ధోని 2025 ఐపీఎల్ ఆడతాడా? సీఎస్కేలో మార్పులేంటి?
MS Dhoni Play IPL 2025: ఐపీఎల్ లో గత కొన్ని సీజన్ల నుంచి చెన్నై సూపర్ కింగ్స్ జట్టు దిగ్గజం మహేంద్ర సింగ్ ధోని రిటైర్మెంట్ పై ఊహాగానాలు వస్తున్నాయి. కానీ, అంతా బాగుంటే 2025 ఐపీఎల్ లో కూడా ధోని ఆడతారు.
ధోని 2025 ఐపీఎల్ ఆడతాడా?
MS Dhoni Play IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 (ఐపీఎల్ 2025) ఎడిషన్ కు ముందు ఆటగాళ్ల కోసం మెగా వేలం నిర్వహించనున్నారు. ఇప్పటికే బీసీసీఐ ఐపీఎల్ జట్ల రిటెన్షన్ రూల్స్ ను ప్రకటించింది. ఈ నెలాఖరులోగా రిటైన్ చేసుకునే ప్లేయర్ల వివరాలను కూడా అందించాలని పేర్కొంది. ఈ క్రమంలోనే అన్ని ఫ్రాంఛైజీలు దీనిపై కసరత్తులు చేస్తున్నాయి.
చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) సైతం రిటెన్షన్ ప్లేయర్ల విషయంలో తుదినిర్ణయం తీసుకోవడానికి సిద్ధమైంది. అయితే, ఐపీఎల్ లో విజయవంతమైన కెప్టెన్ గా, సక్సెస్ ఫుల్ ప్లేయర్ గా ముందుకు సాగిన ఎంఎస్ ధోని రాబోయే ఐపీఎల్ సీజన్ లో ఆడతాడా లేదా? అనేది హాట్ టాపిక్ అవుతోంది.
చెన్నై సూపర్ కింగ్స్, ఐపీఎల్ 2025
ఐపీఎల్ 2025 ఆటగాళ్ల రిటెన్షన్, వేలానికి ముందు మహేంద్ర సింగ్ ధోని ఒక పెద్ద వార్త చెప్పారు. ఒక సాఫ్ట్‌వేర్ బ్రాండ్ ప్రకటన కార్యక్రమంలో ధోని మాట్లాడుతూ, ‘నా కెరీర్ చివరి కొన్ని సంవత్సరాల్లో, నేను క్రికెట్ ని ఆస్వాదించాలనుకుంటున్నాను’ అని అన్నారు. ఐపీఎల్ ఆడుతున్నప్పుడు క్రికెట్ ని ఆస్వాదించడం కష్టం అని కూడా ధోని పేర్కొనడం కొత్త చర్చకు దారితీసింది.
‘ఒకరు క్రికెట్ లాంటి ప్రొఫెషనల్ గేమ్ ఆడుతున్నప్పుడు, గేమ్ గా మాత్రమే ఆస్వాదించడం కష్టం. నేను అదే చేయాలనుకుంటున్నాను. అది అంత సులభం కాదు. ఎమోషన్స్ ఉంటాయి, బాధ్యత కూడా ఉంటుంది. నేను రాబోయే కొన్ని సంవత్సరాలు గేమ్ ని ఆస్వాదించాలనుకుంటున్నాను’ అని ధోని అన్నారు.
IPL 2025: CSK, Ms Dhoni
ఐపీఎల్ కోసం సంవత్సరానికి 2 నెలలు కేటాయించడం కష్టం కాదు అని కూడా ధోని చెప్పాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత, ఐపీఎల్ లో మాత్రమే ఆడుతున్నారు ఎంఎస్ ధోని. దీని గురించి ఆయన మాట్లాడుతూ, ‘రెండున్నర నెలలు ఐపీఎల్ ఆడటానికి, 9 నెలలు ఫిట్ గా ఉండాలి. సరైన ప్రణాళిక ఉండాలి. అదే సమయంలో, విశ్రాంతి కూడా తీసుకోవచ్చు’ అని అన్నారు.
దీంతో రాబోయే ఐపీఎల్ సీజన్ లో ఎంఎస్ ధోని ఆడతాడని తెలుస్తోంది. గత సీజన్ లో ధోని తన కెప్టెన్సీని రుతురాజ్ గైక్వాడ్ కు అప్పగించాడు. ఐపీఎల్ 2024 లో కేవలం ప్లేయర్ గా నే ఆడాడు. పెద్దగా బ్యాటింగ్ చేసే అవకాశం రాకపోయినా.. మ్యాచ్ చివరలో బ్యాటింగ్ కు వచ్చి తనదైన షాట్స్ ఆలరించాడు.
Dhoni, IPL 2025, CSK
2025 ఐపీఎల్ వేలానికి ముందే ధోనిని సీఎస్కే నిలుపుకోవచ్చు. అయితే, గతంలో కంటే అతను చాలా తక్కువ అందుకుంటాడు. ఎందుకంటే ఐపీఎల్ కొత్త నిబంధనల ప్రకారం 5 సంవత్సరాలు జాతీయ జట్టుకు ఆడని ప్లేయర్లను అన్ క్యాప్డ్ ప్లేయర్ల లిస్టులో చేర్చారు. కాబట్టి ఇదివరకు 12 కోట్ల రూపాయలకు జట్టులో నిలుపుకున్న ధోనిని రూ.4 కోట్లకు చెన్నై సూపర్ కింగ్స్ నిలుపుకోవచ్చు. కాబట్టి ధోని ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.
ధోని మళ్ళీ ఐపీఎల్ ఆడతాడన్న వార్తతో సీఎస్కే అభిమానులు ఉత్సాహంలో మునిగిపోయారు. చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు, ధోని ఇంకా కొన్ని సంవత్సరాలు ఐపీఎల్ ఆడాలని కోరుకుంటున్నారు. ఇప్పుడు మరికొన్ని రోజులు క్రికెట్ ను ఆస్వాదించాలనుకుంటున్నట్టు ధోని చెప్పడంతో క్రికెట్ లవర్స్ మరీ ముఖ్యంగా చెన్నై టీమ్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.
Dhoni, IPL 2025, CSK
రాబోయే కొద్ది రోజుల్లో ధోనిని నిలుపుకుంటున్నట్లు సీఎస్కే ప్రకటించవచ్చు. ఎందుకంటే ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ అక్టోబర్ 31 లోపు 10 జట్లు నిలుపుకున్న ఆటగాళ్ల జాబితాను ప్రకటించాలని తెలిపింది. ఆ తర్వాత నవంబర్ నాలుగో వారంలో ఐపీఎల్ 2025 కోసం ఆటగాళ్ల వేలం జరుగుతుంది.
ఇక ఐపీఎల్ 2025 సీజన్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ రిటెన్షన్ ప్లేయర్ల లిస్టు గమనిస్తే.. సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ నంబర్ 1 రిటెన్షన్ ఎంపిక కాదని ఈ సంవత్సరం టీమిండియా టీ20 ప్రపంచ కప్ విజయం తర్వాత టీ20 అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా అని పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. "అతను సిద్ధంగా ఉన్నప్పుడు, మనకు ఇంకా ఏమి కావాలి. మేము సంతోషంగా ఉన్నాము" అని ఫ్రాంచైజీ సీఈవో కాశీ విశ్వనాథన్ తెలిపినట్టు మీడియా రిపోర్టులు పేర్కొంటున్నాయి.