- Home
- Sports
- Cricket
- కోహ్లీ, వరల్డ్ కప్ గెలవకూడదనే ధోనీ సరిగ్గా ఆడలేదు! మాహీ తలుచుకుంటే... యువరాజ్ సింగ్ తండ్రి సంచలన వ్యాఖ్యలు..
కోహ్లీ, వరల్డ్ కప్ గెలవకూడదనే ధోనీ సరిగ్గా ఆడలేదు! మాహీ తలుచుకుంటే... యువరాజ్ సింగ్ తండ్రి సంచలన వ్యాఖ్యలు..
2019 వన్డే వరల్డ్ కప్‌లో గ్రూప్ స్టేజీలో వరుస విజయాలతో టేబుల్ టాపర్‌గా నిలిచింది భారత జట్టు. అయితే న్యూజిలాండ్‌తో జరిగిన సెమీ ఫైనల్‌లో 240 పరుగుల స్వల్ప టార్గెట్‌ని ఛేదించలేక 18 పరుగుల తేడాతో ఓడింది..

Dhoni Run Out
టాపార్డర్ అట్టర్ ఫ్లాప్ అయిన తర్వాత రిషబ్ పంత్ 32, హార్ధిక్ పాండ్యా 32, రవీంద్ర జడేజా 77 పరుగులతో రాణించడంతో టీమిండియా విజయంపై ఆశలు రేగాయి. అయితే విజయానికి 10 బంతుల్లో 25 పరుగులు కావాల్సిన సమయంలో ధోనీ రనౌట్ అయ్యాడు..
ఈ రనౌట్‌తో టీమిండియా మ్యాచ్‌పై ఆశలు వదులుకుంది. ధోనీ అవుటైన తర్వాత భువీ డకౌట్ కావడం, చాహాల్ 5 పరుగులు చేసి పెవిలియన్ చేరడంతో 221 పరుగులకే ఆలౌట్ అయ్యింది టీమిండియా..
‘2019 వన్డే వరల్డ్ కప్ టోర్నీలో ధోనీ కావాలనే సరిగ్గా ఆడలేదు. భారత జట్టు ఓడిపోవాలనేదే అతని కోరిక. ఎందుకంటే తన కెప్టెన్సీలో టీమిండియా, వరల్డ్ కప్ గెలిచింది. కోహ్లీ కెప్టెన్సీలో వరల్డ్ కప్ గెలిస్తే, తనకు విలువ ఉండదని ధోనీ భావించాడు..
వరల్డ్ కప్ 2019 టోర్నీలో ధోనీ సరిగ్గా ఆడలేదు కానీ ఐపీఎల్‌లో బాగా ఆడాడు. ఓ ఎండ్‌లో రవీంద్ర జడేజా చాలా ఫ్రీగా షాట్లు ఆడుతూ టీమిండియాని విజయానికి దగ్గరగా చేర్చాడు. మరో ఎండ్‌లో ధోనీ మాత్రం బౌండరీలు కొట్టడం చేతకానట్టు ఆడాడు..
ఐపీఎల్‌లో ఆఖరి ఓవర్‌లో 20-25 పరుగులు కావాల్సినప్పుడు కూడా ధోనీ ఆ మ్యాచ్‌లను ఫినిష్ చేయడం చూశాం. ధోనీ, తన సత్తాలో సగం వాడినా 49వ ఓవర్‌లో కూడా మ్యాచ్‌ని ఫినిష్ చేయగలడు. కానీ గెలవకూడదనే అలా ఆడాడు..
జడేజా బ్యాటింగ్ చేసేటప్పుడు ఫోర్లు, సిక్సర్లు బాదిన బౌలర్ బౌలింగ్‌లోనే ధోనీ సింగిల్స్ కూడా తీయలేకపోయాడు. పిచ్ అదే, బౌలర్లు వాళ్లే. మరి ధోనీ ఎందుకని షాట్స్ ఆడలేదు. ధోనీ వల్లే పాండ్యా అవుట్ అయ్యాడు, ధోనీ వల్లే జడేజా అవుట్ అయ్యాడు.
Dhoni-Kohli-Ravi Shastri
మరో ఎండ్‌లో బ్యాటర్ షాట్స్ ఆడకపోతే ఇవతలి ఎండ్‌లో బ్యాటర్ తీవ్రమైన ప్రెషర్‌లోకి వెళ్లిపోతాడు. ధోనీ చేసింది ఇదే... ’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగ్‌రాజ్ సింగ్..
యోగ్‌రాజ్ సింగ్ కూడా టీమిండియా తరుపున క్రికెట్ ఆడారు. భారత జట్టు తరుపున ఓ టెస్టు, 6 వన్డేలు ఆడిన యోగ్‌రాజ్ సింగ్, యువరాజ్ సింగ్‌కి టీమిండియాలో చోటు పోవడానికి, వన్డే వరల్డ్ కప్ 2011 విజయంలో దక్కాల్సినంత క్రెడిట్ దక్కకపోవడానికి ధోనీయే కారణమని చాలాసార్లు ఆరోపించాడు..