టెస్టు మ్యాచ్ అంటే ఇది... పాక్‌పై కివీస్ ఉత్కంఠ విజయం... టెస్టుల్లో నెం.1 టీమ్‌గా న్యూజిలాండ్...
First Published Dec 30, 2020, 12:29 PM IST
టెస్టు మ్యాచ్ అంటే ఐదురోజుల పాటు సాగాలి. అయితే ఇప్పుడు జరుగుతున్న టెస్టులు అత్యధికం నాలుగు రోజుల్లోనే ముగుస్తున్నాయి. కొన్నయితే పూర్తిగా మూడు రోజలు కూడా సాగడం లేదు. భారత్, ఆస్ట్రేలియా మధ్య మొదటి టెస్టు మూడు రోజుల్లోనే ముగియగా, రెండో టెస్టు మూడున్నర రోజులు సాగింది. అయితే న్యూజిలాండ్, పాకిస్తాన్ మధ్య జరిగిన తొలి టెస్టు ఐదు రోజుల పాటు పూర్తిగా సాగి... సంప్రదాయ టెస్టు క్రికెట్ మజాని నేటి తరానికి అందించింది.

టెస్టుల్లో వరుసగా ఐదో విజయాన్ని అందుకున్న న్యూజిలాండ్... ఐసీసీ ర్యాంకింగ్స్‌లో మొట్టమొదటిసారి నెం.1 ర్యాంకును అధిరోహించనుంది.

ఈ ఏడాది ఐదు టెస్టులు ఆడిన న్యూజిలాండ్... ఐదింట్లోనూ అద్భుత విజయాలు అందుకుంది. ఏడాది మొదట్లో న్యూజిలాండ్‌పై రెండు, వెస్టిండీస్ రెండు టెస్టుల్లో గెలిచిన కివీస్, పాక్‌పై తొలి టెస్టులో విజయాన్ని అందుకుంది.
Today's Poll
ఎంత మంది ఆటగాళ్లతో ఆడడానికి ఇష్టపడుతారు?