రోహిత్ శర్మ లేకుంటే ఓటమే... ‘హిట్ మ్యాన్’ ఆడని గత ఐదు వన్డేల్లో చిత్తుగా ఓడిన విరాట్ సేన...
రోహిత్ శర్మ... పరిమిత ఓవర్ల క్రికెట్‌లో తిరుగులేని స్టార్ బ్యాట్స్‌మెన్. జోరుమీదున్నప్పుడు రోహిత్ శర్మ ఓ సూపర్ మ్యాన్‌లా బ్యాటింగ్ చేస్తాడని కామెంట్ చేశాడు విరాట్ కోహ్లీ. వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలు చేసిన ఏకైక క్రికెటర్.. అలాంటి రోహిత్ శర్మ లేకుండా ఆస్ట్రేలియా వన్డే, టీ20 సిరీస్ ఆడుతోంది భారత జట్టు. మొదటి వన్డేలో రోహిత్ శర్మ లేని లోటు స్పష్టంగా కనిపించింది. మొదటి వన్డేలో భారత జట్టు ఓటమి తర్వాత రోహిత్ శర్మను గుర్తు చేసుకుంటూ, బీసీసీఐ నిర్ణయాన్ని ట్రోల్ చేస్తున్నారు క్రికెట్ అభిమానులు.

రోహిత్ శర్మ లేకుండా టీమిండియా ఆడిన గత ఐదు వన్డే మ్యాచుల్లోనూ ఓటమి పాలైంది...
రోహిత్ శర్మ లేకుండా సేన(సౌతాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాలపై ఆడిన గత ఎనిమిది మ్యాచుల్లోనూ భారత జట్టుకి విజయం దక్కలేదు...
వన్డే, టీ20ల్లో కీలక సభ్యుడిగా కొనసాగుతున్న రోహిత్ శర్మ కీలక భాగస్వామ్యాలు నెలకొల్పుతూ జట్టును విజయతీరాలకు చేర్చేవాడు. ఇండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన సిరీస్‌ల్లో రోహిత్ పేరిటే అత్యధిక సెంచరీ భాగస్వామ్యాల రికార్డు ఉంది.
శిఖర్ ధావన్‌తో కలిసి ఆరుసార్లు సెంచరీ భాగస్వామ్యాలు నమోదుచేశాడు రోహిత్ శర్మ. ఇండియా, ఆస్ట్రేలియా మధ్య వన్డే సిరీస్ మ్యాచుల్లో ఇదే అత్యధికం...
అలాగే విరాట్ కోహ్లీతో కలిసి నాలుగుసార్లు సెంచరీ భాగస్వామ్యం నమోదుచేసిన రోహిత్ శర్మ, అజింకా రహానేతో కూడా నాలుగు సార్లు శతాధిక పార్ట్‌నర్ షిప్ నెలకొల్పాడు...
రోహిత్ శర్మ లేకుండా ఇప్పుడున్న క్రికెటర్లలో ఎవ్వరూ ఇన్నిసార్లు సెంచరీ భాగస్వామ్యాల్లో భాగం పంచుకోలేదు. ఇదే వన్డేల్లో రోహిత్ ప్రాధాన్యం ఏంటో తెలుపుతోంది...
మొదటి వన్డేలో ఓడినా టీమిండియా రెండో వన్డే నుంచి మంచి కమ్ బ్యాక్ ఇస్తుందని ఆశిస్తున్నారు విరాట్ కోహ్లీ అభిమానులు. ఇంతకుముందు మొదటి వన్డేలో టీమిండియా ఓడిన సిరీస్‌ల్లో ఫలితం భారత జట్టుకి అనుకూలంగా రావడమే దీనికి కారణం.
2019 జనవరిలో ఆస్ట్రేలియాతో మొదటి వన్డేలో ఓడిన భారత జట్టు, సిరీస్‌ను గెలుచుకుంది. 2020 జనవరిలో జరిగిన సిరీస్‌లనూ ఇదే జరిగింది. 2019 మార్చిలో జరిగిన సిరీస్‌లో మొదటి వన్డే భారత జట్టు గెలవగా, సిరీస్ ఆస్ట్రేలియా వశమైంది.
మొదటి వన్డేలో విఫలమైన విరాట్ కోహ్లీ, రెండో వన్డేలో సత్తా చాటుతాడని అంటున్నారు అభిమానులు. గత కొంత కాలంగా ఆసీస్‌తో జరిగిన వన్డే సిరీసుల్లో రెండో మ్యాచ్‌లో విరాట్ చేసిన పరుగులే ఇందుకు పర్ఫెక్ట్ ఉదాహరణ అంటున్నారు.
గత ఏడు సిరీసుల్లో ఆసీస్‌తో జరిగిన రెండో వన్డేలో నాలుగు సెంచరీలు, మూడు హాఫ్ సెంచరీలు చేశాడు విరాట్ కోహ్లీ. అత్యధిక స్కోరు 118 కాగా, అత్యల్ప స్కోరు 59 పరుగులు...
2017 నుంచి ఇప్పటిదాకా జరిగిన ప్రతీ సిరీస్‌లోనూ రెండో వన్డేలో విరాట్ కోహ్లీ కెప్టెన్సీలోని భారత జట్టు విజయం సాధించింది. ఎలా చూసుకున్నా రేపు జరిగే మ్యాచ్‌లో టీమిండియాదే విజయం అంటున్నారు అభిమానులు.