- Home
- Sports
- Cricket
- 70 సెంచరీలు చేసిన విరాట్ కోహ్లీని ప్రశ్నించే హక్కు, మనకెవ్వరికీ లేదు... - క్రికెటర్ రాబిన్ ఊతప్ప...
70 సెంచరీలు చేసిన విరాట్ కోహ్లీని ప్రశ్నించే హక్కు, మనకెవ్వరికీ లేదు... - క్రికెటర్ రాబిన్ ఊతప్ప...
ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో విరాట్ కోహ్లీ ఫామ్ గురించే చర్చ జరుగుతోంది. పాకిస్తాన్, ఆస్ట్రేలియా, టీమిండియా... ఇలా మాజీ క్రికెటర్లు అందరూ విరాట్ కోహ్లీ గురించి తమకు నచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఈ చర్చలపై భారత సీనియర్ క్రికెటర్ రాబిన్ ఊతప్ప ఫైర్ అయ్యాడు...

టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా ఉన్న విరాట్ కోహ్లీ, టాప్‌లో ఉన్న రోహిత్ శర్మ కంటే బెటర్ యావరేజ్‌తో పరుగులు చేశాడు. అయితే టీ20 వరల్డ్ కప్ 2022లో ఫామ్‌లో లేని కోహ్లీని ఆడించడం కంటే ఫామ్‌లో ఉన్న యంగ్ ప్లేయర్‌కి చోటు ఇవ్వాలని కపిల్ దేవ్ చేసిన కామెంట్లు హాట్ టాపిక్ అయ్యాయి...
విరాట్ కోహ్లీ ఇప్పుడు ఆడుతున్న విధానం చూశాక తాను సెలక్టర్‌ని అయితే అతనికి టీమ్‌లో చోటు ఇవ్వనని భారత మాజీ క్రికెటర్ పార్థివ్ పటేల్ కామెంట్ చేయడం, ఆర్పీ సింగ్ కూడా ఈ వ్యాఖ్యలను సపోర్ట్ చేయడం... ఫ్యాన్స్‌కి ఆగ్రహాన్ని తెప్పించాయి..
2019లో చివరిగా సెంచరీ చేసిన విరాట్ కోహ్లీ, రెండున్నరేళ్లుగా సెంచరీ అందుకోలేకపోతున్నాడు. సెంచరీ లేకుండా 100కి పైగా మ్యాచులు కూడా ఆడేశాడు విరాట్ కోహ్లీ...
‘విరాట్ కోహ్లీ సెంచరీల మీద సెంచరీలు చేస్తున్నప్పుడు ఎవ్వరూ కూడా అతను ఇలా ఆడాలి, అలా ఆడాలి... అని చెప్పే సాహసం చేయలేదు. మంచిగా ఆడినప్పుడు మాట్లాడనప్పుడు, ఇప్పుడు కూడా మాట్లాడే అర్హత ఎవ్వరికీ లేదు...
అయినా 70 సెంచరీలు చేసిన ప్లేయర్‌ని ఎలా ఆడాలో మనం చెప్పగలమా. అతను తన సొంత టాలెంట్‌తోనే ఆ 70 సెంచరీలు చేశాడు. అదే టాలెంట్‌తో మరో 30 లేదా 35 సెంచరీలు చేస్తాడు...
అతన్ని ఒంటరిగా వదిలేసి, ఆయన ఆట ఆయన్ని ఆడనివ్వాలి. తాను ఫామ్‌లోకి రావడానికి ఏం చేయాలో విరాట్ కోహ్లీకి బాగా తెలుసు. ఎందుకంటే సమస్య ఏంటో కూడా అతనికే తెలుసు...
కొన్నిసార్లు సలహాలు చెప్పడం కంటే కాస్త స్పేస్ ఇచ్చి ఏకాంతంగా వదిలేయడమే మంచిది. బ్రేక్ కావాలని అనుకుంటే బ్రేక్ తీసుకోనివ్వండి. ఆడాలని అనుకుంటే ఆడనివ్వండి...
Virat Kohli
జట్టులో అతని ప్లేస్ గురించి ఇంత రాద్ధాంతం అవసరం లేదు. ఎందుకంటే విరాట్ కోహ్లీ బై బర్త్ మ్యాచ్ విన్నర్. ప్రపంచంలో వన్ ఆఫ్ బెస్ట్ ప్లేయర్... అతన్ని ప్రశ్నించే హక్కు, అధికారం మనకెవ్వరికీ లేవు...
Image credit: Getty
ఎందుకంటే ఇప్పటికే విరాట్ కోహ్లీ ఒంటిచేత్తో చాలా మ్యాచులు గెలిపించాడు. ఇకపై గెలిపించగలడు కూడా...’ అంటూ కామెంట్ చేశాడు భారత క్రికెటర్ రాబిన్ ఊతప్ప...