- Home
- Sports
- Cricket
- ఆ మాట చెప్పగానే నా భార్య నన్ను పిచ్చోడివి అంది! కమ్మిన్స్ కూడా ఒప్పుకోలేదు కానీ.. - నాథన్ లియాన్
ఆ మాట చెప్పగానే నా భార్య నన్ను పిచ్చోడివి అంది! కమ్మిన్స్ కూడా ఒప్పుకోలేదు కానీ.. - నాథన్ లియాన్
యాషెస్ సిరీస్‌లో భాగంగా లార్డ్స్‌లో జరిగిన రెండో టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం అందుకుంది. తొలి టెస్టులో ఇంగ్లాండ్ తొందరపాటు కారణంగా గెలిచిన ఆసీస్, రెండో టెస్టులో ఆల్‌రౌండ్ విభాగాల్లో రాణించి విజయం అందుకుంది.. ఈ మ్యాచ్‌లో నాథన్ లియాన్, మోకాలి గాయంతో బాధపడుతూ బ్యాటింగ్‌కి వచ్చి అందర్నీ ఆశ్చర్యపరిచాడు..

Nathan Lyon
తొలి ఇన్నింగ్స్‌లో గాయపడిన నాథన్ లియాన్, కంకూషన్ సబ్‌స్టిట్యూట్ తీసుకునే అవకాశం ఉన్నా అందుకు ఒప్పుకోలేదు. నొప్పిని భరిస్తూనే కుంటుతూ క్రీజులోకి వచ్చిన నాథన్ లియాన్, 13 బంతులు ఎదుర్కొన్నాడు.
Nathan Lyon
మిచెల్ స్టార్క్‌తో కలిసి 15 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన నాథన్ లియాన్, ఓ ఫోర్ బాది అవుట్ అయ్యాడు.. గాయంతో యాషెస్ సిరీస్ మొత్తానికి దూరమైన నాథన్ లియాన్, ఆ మ్యాచ్‌లో ఏం జరిగిందో వివరించాడు.
Nathan Lyon
‘నా భార్య ఎమ్మా ఆ రోజు నాతోనే ఉంది. ఆ రోజు ఉదయాన్నే అవసరమైతే బ్యాటింగ్ చేస్తానని చెప్పాను. దానికి ఆమె నా వైపు చూసి... ‘‘నువ్వు నిజంగా పిచ్చోడివి. నీకు స్నేహం కూడా నేనే చేయించా. సరిగ్గా నిలబడడానికి కూడా రావట్లేదు. బ్యాటింగ్ చేస్తాడట...’’ చెడామడా తిట్టేసింది..
గ్రౌండ్‌కి వెళ్లి మెడికల్ టీమ్‌తో మాట్లాడాను. వాళ్లు కూడా బ్యాటింగ్ చేయొద్దని చెప్పాను. కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ దగ్గరికి వెళ్లి నా నిర్ణయం చెప్పా. అతను కూడా నువ్వు బ్యాటింగ్ చేయడం లేదు, అలాంటి ఆలోచన ఏదైనా ఉంటే మానుకో అన్నాడు..
ఇలా కాదని కోచ్ మెక్‌డొనాల్డ్ దగ్గరకి వెళ్లి, నేను బ్యాటింగ్ చేస్తానని చెప్పా. అతను సంతోషంగా నవ్వి, ‘‘మంచిది. నేను కూడా అదే అనుకుంటున్నా..’’ అన్నాడు. నేను బ్యాటింగ్ చేస్తానంటే డొనాల్డ్ మాత్రం ఒప్పుకున్నాడు. అతను మెడికల్ టీమ్‌తో, కమ్మిన్స్‌తో మాట్లాడి ఒప్పించాడు..
బ్యాటింగ్ చేస్తే ఎలాంటి రిస్క్ ఉంటుందో నాకు తెలుసు. అయితే నా గాయం మరింత తీవ్రం కాకుండా ఏం చేయాలో కూడా నాకు పూర్తిగా ఐడియా ఉంది. అందుకే బ్యాటింగ్ చేయాలని అనుకున్నా. చిన్న గాయమైతే మూడో టెస్టు ఆడకుండా, ఆ తర్వాత నాలుగు, ఐదు టెస్టుల్లో ఆడతా...
పెద్ద గాయం అయితే 10 నుంచి 12 వారాలు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది. అందుకే కొన్ని పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్లు వేసుకుని బ్యాటింగ్‌కి వచ్చేశా. అయినా నా అరికాలిని కింద పెట్టలేకపోయా.
బ్యాటింగ్ చేయడం కంటే లాంగ్ రూమ్ నుంచి అక్కడికి దాకా వెళ్లడమే చాలా పెద్ద కష్టంగా అనిపించింది..’ అంటూ కామెంట్ చేశాడు ఆస్ట్రేలియా సీనియర్ స్పిన్నర్ నాథన్ లియాన్..