందే.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
క్రీడలు
భారత దేశం
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఇండియన్ ప్రీమియర్ లీగ్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Team India ODI captain: గిల్ ఔట్.. న్యూజిలాండ్ పర్యటనలో టీమిండియా కొత్త వన్డే కెప్టెన్
Recommended image2
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘనవిజయం.. ఫైనల్లోకి దూసుకెళ్లిన టీమిండియా
Recommended image3
Asian Games: బంగ్లాదేశ్ బౌలింగ్ ను దంచికొట్టిన షెఫాలీ వర్మ.. సూపర్ సెంచరీతో రికార్డుల మోత
Related Stories
Recommended image1
కాసుల వర్షం.. 2025 మహిళల వరల్డ్ కప్‌లో భారీ ప్రైజ్ మనీ
Recommended image2
ఆసియా కప్ 2025 : భారత్-పాకిస్తాన్ మ్యాచ్ టికెట్ ధర ఎంత? ఎలా బుకింగ్ చేసుకోవాలి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved