షారుక్ ఖాన్ కాదు, రణవీర్ సింగ్ కాదు.. ఇండియాలో No.1 సెలబ్రిటీ ఎవరు?
Top 10 Richest Indian Celebrities: భారత క్రికెట్ స్టార్ విరాట్ కోహ్లీ బాలీవుడ్ స్టార్స్ షారుక్ ఖాన్, రణవీర్ సింగ్‌లను దాటేసి టాప్ సెలబ్రిటీ బ్రాండ్‌గా నిలిచాడు. క్రాల్ 2024 రిపోర్ట్ ప్రకారం, కోహ్లీ ₹2,050 కోట్ల బ్రాండ్ విలువను కలిగి ఉన్నాడు.

క్రాల్ రిపోర్ట్ 2024: టాప్ లో విరాట్ కోహ్లీ
భారత క్రికెట్ స్టార్, రన్ మిషన్ విరాట్ కోహ్లీ మరోసారి తానే కింగ్ అని నిరూపించుకున్నాడు. క్రాల్ (Kroll) విడుదల చేసిన Celebrity Brand Valuation Report 2024 ప్రకారం.. కోహ్లీ బ్రాండ్ విలువ 231.1 మిలియన్ డాలర్లు (సుమారు రూ.2,050 కోట్లు)కి చేరింది. దీంతో ఆయన వరుసగా మూడో ఏడాది కూడా భారత్‌లో అత్యధిక బ్రాండ్ విలువ కలిగిన సెలబ్రిటీగా నిలిచారు.
KNOW
భారత్ లో టాప్ 10 సెలబ్రిటీలు వీరే (బ్రాండ్ విలువలో)
1. విరాట్ కోహ్లీ – $231.1 మిలియన్
2. రణవీర్ సింగ్ – $170.7 మిలియన్
3. షారుక్ ఖాన్ – $145.7 మిలియన్
4. అలియా భట్ – $116.4 మిలియన్
5. సచిన్ టెండూల్కర్ – $112.2 మిలియన్
6. అక్షయ్ కుమార్ – $108.0 మిలియన్
7. దీపికా పదుకొణె – $102.9 మిలియన్
8. మహేంద్ర సింగ్ ధోని – $102.9 మిలియన్
9. హృతిక్ రోషన్ – $92.2 మిలియన్
10. అమితాబ్ బచ్చన్ – $83.7 మిలియన్
క్రికెట్ కింగ్ నుంచి నుంచి టాప్ బ్రాండ్ వరకు : విరాట్ కోహ్లీ
2025 మేలో టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అయిన విరాట్ కోహ్లీ.. భారత క్రికెట్‌లో నాలుగో అత్యధిక రన్స్ చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఆయన వ్యక్తిగత నెట్‌వర్త్ రూ.1,050 కోట్లకు పైగా ఉంది. క్రికెట్ కాంట్రాక్టులు, బ్రాండ్ ఎండార్స్‌మెంట్లు, పెట్టుబడులు ఆయన సంపదలో ప్రధానపాత్ర పోషిస్తున్నాయి. గతేడాది టీ20 ప్రపంచ కప్ ను భారత్ గెలుచుకున్న తర్వాత కోహ్లీ టీ20 క్రికెట్ కు కూడా వీడ్కోలు పలికాడు. ప్రస్తుతం వన్డే క్రికెట్ లోనే కొనసాగుతున్నాడు. అయినప్పటికీ బ్రాండ్ విలువలో కోహ్లీ టాప్ లో కొనసాగుతున్నాడు.
బాలీవుడ్ నుంచి రణవీర్ సింగ్, షారుక్ ఖాన్
బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ రెండో స్థానంలో నిలిచాడు. ఆయన బ్రాండ్ విలువ $170.7 మిలియన్లు. రణవీర్ ప్రస్తుతం "ధురంధర్" సినిమా షూటింగ్‌లో ఉన్నాడు, ఇది 2025 డిసెంబర్‌లో విడుదల కానుంది.
మూడో స్థానంలో షారుక్ ఖాన్ ఉన్నాడు. ఆయన బ్రాండ్ విలువ $145.7 మిలియన్లు. "జవాన్" సినిమాకు నేషనల్ ఫిల్మ్ అవార్డ్ గెలుచుకున్న తర్వాత ఆయన ప్రభావం మరింత పెరిగింది. షారుక్ నెట్‌వర్త్ రూ.7,300 కోట్లుగా అంచనా.
లిస్టులో అలియా భట్, సచిన్ టెండూల్కర్
బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ 116.4 మిలియన్ డాలర్ల బ్రాండ్ విలువతో నాలుగో స్థానంలో ఉన్నారు. ఇటీవల మిలాన్ ఫ్యాషన్ వీక్‌లో అలియా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆమె నటించిన "ఆల్ఫా" చిత్రం 2025 డిసెంబర్‌లో విడుదల కానుంది.
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కొత్త ఎండార్స్‌మెంట్లతో ఐదో స్థానంలోకి ఎగబాకాడు. ఆయన బ్రాండ్ విలువ $112.2 మిలియన్లు. 2025లో బీసీసీఐ "నామన్ అవార్డ్స్"లో సచిన్ కు Col. C.K. నాయుడు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డ్ లభించింది.
భారత్ లో అత్యధిక బ్రాండ్ విలువ కలిగిన సెలబ్రిటీలలో ధోని, దీపికా పదుకొణె
బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ $108 మిలియన్లతో ఆరో స్థానంలో నిలిచాడు. దీపికా పదుకొణె, ఎంఎస్ ధోని ఇద్దరూ సమానంగా $102.9 మిలియన్ బ్రాండ్ విలువతో ఏడో స్థానాన్ని పంచుకున్నారు.
హృతిక్ రోషన్ $92.2 మిలియన్లతో తొమ్మిదో స్థానంలో ఉన్నాడు. అమితాబ్ బచ్చన్ $83.7 మిలియన్లతో టాప్ 10 లో ఉన్నారు.
సౌత్ సినిమాల హవా
క్రాల్ రిపోర్ట్ ప్రకారం, దక్షిణ భారత సినిమాలు ఇప్పుడు మార్కెట్‌లో 47.7% వాటా సాధించాయి. బాలీవుడ్ సినిమాలు 39.5% వాటాతో రెండో స్థానంలో ఉన్నాయి. అలాగే, ఓటిటి ప్లాట్‌ఫార్ములు ఇప్పుడు పెద్ద సినిమాల కలెక్షన్లలో సగానికి పైగా ఆదాయం తెచ్చిపెడుతున్నాయి.
టాప్ 25 భారతీయ సెలబ్రిటీల కలిపిన బ్రాండ్ విలువ $2 బిలియన్ దాటింది. ఇది గత ఏడాదితో పోలిస్తే 8.6% పెరుగుదల. క్రికెటర్లు, నటులు దేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రభావం చూపుతున్నారని రిపోర్ట్ పేర్కొంది.