- Home
- Sports
- Cricket
- డిన్నర్‌కి వెళ్దామని చెప్పి, సచిన్ టెండూల్కర్ 5 కి.మీ.లు నడిపించాడు.. - ఎమ్మెస్కే ప్రసాద్...
డిన్నర్‌కి వెళ్దామని చెప్పి, సచిన్ టెండూల్కర్ 5 కి.మీ.లు నడిపించాడు.. - ఎమ్మెస్కే ప్రసాద్...
తన ఆటతో దేశమంతా స్థంభించేపోయేలా చేసిన ఒకే ఒక్కడు సచిన్ టెండూల్కర్. సచిన్ క్రీజులో ఉంటే చాలు, జనాలందరూ టీవీలకు అతుక్కుపోయేవాళ్లు. టెండూల్కర్ 90ల్లో ఉంటే, ఇక అంతే... ఎక్కడివాళ్లు అక్కడే నిలబడి ఆసక్తిగా మ్యాచ్ వీక్షించేవాళ్లు...

Image credit: PTI
టీనేజ్ వయసులోనే టీమిండియాలోకి వచ్చి, 24 ఏళ్ల పాటు క్రికెట్ ప్రపంచంలో మకుటం లేని మహారాజుగా వెలుగొందాడు సచిన్ టెండూల్కర్. సచిన్ టెండూల్కర్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విజయాలు బయటపెట్టాడు భారత మాజీ వికెట్ కీపర్, మాజీ సెలక్టర్, కామెంటేటర్ ఎమ్మెస్కే ప్రసాద్...
Image credit: PTI
‘మలేషియా టూర్‌లో ఉన్నప్పుడు నా హోటల్ రూమ్‌కి ఫోన్ వచ్చింది. ‘డిన్నర్‌కి వెళ్దామా’ అనగానే నేను శ్రీనాథ్ ఏమో అనుకున్నా. గొంతులు మార్చి ఆటపట్టించడం బాగా అలవాటు..
సడెన్‌గా గుంటూర్ ఎక్స్‌ప్రెస్ అనగానే అది సచినే అని అర్థమైంది. నన్ను సచిన్, కపిల్ దేవ్ మాత్రమే గుంటూర్ ఎక్స్‌ప్రెస్ అని పిలిచేవాళ్లు. సచిన్‌తో డిన్నర్‌కి వెళ్లడం అంటే అదృష్టమేనని అనుకుని, వెంటనే సరే అన్నాను..
Image credit: PTI
7:30కి రమ్మన్నాడు. సచిన్ పిలుచాడు కదా అని నేను 15 నిమిషాలు ముందే కిందకి వెళ్లిపోయి రిసెప్షన్ వెయిట్ చేస్తున్నా. కర్ణాటక క్రికెటర్లను మలేషియాలో ఉన్న కర్ణాటక వాళ్లు కార్లలో వచ్చి తీసుకుపోతున్నారు. అలాగే తమిళనాడు క్రికెటర్లను తమిళవాళ్లు పెద్ద పెద్ద కార్లలో వచ్చి తీసుకుపోతున్నారు..
Image credit: PTI
నేను అన్నీ రిసెప్షన్‌లో నిలబడి చూస్తున్నా. సచిన్ టెండూల్కర్ అక్కడే ఒక్కడే ఒంటరిగా కూర్చున్నాడు. నేను షాక్ అయ్యా. నన్ను చూడగానే హా... వచ్చేశావా? ఏంటి లేటైంది? పద వెళ్దాం అన్నాడు...
Image credit: Getty
‘‘అదేంటి సచిన్, 7:30కి అన్నావు, నేను 15 నిమిషాలు ముందుగానే వచ్చా... అయినా లేట్ అంటున్నావ్’’ అని అడిగాను. ‘‘నీకు తెలీదా.. నేనెప్పుడూ చెప్పిన టైమ్‌కి 20 నిమిషాలు ముందుగానే ఉంటా’’ అని చెప్పాడు... నేను షాక్ అయ్యా...
Image credit: PTI
కారు వస్తుందేమోనని అటు ఇటూ చూస్తున్నా.. ‘‘ఏంటి చూస్తున్నావ్’’ అని సచిన్ అడగడంతో ‘‘కారు వస్తోందా..’’ అని అడిగా. దానికి సచిన్ వెంటనే ‘‘ఎందుకు? నడవలేవా’’ అన్నాడు. మళ్లీ షాక్ అయ్యా...
Sachin Tendulkar
‘‘మీకున్న క్రేజ్‌కి బయట జనాలు మీద పడిపోతారు’’ అన్నాను.. దానికి సచిన్, ‘‘మనం ఉన్నది మలేషియాలో కదా...పద’’ అంటూ 5 కి.మీ.లు నడిపించాడు. ఓ చిన్న పిల్లాడిలా సచిన్ నడుస్తుంటూ ఆశ్చర్యంలో అలా చూస్తుండిపోయాను...
MSK Prasadలసచిన్ అది గమనించి ‘ఏంటి చూస్తున్నావ్’ అని అడిగాడు. ‘‘మీరు ఇండియాలో ఇలాంటి చిన్న చిన్న విషయాలను బాగా మిస్ అవుతున్నారు కదా’’ అని అడిగాను. ‘‘అవును.. కానీ కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి కదా’’ అని చెప్పాడు...
Sachin Tendulkar
సచిన్ టెండూల్కర్ ఎంత ఎత్తుకు ఎదిగినా తాను ఎక్కడి నుంచి వచ్చాననే విషయాన్ని మరిచిపోలేదు. టీమ్‌లోని ప్రతీ ప్లేయర్‌కి గౌరవం ఇస్తాడు, వయసులో చిన్నవాడా? పెద్ద వాడా? అని కూడా చూడడు. అదే సచిన్ గొప్పదనం...’ అంటూ చెప్పుకొచ్చాడు భారత మాజీ వికెట్ కీపర్, మాజీ సెలక్టర్, కామెంటేటర్ ఎమ్మెస్కే ప్రసాద్..