- Home
- Sports
- Cricket
- అందుకే ఆంధ్రాకి ఐపీఎల్ టీమ్ లేదు... టీమిండియా మాజీ చీఫ్ సెలక్టర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్...
అందుకే ఆంధ్రాకి ఐపీఎల్ టీమ్ లేదు... టీమిండియా మాజీ చీఫ్ సెలక్టర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్...
ఐపీఎల్‌లో హైదరాబాద్‌కి ఒకటికి రెండు టీమ్స్ ఉన్నాయి. 2008లో వచ్చిన డెక్కన్ ఛార్జర్ హైదరాబాద్, 2009లో టైటిల్ గెలిచింది. ఆ టీమ్ ప్లేస్‌లో 2012లో వచ్చిన సన్‌రైజర్స్ హైదరాబాద్, 2016లో ఐపీఎల్ టైటిల్ గెలిచింది...

Image credit: PTI
తెలంగాణ రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ పేరుతో ఐపీఎల్ టీమ్ లేదని చాలా మంది ఫీల్ అయ్యారు. హైదరాబాద్ టీమ్ కావడం వల్లే చాలామంది ఆంధ్రా జనాలు, ఇది తమ టీమ్ కాదని, సన్‌రైజర్స్‌కి సపోర్ట్ కూడా చేయడం లేదు...
Image credit: PTI
ఆంధ్రా, వైజాగ్ పేర్లతో ఐపీఎల్ టీమ్స్ తీసుకురావడానికి ప్రయత్నాలు జరిగాయి, జరుగుతున్నాయి. వైజాగ్ వారియర్స్ పేరుతో రామ్ చరణ్, ఓ ఐపీఎల్ టీమ్ తీసుకురావాలని ప్రయత్నిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి...
అయితే మరో రెండు మూడేళ్ల దాకా ఐపీఎల్‌లో కొత్త టీమ్స్ వచ్చే అవకాశం లేదు. ఒకవేళ కొత్త టీమ్స్ వచ్చినా అందులో ఆంధ్రప్రదేశ్ నుంచి ఐపీఎల్ టీమ్ ఉంటుందో లేదో చెప్పడం కూడా కష్టమే.. తాజాగా బీసీసీఐ మాజీ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ ఈ విషయం గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడాడు..
Image credit: PTI
‘మిగిలిన రాష్ట్రాల కంటే ఆంధ్రాలో క్రికెట్‌కి విపరీతమైన క్రేజ్ ఉంది. అయితే ఐపీఎల్ టీమ్ అనేది రాష్ట్రాల పేరు మీద ఉండదు. సౌత్ నుంచి ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్స్ ఉన్నాయి..
Image credit: PTI
ఈశాన్య రాష్ట్రాల నుంచి అసలు టీమ్సే లేవు. కోల్‌కత్తా నైట్‌రైడర్స్ తప్ప, నార్త్ నుంచి ఢిల్లీ, రాజస్థాన్... ఇలా ప్రాంతాల వారీగా టీమ్స్‌ని విభజించడం జరిగింది. రాష్ట్రానికో టీమ్ కావాలంటే ఐపీఎల్‌లో 29 టీమ్స్ ఉండాలి...
ఫ్రాంఛైజీలు ఎక్కడ బాగా మార్కెట్ ఉందనుకుంటే అక్కడి నుంచి టీమ్ తీసుకువస్తాయి. రూ.7 వేల కోట్లు పెట్టి కొనుగోలు చేసే టీమ్ వల్ల కనీసం రూ.10-12 వేల కోట్ల రిటర్న్ ఆశిస్తాయి ఫ్రాంఛైజీలు..
అలా ఎక్కడ వస్తుందనుకుంటే అక్కడే పెడతాయి.. తెలుగువారికి ఆలెడ్రీ సన్‌రైజర్స్ హైదరాబాద్ ఉంది. ఆంధ్రా పేరుతో మరో టీమ్ వస్తే క్రేజ్ ఇలాగే ఉంటుంది, ఫ్యాన్స్ ఈ విధంగానే సపోర్ట్ చేస్తారా? ఎన్నో లెక్కలు వేసుకోవాలి.’ అంటూ కామెంట్ చేశాడు బీసీసీఐ మాజీ చీఫ్ సెలక్టర్, కామెంటేటర్ ఎమ్మెస్కే ప్రసాద్..