టీమ్ అదే! ఆ ఇద్దరినీ తొలగిస్తే టైటిల్ గెలిచేస్తుందా... అనిల్ కుంబ్లేని తొలగించడంపై...
స్టార్ ప్లేయర్లు నిండుగా ఉన్నా, ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేకపోయిన టీమ్స్‌లో పంజాబ్ కింగ్స్ ఒకటి. ఓ సారి ఫైనల్ చేరినా టైటిల్‌కి అడుగుదూరంలో నిలిచిపోయిన పంజాబ్ కింగ్స్... సీజన్‌కో కెప్టెన్‌ని మార్చడంలో మాత్రం రికార్డులు క్రియేట్ చేసింది. ఈసారి మరో కొత్త కెప్టెన్‌తో బరిలో దిగుతోంది...
Image credit: PTI

మయాంక్ అగర్వాల్ కెప్టెన్సీలో 2022 సీజన్‌లో 14 మ్యాచుల్లో 7 విజయాలు అందుకుంది పంజాబ్ కింగ్స్. అయినా ప్లేఆఫ్స్‌కి మాత్రం అర్హత సాధించలేకపోయింది. ఐపీఎల్ 2023 సీజన్‌కి ముందు అనిల్ కుంబ్లేని హెడ్ కోచ్ పదవి నుంచి తప్పించిన పంజాబ్ కింగ్స్.. కెప్టెన్ మయాంక్ అగర్వాల్‌ని వేలానికి వదిలేసింది...
Image credit: PTI
మినీ వేలంలో మయాంక్ అగర్వాల్ కోసం పోటీపడిన పంజాబ్ కింగ్స్, అతని కోసం రూ.8.5 కోట్లు చెల్లించడానికి సిద్ధపడలేదు. పంజాబ్ కింగ్స్ స్ట్రాటెజీపై ఆకాశ్ చోప్రా స్పందించాడు...
Image credit: PTI
‘హైదరాబాద్ తర్వాత ఎక్కువ డబ్బులు ఉన్న టీమ్ పంజాబ్ కింగ్స్. సామ్ కుర్రాన్‌ని రూ.18.25 కోట్లు పెట్టి కొనుగోలు చేశారు. సికందర్ రజాపై నమ్మకం పెట్టుకున్నారు. అయితే వీళ్లిద్దరూ పంజాబ్ కింగ్స్ కష్టాలను తీర్చేస్తారా?...
Image credit: PTI
పంజాబ్ కింగ్స్ ఇప్పుడున్న టీమ్‌ని నిర్మించింది అనిల్ కుంబ్లేనే... కుంబ్లేని సాగనంపి, అదే టీమ్‌ని దాదాపు అదే ప్లేయర్లను కొనసాగించారు....
Image credit: IPL
అనిల్ కుంబ్లే, మయాంక్ అగర్వాల్ ఇద్దరూ ఉండడం వల్లే టీమ్ గెలవలేకపోయిందని అనుకున్నారా? నాకైతే అర్థం కావడం లేదు...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా...