భువీని తీసుకోకపోవడం చాలా పెద్ద పొరపాటు, కనీసం అతనినైనా ఆడించండి...
స్వింగ్‌కి అనుకూలిస్తున్న ఇంగ్లాండ్ పిచ్‌లపై స్వింగ్ కింగ్ భువనేశ్వర్ కుమార్‌ను ఎంపిక చేయకుండా భారీ మూల్యం చెల్లించుకుంది టీమిండియా... దీంతో ఇంగ్లాండ్ సిరీస్‌లోనైనా అయినా టీమిండియా స్వార్డ్‌లో ఉన్న స్వింగ్ బౌలర్ శార్దూల్ ఠాకూర్‌ని ఆడించాలని అంటున్నాడు మాజీ క్రికెటర్ శరణ్‌దీప్ సింగ్...

‘ఇంగ్లాండ్‌లో భువనేశ్వర్ కుమార్‌కి మంచి ట్రాక్ రికార్డు ఉంది. అలాంటి భువీని ఇంగ్లాండ్ టూర్‌కి దూరంగా పెట్టడం చాలా పెద్ద పొరపాటు.

మన బెస్ట్ స్వింగ్ బౌలర్‌ను ఎంపిక చేయకపోవడం వల్ల టీమిండియా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది.
కనీసం శార్దూల్ ఠాకూర్ అయినా డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌లో భాగం చేయాల్సింది.. అయితే అది కూడా జరగలేదు. 15 మందిలో కూడా శార్దూల్ ఠాకూర్ లేడు...
సౌంతిప్టన్‌లో వర్షం పడిన తర్వాత పరిస్థితులు పేస్ ఆల్‌రౌండర్లకి అనుకూలంగా మారాయి. ఫైనల్ ఆడే జట్టును రెండు రోజుల ముందుగానే ప్రకటించారు...
ఇద్దరు స్పిన్నర్లతో టీమిండియా చాలా దృఢంగా కనిపించింది. కానీ వర్షం పడిన తర్వాత అయినా జట్టులో మార్పులు చేయాల్సింది. ఓ స్పిన్నర్‌ని తప్పించి, పేసర్‌కి అవకాశం ఇవ్వాల్సింది...
రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా బ్యాటింగ్ కూడా చేయగలరు. అయితే ఫాస్ట్ బౌలర్లలో బ్యాటింగ్ చేయగల సామర్థ్యం ఉన్న ఆల్‌రౌండర్ శార్ధూల్ ఠాకూర్ ఒక్కడే అందుబాటులో ఉన్నాడు..
అతన్ని కనీసం 15 మందితో కూడిన జట్టులో అయినా ఉంచాల్సింది. అలా చేసి ఉంటే, ఫైనల్ మ్యాచ్‌కి ముందు అతన్ని తుదిజట్టులో చేర్చే అవకాశం ఉండేది...
ఇప్పుడు భారత జట్టుకి ఉన్న ఒకే ఒక్క స్వింగ్ అస్త్రం శార్దూల్ ఠాకూర్. కనీసం అతన్ని అయినా కరెక్టుగా వాడుకోవాలి. ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌కి అతనికి అవకాశం ఇవ్వాలి...
ఇప్పుడున్న పరిస్థితుల్లో హార్ధిక్ పాండ్యాపై ఆధారపడలేమని తేలిపోయింది. అతను మూడు ఫార్మాట్లలో బౌలింగ్ వేసేంత ఫిట్‌గా లేడు.. అతను శార్దూల్ ఠాకూర్ లేదా విజయ్ శంకర్, శివమ్ దూబేల వైపు చూస్తే బెటర్...
ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్ సమయంలో భారత జట్టు రొటేషన్ పద్ధతిలో అందరికీ అవకాశం ఇస్తుందని భావిస్తున్నా. సిరాజ్‌ని ఎక్కువ మ్యాచులు ఆడించాలి.
ఎందుకంటే అతనిప్పుడు బెస్ట్ ఫామ్‌లో ఉన్నాడు. లాంగ్ గ్యాప్ వస్తే, అది అతని పర్ఫామెన్స్‌పై ప్రభావం చూపించొచ్చు... ’ అంటూ చెప్పుకొచ్చాడు మాజీ స్పిన్నర్ శరణ్‌దీప్ సింగ్...
‘మనం బౌలింగ్ విభాగం రాణిస్తూనే ఉంది. కానీ బ్యాటింగ్‌లోనే సమస్యలున్నాయి. శుబ్‌మన్ గిల్ స్వదేశంలోనే ఇంగ్లాండ్‌పైన రాణించలేకపోయాడు...
అలాగే ఛతేశ్వర్ పూజారా, అజింకా రహానేలా డిఫెన్స్ ఎక్కువగా ఆడాలని చూసినా వర్కవుట్ కాలేదు... లోయర్ ఆర్డర్‌లో పరుగులు రావడం లేదు...
ఆస్ట్రేలియాలో భారత జట్టు లోయర్ ఆర్డర్‌లో పరుగులు సాధించగలిగింది. కానీ స్వదేశంలో కానీ, డబ్ల్యూటీసీ ఫైనల్‌లో కానీ అది రిపీట్ కాలేదు. లోయర్ ఆర్డర్ రాణిస్తే విరాట్, రోహిత్‌లపై ప్రెషర్ తగ్గుతుంది’ అంటూ కామెంట్ చేశాడు మాజీ సెలక్టర్, స్పిన్నర్ శరణ్‌దీప్ సింగ్.