MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • అశ్విన్‌ను తీవ్రంగా అవమానించారు.. ఏ స్టార్ క్రికెటర్‌కు అయినా ఇలా జరిగిందా..? గవాస్కర్ ఆగ్రహం

అశ్విన్‌ను తీవ్రంగా అవమానించారు.. ఏ స్టార్ క్రికెటర్‌కు అయినా ఇలా జరిగిందా..? గవాస్కర్ ఆగ్రహం

WTC Final 2023: టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ ను డబ్ల్యూటీసీ ఫైనల్  నుంచి తప్పించడంపై  మాజీ సారథి సునీల్ గవాస్కర్ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశాడు. 

2 Min read
Author : Srinivas M
Published : Jun 13 2023, 03:14 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

రెండ్రోజుల క్రితం ఇంగ్లాండ్ వేదికగా ముగిసిన డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ లో   భారత స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ‌ను  తుది జట్టులోకి తీసుకోకపోవడంపై  సునీల్ గవాస్కర్ మరోసారి  తీవ్రంగా స్పందించాడు. ఇది అతడిని అవనమానించడమేనని అన్నాడు. 

26

మిడ్ డే కు రాసిన వ్యాసంలో  గవాస్కర్... ‘ఈ మధ్యకాలంలో  ఏ టాప్ క్లాస్ ఇండియన్ క్రికెటర్ కు కూడా ఇంత అవమానం జరుగలేదు.  ఇదే అశ్విన్ ప్లేస్ లో  ఎవరైనా వరల్డ్ నెంబర్ వన్ బ్యాటర్ ఉండి ఉంటే అతడు కొద్దిరోజులుగా సరిగా ఆడటం లేదనో లేక  డ్రై స్పిన్ పిచ్ లపై   ఆడడనో.. బౌన్సీ పిచ్ పై పరుగులు తీయడం  చేతకాదనే కారణంతో  పక్కనబెడతారా..? అస్సలు అలా చేయరు. 

36

అశ్విన్ ను తుది జట్టు నుంచి తప్పించడం కరెక్ట్ కాదు. ఇప్పుడు ఏ వివరణ ఇచ్చినా  దాని వల్ల ఉపయోగం లేదు. భారత బౌలింగ్ తీరు చూడండి. ఎంత దారుణంగా ఉందో.. టీమిండియా  టెస్టులలో వరల్డ్ నెంబర్ వన్ బౌలర్ ను బెంచ్ మీద  కూర్చోబెట్టింది. 

46
Image credit: Getty

Image credit: Getty

ఆస్ట్రేలియా జట్టులో ఐదుగురు లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లు ఉన్నారు.   ఇందులో ఫస్ట్ ఇన్నింగ్స్ లో ట్రావిస్  హెడ్ ఏకంగా సెంచరీ సాధించాడు.  మరో లెఫ్ట్  హ్యాండర్  అలెక్స్ కేరీ తొలి ఇన్నింగ్స్ లో 48, రెండో ఇన్నింగ్స్ లతో 66 పరుగులు చేశాడు. అశ్విన్ ఉండుంటే  కచ్చితంగా వీళ్ల స్కోర్లు ఇలా ఉండేవి కావు.  
 

56

ఒకదశలో  130 లోపే ఐదు వికెట్లు పడ్డా భారత బౌలర్లు ఆ అవకాశాన్ని సరిగా సద్వినియోగం చేసుకోలేకపోయారు.  అందుకే ఆస్ట్రేలియా భారీ స్కోరు  సాధించింది.  ఒకవేళ అశ్విన్ ఉంటే ఏదైనా  జరిగే అవకాశముండేది. అశ్విన్ బ్యాట్ తో కూడా రాణించేవాడు...’ అని రాసుకొచ్చాడు. 

66

భారత బ్యాటర్ల  షాట్ సెలక్షన్ పై కూడా  గవాస్కర్  విమర్శలు గుప్పించాడు.  రెండు ఇన్నింగ్స్ లలోనూ భారత బ్యాటర్లు   రోహిత్ శర్మ, పుజారా, విరాట్ కోహ్లీల షాట్ సెలక్షన్ చాలా చెత్తగా ఉందని  విమర్శించాడు.  

About the Author

SM
Srinivas M
Latest Videos
Recommended Stories
Recommended image1
CSK : ధోనీ మాస్టర్ మైండ్.. ఐపీఎల్ 2026 కోసం చెన్నై సూపర్ కింగ్స్ అదిరిపోయే స్కెచ్!
Recommended image2
Sanju : ధోనీ, హార్దిక్‌లకు సంజూ షాక్.. ఇది కదా మాస్ ఎంట్రీ అంటే !
Recommended image3
IPL 2026 : లక్ ఎంతో కాలం ఉండదు బాసూ ! వైభవ్ సూర్యవంశీకి మాస్ వార్నింగ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved