- Home
- Sports
- Cricket
- యశస్వి ఒక్కరాత్రిలో సూపర్ స్టార్ అయిపోయాడు! పృథ్వీ షా మొదట్లో ఇలాగే అనిపించాడు.. రికీ పాంటింగ్ కామెంట్స్...
యశస్వి ఒక్కరాత్రిలో సూపర్ స్టార్ అయిపోయాడు! పృథ్వీ షా మొదట్లో ఇలాగే అనిపించాడు.. రికీ పాంటింగ్ కామెంట్స్...
వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టులో ఆరంగ్రేటం చేసిన యశస్వి జైస్వాల్, 171 పరుగులు చేసి రికార్డులు క్రియేట్ చేశాడు. రోహిత్ శర్మతో కలిసి డబుల్ సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పిన యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీతో శతాధిక భాగస్వామ్యం నమోదు చేశాడు..

Yashasvi Jaiswal
టీమిండియా యంగ్ సెన్సేషన్ యశస్వి జైస్వాల్ గురించి ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్, ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు..
Yashasvi Jaiswal
ఐపీఎల్ 2023 సీజన్‌లో 14 ఇన్నింగ్స్‌ల్లో 163.61 సగటుతో 625 పరుగులు చేసిన యశస్వి జైస్వాల్, ఓ సెంచరీతో పాటు ఐదు హాఫ్ సెంచరీలు కూడా బాదాడు. ఓ మ్యాచ్‌లో 98 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు యశస్వి జైస్వాల్..
Yashasvi Jaiswal
‘ఐపీఎల్‌లో యశస్వి జైస్వాల్ ఆడిన ఇన్నింగ్స్‌లు చాలా స్పెషల్. అతను ఒక్కరాత్రిలో సూపర్ స్టార్ అయిపోయాడు. అండర్19 వన్డే వరల్డ్ కప్ నుంచి యశస్వి జైస్వాల్‌లో టాలెంట్ ఉందని అందరికీ తెలుసు. అయితే ఈ ఏడాది ఐపీఎల్‌లో అతను ఆడిన ఇన్నింగ్స్‌ల వల్ల ఫ్యూచర్ స్టార్ అనిపించాడు..
భారత కుర్రాళ్లలో చాలామందిలో ఎంతో టాలెంట్ ఉంది. టెస్టు క్రికెట్ ఆడేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. దేశవాళీ టోర్నీల్లో అదరగొడుతున్నా సరే, కొన్నిసార్లు ఏమీ చేయలేం. ఆన్ ది రికార్డు చెబుతున్నా.. యశస్వి జైస్వాల్‌లో ఎంత టాలెంట్ ఉందో, రుతురాజ్ గైక్వాడ్ కూడా అంతే టాలెంటెడ్ యంగ్‌స్టర్..
ఫ్యూచర్‌లో రుతురాజ్ గైక్వాడ్ మంచి టెస్టు మ్యాచ్ ప్లేయర్ అవుతాడు. త్రీ ఫార్మాట్ ప్లేయర్‌కి ఉండాల్సిన అన్ని లక్షణాలు యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్‌ల్లో ఉన్నాయి. రెండేళ్లు వెనక్కి వెళితే, పృథ్వీ షాలో నాకు ఇలాంటి టాలెంట్ కనిపించింది..
ఇప్పటికీ అతను సరిగ్గా ఫోకస్ పెడితే మూడు ఫార్మాట్లలో రాణించగలడని నమ్ముతున్నా. అయితే తన సత్తా నిరూపించుకోవడానికి పడాల్సినంత కష్టం, పృథ్వీ షా పడడం లేదు. అతని టాలెంట్‌లో మాత్రం ఎలాంటి లోపం లేదు..’ అంటూ కామెంట్ చేశాడు రికీ పాంటింగ్..