బాబర్ అజమ్‌కి గాయం... న్యూజిలాండ్ సిరీస్ నుంచి తప్పుకున్న పాక్ క్రికెటర్..

First Published Dec 13, 2020, 12:02 PM IST

పాకిస్తాన్ యంగ్ కెప్టెన్ బాబర్ అజమ్ గాయం కారణంగా న్యూజిలాండ్‌తో జరిగే టీ20 సిరీస్‌కు దూరం కానున్నాడు. జింబాబ్వే, ఆఫ్ఘనిస్తాన్ వంటి దేశాలపై బ్యాటుతో చెలరేగుతూ, విరాట్ కోహ్లీకి సమానుడిగా పాక్ మాజీలతో ప్రశంసలు పొందిన బాబర్ అజమ్... న్యూజిలాండ్ సిరీస్‌లో విఫలమైతే విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. పసికూనలపై తన ప్రతాపం చూపిస్తూ స్టార్ బ్యాట్స్‌మెన్‌గా చెప్పుకునే అజమ్... కివీస్ టూర్‌కి ముందు కావాలనే తప్పుకున్నాడని అంటున్నారు టీమిండియా అభిమానులు.

టీ20 ర్యాంకింగ్స్‌లో రెండ స్థానంలో కొనసాగుతున్న బాబర్ అజమ్... పటిష్ట ప్రత్యర్థులపై పెద్దగా క్రికెట్ ఆడింది లేదు.

అందుకే కివీస్‌ బౌలర్లను వారి గడ్డ మీద ఎదుర్కోవడానికి భయపడే ఇలా గాయం సాకుతో తప్పుకున్నాడని ట్రోల్స్ వినిపిస్తున్నాయి.

కివీస్ పర్యటనలో దాదాపు 11 మంది పాక్ క్రికెటర్లు కరోనా బారినట్టు తేలింది... ఇందులో నలుగురు ఎప్పటినుంచో కోవిద్‌తో బాధపడుతున్నట్టు తేలింది...

ఐసోలేషన్, క్వారంటైన్‌లో కరోనా ఫ్రోటోకాల్ పాటించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహారించిన పాక్ క్రికెటర్లు, న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు చేత చివాట్లు కూడా తిన్నారు...

ఎంత చెప్పినా వినడం లేదని ఓ పాక్ యంగ్ స్పిన్నర్‌ను టూర్ నుంచి స్వదేశానికి పంపించేశారు కూడా... ఎట్టకేలకు పాక్ క్రికెటర్లు కరోనా నుంచి కోలుకోవడంతో ప్రాక్టీస్ మొదలెట్టారు.

ప్రాక్టీస్ సెషన్స్‌లో బాబర్ అజమ్ కుడి చేతి బొటిన వేలుకి గాయం కావడంతో అతను టీ20 సిరీస్ నుంచి తప్పుకున్నాడని ప్రకటించింది పాక్ క్రికెట్ బోర్డు...

బాబర్ అజమ్ స్థానంలో వైస్ కెప్టెన్ షాదబ్ ఖాన్ పాక్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహారించబోతున్నాడు... అయితే అతను కూడా గాయంతో సతమతమవుతుండడంతో మొదటి టీ20 ఆడడం అనుమానమే.

ఇదంతా చూస్తుంటే పాక్ క్రికెట్ జట్టు కావాలనే న్యూజిలాండ్‌తో సిరీస్ నుంచి తప్పించుకునేందుకు నానా నాటకాలు ఆడుతున్నట్టు అనిపిస్తోందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

న్యూజిలాండ్ పర్యటనకు ముందే బాబర్ అజమ్ తనను ప్రేమ పేరుతో మోసం చేసి, పదేళ్ల పాటు లైంగికంగా వాడుకున్నాడని అతనిపై సంచలన ఆరోపణలు చేసిందో మహిళ.

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?