యజ్వేంద్ర చాహాల్ కథ ముగిసినట్టేనా! ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లోనూ చోటు మిస్...
యజ్వేంద్ర చాహాల్‌ని సెలక్టర్లు పూర్తిగా పక్కనబెట్టేసినట్టేనా? ఐపీఎల్‌లో అదరగొడుతున్నా, కౌంటీల్లో మంచి ప్రదర్శన కనబరిచినా... చాహాల్ రీఎంట్రీ ఇవ్వడం ఇక కష్టమేనా? ప్రస్తుతం పరిస్థితి చూస్తుంటే అలాగే కనిపిస్తోంది..
Sanju and Chahal
2021 టీ20 వరల్డ్ కప్ నుంచి యజ్వేంద్ర చాహాల్ బ్యాడ్ టైం మొదలైంది. నాలుగేళ్లుగా టీమిండియాకి వైట్ బాల్ క్రికెట్‌లో ప్రధాన స్పిన్నర్‌గా ఉన్న చాహాల్, 2021 టీ20 వరల్డ్ కప్‌లో చోటు దక్కించుకోలేకపోయాడు.
వరుణ్ చక్రవర్తి, రాహుల్ చాహార్ వంటి కుర్రాళ్లను ప్రపంచ కప్‌కి సెలక్ట్ చేసిన సెలక్టర్లు, విరాట్ కోహ్లీ కోరినా సరే యజ్వేంద్ర చాహాల్‌ని టీమ్‌లోకి తీసుకోవడానికి ఇష్టపడలేదు. రిజల్ట్ టీమ్ పర్ఫామెన్స్‌లో కనిపించింది..
2022 టీ20 వరల్డ్ కప్ టోర్నీకి ఎంపిక చేసిన జట్టులో యజ్వేంద్ర చాహాల్‌కి చోటు దక్కింది. అయితే హానీమూన్‌కి వెళ్లివచ్చినట్టుగా చాహాల్, ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండానే స్వదేశానికి తిరిగి వచ్చేశాడు..
Yuzvendra Chahal
ఆసియా కప్ 2023 టోర్నీకి, వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి ఎంపిక చేసిన జట్టులోనూ చాహాల్‌కి ఛాన్స్ దక్కలేదు. తాజాగా ఆస్ట్రేలియాతో జరగబోయే వన్డే సిరీస్‌లోనూ చాహాల్ చోటు దక్కించుకోలేకపోయాడు...
రవిచంద్రన్ అశ్విన్‌ని తిరిగి వన్డే ఫార్మాట్‌లోకి తీసుకొచ్చిన టీమ్ మేనేజ్‌మెంట్, స్పిన్ ఆల్‌రౌండర్‌గా వాషింగ్టన్ సుందర్‌ని ఫ్యూచర్ స్టార్‌గా తీర్చి దిద్దాలని చూస్తోంది. సుందర్, రవీంద్ర జడేజాకి రిప్లేస్‌మెంట్ అవుతాడని ఆశిస్తోంది..
Yuzvendra Chahal Kudeep Yadav
కుల్దీప్ యాదవ్ మంచి పర్ఫామెన్స్ ఇస్తుండడం, మరో ప్లేస్ కోసం స్పిన్ ఆల్‌రౌండర్ కోసం టీమ్ మేనేజ్‌మెంట్ చూస్తుండడంతో యజ్వేంద్ర చాహాల్.. తిరిగి టీమ్‌లోకి రావడం ఇప్పట్లో కష్టమే..
ఐపీఎల్ 2022 సీజన్‌లో యజ్వేంద్ర చాహాల్, పర్పుల్ క్యాప్ గెలిచాడు. అయినా సెలక్టర్లు, టీమ్ మేనేజ్‌మెంట్ అతన్ని పెద్దగా పట్టించుకోలేదు.
Ravichandran Ashwin
2023 సీజన్‌లోనూ చాహాల్ బాగానే పర్పామెన్స్ చూపించాడు. అయితే రోహిత్, రాహుల్ మాత్రం చాహాల్‌ని పూర్తిగా పక్కనబెట్టేసినట్టుంది. అవసరమైతే టెస్టు ఆల్‌రౌండర్ అశ్విన్‌ని వైట్ బాల్ క్రికెట్ ఆడించాలని చూస్తోంది కానీ, చాహాల్‌ని మాత్రం పట్టించుకోవడం లేదు... విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో వన్డే, టీ20ల్లో ప్రధాన స్పిన్నర్‌గా ఉన్న చాహాల్, ఇప్పుడు టీమ్‌లో ప్లేస్ దక్కించుకోవడానికి తెగ కష్టపడుతుండడం విశేషం.