- Home
- Sports
- Cricket
- సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్... టీ10 బ్లాస్ట్‌లో నికోలస్ పూరన్ సెంచరీ...
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్... టీ10 బ్లాస్ట్‌లో నికోలస్ పూరన్ సెంచరీ...
టీమిండియాతో జరిగిన టీ20 సిరీస్‌లో మూడు మ్యాచుల్లో మూడు హాఫ్ సెంచరీలు బాదిన విండీస్ బ్యాటర్ నికోలస్ పూరన్, తాజాగా టీ10 ఫార్మాట్‌లో మెరుపులు మెరిపించి, సెంచరీ అందుకున్నాడు...

ప్రస్తుతం ట్రినినాడ్ టీ10 బ్లాస్ట్‌లో లెథర్‌బ్యాక్ జెయింట్స్‌కి కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న నికోలస్ పూరన్, 37 బంతుల్లో 10 భారీ సిక్సర్లు, ఆరు ఫోర్లతో సెంచరీ పూర్తి చేసుకున్నాడు...
తొలుత బ్యాటింగ్ చేసిన స్కార్లెట్ ఐబిస్ స్క్రాచర్స్ జట్టు 10 ఓవర్లలో 128 పరుగుల భారీ స్కోరు చేసింది. పూరన్ మెరుపు సెంచరీ కారణంగా 129 పరుగుల టార్గెట్‌ను మరో 9 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది లెథర్‌బ్యాక్ జెయింట్స్..
నికోలస్ పూరన్ మెరుపు సెంచరీకి మరో ఎండ్‌లో కమిల్ పూరన్ 11 బంతుల్లో 20 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. స్క్రాచర్స్ ఓపెనర్ టినో వెబ్‌స్టర్ 26 బంతుల్లో 5 ఫోర్లు, నాలుగు ఫోర్లతో 54 పరుగులు చేసి తన జట్టుకి భారీ స్కోరు అందించాడు...
ఐపీఎల్ 2022 మెగా వేలంలో నికోలస్ పూరన్‌ని రూ.10.75 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు...
గత ఏడాది పంజాబ్ కింగ్స్ తరుపున ఆడిన నికోలస్ పూరన్, నాలుగు సార్లు డకౌట్ అయ్యారు. ఇందులో గోల్డెన్ డక్, డైమండ్ డక్ (జీరో బాల్ డక్), సిల్వర్ డక్, త్రీబాల్ డక్ కూడా ఉండడం విశేషం...
టీమిండియాతో జరిగిన టీ20 సిరీస్‌లో 3 మ్యాచుల్లో 140.46 స్ట్రైయిక్ రేటుతో 184 పరుగులు చేశాడు నికోలస్ పూరన్...
ఐపీఎల్ 2022 సీజన్‌కి ముందు నికోలస్ పూరన్ బీభత్సమైన ఫామ్‌లో ఉండడంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్ ఫుల్లు ఖుష్ అవుతున్నారు.
రూ.10 కోట్లు పోయినా పర్లేదు, నికోలస్ పూరన్ ఈసారి ఐపీఎల్‌లో ఇదే రేంజ్‌లో బ్యాటుతో ఇరగదీస్తే చాలని కామెంట్లు చేస్తున్నారు.