షేక్ హ్యాండ్ వివాదం.. యూఏఈ తో మ్యాచ్‌ను పాక్ బహిష్కరించిందా?
Pakistan boycotts Asia Cup match: షేక్ హ్యాండ్ వివాదం నేపథ్యంలో పాకిస్తాన్ యూఏఈతో తమ చివరి ఆసియా కప్ లీగ్ మ్యాచ్‌ను బహిష్కరించనున్నట్టు రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఇదే జరిగితే యూఏఈ నేరుగా సూపర్-4లో చేరుతుంది. పాక్ టోర్నీ నుంచి అవుట్ అవుతుంది.

పాకిస్తాన్ సంచలన నిర్ణయం
సెప్టెంబర్ 14న దుబాయ్‌లో జరిగిన భారత్-పాకిస్తాన్ మ్యాచ్ తర్వాత భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని జట్టు పాకిస్తాన్ ఆటగాళ్లతో చేతులు కలపలేదు. ఈ ఘటనపై పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అఘా, కోచ్ మైక్ హేసన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
పీసీబీ ఈ చర్యను “అత్యంత తీవ్రమైన అవమానం”గా పరిగణించి, మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్‌పై తీవ్ర రోపణలు చేసింది. ఈ క్రమంలోనే యూఏతో జరిగే మ్యాచ్ ను పాకిస్తాన్ బహిష్కరించినట్టు రిపోర్టులు పేర్కొంటున్నాయి. అయితే, దీనిపై అధికారిక ప్రకటన రాలేదు.
పీసీబీ డిమాండ్లు, ఐసీసీ స్పందనలు ఇవే
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) వెంటనే చర్య తీసుకుని, ఆండీ పైక్రాఫ్ట్‌ను భవిష్యత్తులో తమ మ్యాచ్‌ల నుంచి తప్పించాలని ఐసీసీని కోరింది. లేదంటే యూఏఈ మ్యాచ్‌ను బహిష్కరిస్తామని హెచ్చరించింది. అయితే ఐసీసీ ఈ డిమాండ్‌ను తిరస్కరించింది. ఆండీ పైక్రాఫ్ట్ స్థానంలో రిచీ రిచర్డ్సన్‌ను నియమించే ప్రయత్నం జరిగిందని సమాచారం వచ్చినా, కొన్ని వర్గాలు ఆండీ పైక్రాఫ్ట్ కొనసాగుతారని పేర్కొంది.
ఆసియా కప్ మ్యాచ్ ను బహిష్కరించిన పాక్
ఐసీసీతో చర్చలు సఫలం కాకపోవడంతో పాకిస్తాన్ తమ ప్రీ-మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌ను రద్దు చేసింది. ఆటగాళ్లను హోటల్‌లోనే ఉంచాలని సూచించింది. ఈ క్రమంలోనే యూఏఈతో జరగాల్సిన ఆసియా కప్ గ్రూప్ మ్యాచ్‌ను బహిష్కరించినట్టు పలు నివేదికలు పేర్కొంటున్నాయి. ఈ పరిణామం నేపథ్యంలో ఏసీసీ తమ సోషల్ మీడియా పోస్టును తొలగించడం మరింత గందరగోళానికి దారితీసింది.
టోర్నమెంట్‌పై ప్రభావం
మ్యాచ్ బహిష్కరణతో యూఏఈకి రెండు పాయింట్లు లభిస్తాయి. దీంతో భారత్‌తో పాటు యూఏఈ కూడా సూపర్-4లోకి చేరుతుంది. పాకిస్తాన్ ఒమన్‌పై ఒక్క సాధించింది. భారత్ చేతిలో ఓడిపోయింది. మూడో మ్యాచ్ ను యూఏఈతో ఆడాల్సింది.
క్రికెట్ సంబంధాలపై దెబ్బ
పాక్ చర్యలతో ఆసియా కప్ సమీకరణాలకే కాదు, భారత్-పాకిస్తాన్ క్రికెట్ సంబంధాలకు కూడా మరింత దెబ్బ తగిలింది. పాకిస్తాన్ చర్యలతో భవిష్యత్తు ద్వైపాక్షిక సిరీస్‌లపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. పాకిస్తాన్ బహిష్కరణ నిర్ణయం ఆసియా కప్‌లో మరో పెద్ద సంచలనంగా నిలిచింది.