MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Update
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
Maremma Movie Review
Yash Ramayana Movie Remuneration
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Sports
  • Cricket
  • సచిన్ టెండూల్కర్‌ ఇన్నింగ్స్‌లో సిక్స్ కాదు, ఏకంగా 8, 12 పరుగులు! ఇది టీ20 కాదు, అంతకుమించి...

సచిన్ టెండూల్కర్‌ ఇన్నింగ్స్‌లో సిక్స్ కాదు, ఏకంగా 8, 12 పరుగులు! ఇది టీ20 కాదు, అంతకుమించి...

సాధారణంగా క్రికెట్‌లో బౌండరీ లైన్ 60-75 మీటర్ల దూరం ఉంటుంది. 60 కాదు కదా, 120 మీటర్ల దూరం కొట్టినా కూడా అది సిక్సర్‌గా గుర్తిస్తారు. ఓ బాల్‌కి బ్యాట్స్‌మెన్‌కి వచ్చే అత్యధిక పరుగులు ఆరంటే ఆరే. అయితే ఒకే బంతికి 12 పరుగులు రావడం ఎప్పుడైనా చూశారా..  

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : Jun 17 2023, 06:39 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110
Sachin Razzaq

Sachin Razzaq

గల్లీ క్రికెట్‌లో ఇలాంటి రూల్స్ ఉండొచ్చు. కానీ అంతర్జాతీయ క్రికెట్‌లోనే ఇలా జరిగింది... సచిన్ టెండూల్కర్ 27 బంతుల్లో 72 పరుగులు చేసిన ఓ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు బాదిన సచిన్ టెండూల్కర్, 267 స్ట్రైయిక్ రేటుతో పరుగులు చేశాడు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210

అయితే సచిన్ ఇన్నింగ్స్‌లో సిక్సర్లు మాత్రమే కాదు, రెండు 8లు, ఓ 12 పరుగులు ఉండడం చూసి అభిమానులు షాక్ అవుతున్నారు. ఫోర్లు, సిక్సర్లు మాత్రమే తెలిసిన క్రికెట్ ఫ్యాన్స్‌కి ఇంతకుముందు ఓ బంతికి 8 పరుగులు, 12 పరుగులు కూడా ఇచ్చేవాళ్లా? అనే అనుమానం కలుగుతోంది... 

310
sachin batting 2003

sachin batting 2003

నిజానికి టెస్టు క్రికెట్ వచ్చినప్పటి నుంచి మాగ్జిమం 6 పరుగులు మాత్రమే ఉండేవి. 8, 12 పరుగులు అనేవి లేవు... అయితే టీ20 ఫార్మాట్‌ రావడానికి ముందు 2002లో ప్రయోగాత్మకంగా న్యూజిలాండ్ టూర్‌లో 10-10 ఫార్మాట్‌లో ఓ మ్యాచ్ ఆడింది టీమిండియా.

410

న్యూజిలాండ్ మాజీ కెప్టెన్, కామెంటేటర్ మార్టిన్ క్రో ఈ ప్రయోగాత్మక ఫార్మాట్‌ని కనిపెట్టాడు...  పేరుకి 10 ఓవర్ల మ్యాచ్ అయినా ఓవర్‌కి ఆరుకి బదులుగా 8 బంతులు వేస్తారు. అలాగే టెస్టు మ్యాచ్ మాదిరిగా నాలుగు ఇన్నింగ్స్‌ల్లో మ్యాచులు సాగుతాయి. అంటే 10 ఓవర్ల చొప్పున తొలి ఇన్నింగ్స్, రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేయాల్సి ఉంటుందన్న మాట...

510
Sachin Tendulkar

Sachin Tendulkar

తుది జట్టులో 13 మంది ప్లేయర్లు ఆడవచ్చు. ఇందులో 3 బ్యాటర్లు, 2 ఇద్దరు ఆల్‌రౌండర్లు. 3 బౌలర్లు, ఓ వికెట్ కీపర్, నలుగురు ఫీల్డర్లు ఉంటారు. ఈ ఫార్మాట్‌లో ఎల్బీడబ్ల్యూ ఉండనే ఉండదు. అంటే వికెట్ల ముందు మోకాళ్లకు తగిలితే ఏ బ్యాటర్ అవుట్ అవ్వడు...

610
Image credit: Getty

Image credit: Getty

నో బాల్ వేస్తే, ఫ్రీ హిట్ ఇస్తారు. ఆ బంతికి రనౌట్ అయితే తప్ప, బ్యాట్స్‌మెన్ మరో విధంగా అవుటయ్యే అవకాశం ఉండదు. అలాగే వైడ్ వేస్తే స్ట్రైయికింగ్‌లో ఉన్న బ్యాటర్‌కి 2 పరుగులు ఇస్తారు. ఐదుగురు బ్యాటర్లకు మాత్రమే బ్యాటింగ్ చేసే అవకాశం ఉంటుంది. ఆ ఐదుగురు అవుట్ అయితేనే మిగిలినవారికి బ్యాటింగ్ చేసే అవకాశం దక్కుతుంది...

710

అలాగే బౌలర్ బంతిని వేసేవరకూ బ్యాట్స్‌మెన్‌కి ముందు ఉండే 30 మీటర్లను మ్యాక్స్ జోన్‌‌లో ఏ ఫీల్డర్ కూడా ఫీల్డింగ్ చేయకూడదు. ఈ మ్యాక్స్‌ జోన్‌లో సిక్సర్ కొడితే, అది 12 పరుగులుగా... ఫోర్ కొడితే 8 పరుగులుగా బ్యాట్స్‌మెన్‌ ఖాతాలో చేరతాయి..
 

810

2002లో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ ఫార్మాట్‌ జనాలకి అర్థం కాలేదు, అందుకేనేమో పెద్దగా సక్సెస్ కాలేదు. అయితే టీ20 ఫార్మాట్‌ రావడానికి ఇదే కారణమైంది. నో బాల్ ఫ్రీ హిట్‌తో పాటు పవర్ ప్లే ఫీల్డింగ్ సెట్టింగ్స్ కూడా మార్టిన్ క్రో ప్రయోగాత్మక సిరీస్ నుంచే తీసుకున్నారు...

910
Sachin Tendulkar

Sachin Tendulkar

2002లో ఇండియా, న్యూజిలాండ్ మధ్య జరిగిన 10-10 ఓవర్ల మ్యాచ్‌లో కివీస్ 21 పరుగుల తేడాతో గెలిచింది. తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ 123 పరుగులు చేసింది. 

1010

సచిన్ ధనాధన్ ఇన్నింగ్స్ కారణంగా టీమిండియా 133 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ 118 పరుగులు చేయగా ఆఖరి ఇన్నింగ్స్‌లో సచిన్ 5 పరుగులకే అవుట్ కావడంతో టీమిండియా 87 పరుగులు చేయగలిగింది..

About the Author

CR
Chinthakindhi Ramu

Latest Videos
Recommended Stories
Recommended image1
స‌చిన్ టెండూల్క‌ర్‌కు ఎయిర్‌పోర్టులో మెట‌ల్ డిటెక్ట‌ర్ చెకింగ్ ఉండదు.. ఎందుకో తెలుసా.?
Recommended image2
Ishan Kishan: 30 ఫోర్లు, 7 సిక్సర్లతో 270 పరుగులు.. భారత ప్లేయర్ విధ్వంసం
Recommended image3
Duleep Trophy: దులీప్ ట్రోఫీలో రచ్చ.. వైభవ్ సూర్యవంశీ వైపు కొట్టేలా వెళ్లిన తిలక్ వర్మ.. ఏం జరిగిందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved