- Home
- Sports
- Cricket
- ఆ ఇద్దరూ లేకున్నా శిఖర్ ధావన్‌తో ఓపెనింగ్ కోసం నలుగురి పోటీ... గిల్‌కి అవకాశం దక్కేనా...
ఆ ఇద్దరూ లేకున్నా శిఖర్ ధావన్‌తో ఓపెనింగ్ కోసం నలుగురి పోటీ... గిల్‌కి అవకాశం దక్కేనా...
వెస్టిండీస్ పర్యటనలో భాగంగా శుక్రవారం జూలై 22న తొలి వన్డే ఆడనుంది భారత జట్టు. సీనియర్లు, ఇంగ్లాండ్ టూర్‌లో పాల్గొన్న జట్టులో మెజారిటీ ప్లేయర్లకు ఈ వన్డే సిరీస్ నుంచి విశ్రాంతి కల్పించింది భారత జట్టు. రిజర్వు బెంచ్ ప్లేయర్లతో నిండిన ఈ టీమ్‌లోనూ పోటీ మామూలుగా లేదు...

సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ కెప్టెన్‌గా వ్యవహరించే వన్డే సిరీస్‌లోనూ ఓపెనింగ్ పొజిషన్ కోసం ముగ్గురూ పోటీపడుతున్నారు... ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, శుబ్‌మన్ గిల్‌లలో ఎవరికి ఓపెనింగ్ చేసే అవకాశం దొరుకుతుందనేది ఆసక్తికరంగా మారింది...
Image credit: PTI
ఇషాన్ కిషన్: ఆరంగ్రేటం మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేసి అదరగొట్టిన ఇషాన్ కిషన్, ఓపెనర్‌గా కంటే వన్‌డౌన్ లేదా మిడిల్ ఆర్డర్‌లోనే వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. దీనికి ప్రధాన కారణం ఇషాన్ కిషన్ లెఫ్ట్ హ్యాండర్ బ్యాటర్... శిఖర్ ధావన్ కూడా లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ కావడంతో ఇద్దరినీ ఓపెనింగ్ చేయించే అవకాశం లేదు...
శుబ్‌మన్ గిల్: ఐపీఎల్‌లో నిలకడైన ప్రదర్శన ఇస్తూ టెస్టు టీమ్‌లో నుంచి వన్డే టీమ్‌లోకి కూడా ప్రమోషన్ పొందాడు శుబ్‌మన్ గిల్. 2019 న్యూజిలాండ్ టూర్‌లో వన్డే ఆరంగ్రేటం చేసిన శుబ్‌మన్ గిల్, ఇప్పటిదాకా 3 వన్డేలు ఆడి 49 పరుగులు మాత్రమే చేయగలిగాడు...
ఒకవేళ శిఖర్ ధావన్‌తో కలిసి శుబ్‌మన్ గిల్ ఓపెనింగ్ చేస్తే... అతను దాదాపు మూడేళ్ల తర్వాత వన్డే ఫార్మాట్‌లోకి రీఎంట్రీ ఇచ్చినట్టు అవుతుంది. లిస్టు ఏ క్రికెట్‌లో 58 మ్యాచులు ఆడి 45.35 సగటుతో 2313 పరుగులు చేసిన గిల్, తుదిజట్టులో అవకాశం దక్కించుకుంటాడా? అనేది ఆసక్తికరంగా మారింది..
Image credit: PTI
రుతురాజ్ గైక్వాడ్: ఐపీఎల్ 2021 సీజన్‌లో ఆరెంజ్ క్యాప్ గెలిచి, అతి పిన్న వయసులో ఈ ఫీట్ సాధించిన ప్లేయర్‌గా నిలిచాడు రుతురాజ్ గైక్వాడ్. ఆ తర్వాత సయ్యద్ ముస్తాక్ ఆలీ, విజయ్ హాజరే ట్రోఫీల్లో రికార్డులు క్రియేట్ చేసినా రుతురాజ్ గైక్వాడ్‌కి రావాల్సినన్ని అవకాశాలు అయితే రాలేదు...
శ్రీలంకతో, సౌతాఫ్రికాతో, వెస్టిండీస్‌తో స్వదేశంలో జరిగిన వన్డే సిరీస్‌లకు ఎంపికైనా ఇప్పటిదాకా రుతురాజ్ గైక్వాడ్... 50 ఓవర్ల ఫార్మాట్‌లో ఆరంగ్రేటం చేయలేదు. టీ20ల్లో పెద్దగా మెప్పించకపోయినా రుతురాజ్ గైక్వాడ్, వన్డేల్లో రాణించగలడని క్రికెట్ ఎక్స్‌పర్ట్స్ అభిప్రాయం...
Sanju Samson
సంజూ శాంసన్: దేశవాళీ టోర్నీల్లో రాణిస్తూ అంతర్జాతీయ క్రికెట్‌లో చెప్పుకోదగ్గ ఛాన్సులు దక్కించుకోలేకపోతున్న ప్లేయర్లలో సంజూ శాంసన్ ఒకడు. 7 ఏళ్ల కెరీర్‌లో 15 మ్యాచులు ఆడిన సంజూ శాంసన్, గత ఏడాది శ్రీలంక టూర్‌లో ఓ వన్డే మ్యాచ్ ఆడాడు..
Sanju Samson
వన్డే ఆరంగ్రేటం మ్యాచ్‌లో 46 పరుగులు చేసిన సంజూ శాంసన్, శిఖర్ ధావన్‌తో కలిసి ఓపెనింగ్ చేస్తే బాగుంటుందనేది అభిమానుల ఆకాంక్ష. ఐర్లాండ్‌పై రెండో టీ20లో అద్భుత హాఫ్ సెంచరీతో అదరగొట్టినా ఆ తర్వాత ఒక్క మ్యాచ్ ఆడలేకపోయిన సంజూ శాంసన్‌కి ఈసారైన సరైన అవకాశాలు ఇవ్వాలని కోరుకుంటున్నారు అభిమానులు...
Image credit: Getty
కెఎల్ రాహుల్, రోహిత్ శర్మ వంటి ఇద్దరు రెగ్యూలర్ ఓపెనర్లు ఈ వన్డే సిరీస్‌కి అందుబాటులో లేకపోయినా ఓపెనింగ్ పొజిషన్ కోసం ఏకంగా ఐదుగురు పోటీపడుతుండడం భారత జట్టు రిజర్వు బెంచ్ ఏ రేంజ్‌లో ఉందో చెప్పడానికి పర్ఫెక్ట్ ఉదాహరణ...