MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • అహ్మదాబాద్‌లో అయితే ఆడం.. అక్కడైతేనే ఆడతాం.. ఇక మీ ఇష్టం.. వన్దే వరల్డ్‌కప్‌పై ఐసీసీకి తేల్చి చెప్పిన పాక్

అహ్మదాబాద్‌లో అయితే ఆడం.. అక్కడైతేనే ఆడతాం.. ఇక మీ ఇష్టం.. వన్దే వరల్డ్‌కప్‌పై ఐసీసీకి తేల్చి చెప్పిన పాక్

ఆసియాకప్ - 2023 వివాదం కొనసాగుతున్న వేళ పాకిస్తాన్  క్రికెట్ జట్టు  భారత్ లో జరిగే  వన్డే వరల్డ్ కప్ లో ఆడుతుందా..? లేదా..? అన్నది ఇప్పటికైతే తేలలేదు.  దీనిపై పాకిస్తాన్ ప్రభుత్వం మాటే ఫైనల్ అని  పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) భావిస్తున్నది.  

1 Min read
Author : Srinivas M
Published : Jun 09 2023, 02:53 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ఒకపక్క ఐసీసీ.. భారత్ లో వన్డే వరల్డ్ కప్ ను సక్సెస్ చేసేందుకు అన్ని టీమ్ లను పాల్గొనేలా  చేయడంపై దృష్టి సారించింది. మిగిలిన టీమ్స్ తో ఐసీసీకి ఇబ్బందులేమీ లేకపోయినా  పాకిస్తాన్ మాత్రం  భారత్ లో ఆడటంపై   కొర్రీలు పెడుతోంది.  

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
Image credit: Wikimedia Commons

Image credit: Wikimedia Commons

ఈ ఏడాది జరుగాల్సి ఉన్న ఆసియా కప్ దాదాపుగా పాకిస్తాన్ నుంచి దూరమైన  నేపథ్యంలో పీసీబీ.. వరల్డ్ కప్ కోసం బాబర్ ఆజమ్ సేనను భారత్ లోకి పంపిస్తుందా..? లేదా..? అన్నది సందిగ్దంగానే ఉంది.   ఇదే విషయమై  చర్చించడానికి  ఐసీసీ  అధ్యక్షుడు జార్జ్ బార్క్లే  ఇటీవలే పాకిస్తాన్ లో పర్యటించారు. 

35
Image credit: Getty

Image credit: Getty

ఈ సందర్భంగా పీసీబీ అధ్యక్షుడు నజమ్ సేథీ  ఓ వింత ప్రతిపాదనను  బార్క్లే ముందు ఉంచినట్టు తెలుస్తున్నది.   భారత్  లో జరిగే వరల్డ్ కప్ లో ఆడాలంటే  తాము అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో అయితే ఆడబోమని  కోరినట్టు పీసీబీ ప్రతినిధులు తెలిపారు. 

45

ఇదే విషయమై  పీసీబీ ప్రతినిధి ఒకరు స్పందిస్తూ.. ‘ఇటీవలే పీసీబీ చీఫ్ తో సమావేశమైన ఐసీసీ ప్రతినిధులు బార్క్లే, అలార్డైస్  లకు ఆయన (నజమ్ సేథీ) ఒక విషయాన్ని అయితే క్లీయర్ గా చెప్పారు.  పాకిస్తాన్ అహ్మదాబాద్  లో మ్యాచ్ లు ఆడదు.  అందుకు బదులుగా పాక్ ఆడే మ్యాచ్ లను చెన్నై, కోల్కతా, బెంగళూరులో జరిపించాలని  కోరారు. ఒకవేళ అది  నాకౌట్, ఫైనల్  మ్యాచ్ అయితే తప్ప పాక్ మ్యాచ్ లను ఇతర వేదికలను మార్చాలని  చెప్పార’ని వెల్లడించాడు. 

55

అయితే ఇది కూడా పాకిస్తాన్ ప్రభుత్వం తమ జట్టును భారత్  లో ఆడేందుకు పంపిస్తేనే  సాధ్యమవుతుందని  కూడా పీసీబీ  చీఫ్ ఐసీసీకి తేల్చి చెప్పినట్టు సమాచారం.  భారత జట్టు ఆసియా కప్ ఆడేందుకు పాకిస్తాన్ రాబోమని  మంకు పట్టుదల ప్రదర్శిస్తుండటంతో పాక్ కూడా అదే వైఖరిని అవలంభిస్తున్నది. 

About the Author

SM
Srinivas M

Latest Videos
Recommended Stories
Recommended image1
IND vs PAK: భారత్ vs పాకిస్థాన్.. గెలుపు ఎవరిది? హెడ్ టు హెడ్ రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే !
Recommended image2
Rohit Sharma: రోహిత్ రన్ అవుట్ హైడ్రామా.. డ్రెస్సింగ్ రూమ్‌లో అసలు ఏం జరిగింది? గిల్ ఏం చెప్పాడంటే?
Recommended image3
IND vs AFG : ఆఫ్ఘనిస్తాన్‌పై గిల్ ఊచకోత.. కేఎల్ రాహుల్ మాస్ రాంపేజ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved