- Home
- Sports
- Cricket
- వీళ్ల కంటే ఆ పిల్లలు బాగా ఆడారు... టీమిండియాపై మాజీ కెప్టెన్ ఫైర్! ఫిట్‌నెస్ లేకుండా ఆడుతున్నారంటూ...
వీళ్ల కంటే ఆ పిల్లలు బాగా ఆడారు... టీమిండియాపై మాజీ కెప్టెన్ ఫైర్! ఫిట్‌నెస్ లేకుండా ఆడుతున్నారంటూ...
టీ20 వరల్డ్ కప్ 2023 సెమీ ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతుల్లో 5 పరుగుల తేడాతో పోరాడి ఓడింది భారత మహిళా జట్టు. ఆఖరి ఓవర్ వరకూ ఉత్కంఠభరితంగా సాగిన సెమీస్‌లో పేలవ ఫీల్డింగ్ కారణంగా భారీ మూల్యం చెల్లించుకుంది టీమిండియా. చెత్త ఫీల్డింగ్, క్యాచ్ డ్రాప్‌ల కారణంగా ఆస్ట్రేలియా ఖాతాలో 40-50 పరుగులు అదనంగా చేరాయి. లేకపోతే టీమిండియా ఈజీగా ఫైనల్ చేరి ఉండేది...

Image credit: Getty
టీ20 వరల్డ్ కప్‌కి ముందు అండర్19 టీ20 వరల్డ్ కప్ టోర్నీలో షెఫాలీ వర్మ కెప్టెన్సీలో టీమిండియా సంచలనం క్రియేట్ చేసింది. మొట్టమొదటి అండర్19 మహిళల వరల్డ్ కప్ గెలిచిన జట్టుగా రికార్డు క్రియేట్ చేసింది...
‘ఈ సీనియర్ల కంటే అండర్19 టీమ్ చాలా ఫిట్‌గా ఉన్నట్టు నాకు అనిపించింది. ఫైనల్ మ్యాచ్‌లో మన పిల్లలు ఇలా ఆడలేదు. 2017 నుంచి చూస్తున్నా మనది వరల్డ్ కప్‌లో సేమ్ స్టోరీ. ఇప్పటికైనా బీసీసీఐ, మహిళా టీమ్ ఫిట్‌నెస్‌పై సరైన చర్యలు తీసుకోవాలి. మహిళా క్రికెటర్లకు యో యో టెస్టు పెట్టడం కాస్త కష్టమే..
India v South Africa
అయితే భారత ప్లేయర్లకు ఫిట్‌నెస్ టెస్టు పెడితే 15 మందిలో 12 మంది ఫెయిల్ అవుతారు. భారత జట్టు ఫిట్‌నెస్ స్టాండర్స్ అలా ఉన్నాయి. ఇప్పుడు వంకలు చెప్పడానికి కూడా లేదు. ఎందుకంటే ఇప్పుడు మహిళా క్రికెటర్లు కూడా పురుష క్రికెటర్లతో సమానంగా మ్యాచ్ ఫీజు తీసుకుంటున్నారు...
Harmanpreet tears
వరల్డ్ కప్ గెలవాలంటే ముందు ఫిట్‌నెస్‌పై ఫోకస్ పెట్టాలి. ఫీల్డింగ్ కానీ,క్యాచ్‌లు పట్టుకోవడంలో కానీ చివరికి వికెట్ల మధ్య పరుగెత్తడంలో కానీ భారత ప్లేయర్లలో అలసత్వం కనిపించింది. కాళ్లు ఫిట్‌గా ఉంటే కానీ ఇవన్నీ చేయడానికి రాదు. బీసీసీఐ ఈ విషయంలో కఠినంగా వ్యవహరించాలి...
Harmanpreet Run Out
భారత జట్టుకి ఇది అలవాటుగా మారిపోయింది. ఇకపైన ప్లేయర్ల డిమాండ్లకు బీసీసీఐ తలొగ్గకూడదు. మహిళల టీమ్‌కే కాదు, పురుషుల టీమ్‌కి కూడా ఇది వర్తిస్తుంది. హర్మన్‌ప్రీత్ కౌర్ బ్యాట్ స్ట్రక్ అయ్యిందని చెబుతోంది. అయితే టీవీలో చూస్తే ఆమె రెండో పరుగు సమయంలో జాగింగ్ చేసినట్టు కనిపించింది...
Image credit: ICC
రెండో పరుగు ఈజీగా తీసుకొవచ్చని అనుకుని రిలాక్స్ అయిపోయింది. పెర్రీ ఎలా డైవ్ చేసిందో చూశారుగా. ఆ రెండు పరుగులు కాపాడడం ఎంత అవసరమో తనకి తెలుసు. అలాంటి ప్రొఫెషనలిజం మన టీమ్‌కి కావాలి.. చివరిదాకా వాళ్లు పోరాటాన్ని వదల్లేదు అందుకే ఏడోసారి ఫైనల్‌లో ఉన్నారు... ’ అంటూ ఫైర్ అయ్యింది టీమిండియా మాజీ కెప్టెన్ డియానా ఎడుల్జీ..