- Home
- Sports
- Cricket
- ఎమ్మెస్ ధోనీ చేతిలో భగవద్గీత! విరాట్ కోహ్లీని చదవమంటున్న ఫ్యాన్స్... రోహిత్‌కి కూడా కలిసిరావడంతో...
ఎమ్మెస్ ధోనీ చేతిలో భగవద్గీత! విరాట్ కోహ్లీని చదవమంటున్న ఫ్యాన్స్... రోహిత్‌కి కూడా కలిసిరావడంతో...
ఐపీఎల్ 2023 సీజన్ టైటిల్ గెలిచిన మహేంద్ర సింగ్ ధోనీ, ప్రస్తుతం ముంబైలో ఉన్నాడు. మోకాలి గాయానికి శస్త్ర చికిత్స చేయించుకునేందుకు ముంబైలోని కోకిలాబెన్ ధీరుబాయ్ అంబానీ ఆసుపత్రికి చేరుకున్నాడు..
- FB
- TW
- Linkdin
Follow Us
)
Dhoni Knee Injury
ముంబైకి చేరుకున్న సమయంలో మహేంద్ర సింగ్ ధోనీ చేతిలో భగవద్గీత కనిపించింది. శస్త్ర చికిత్స తర్వాత మాహీ పూర్తిగా గాయం నుంచి కోలుకుని నడవడానికి కొన్ని రోజుల సమయం పడుతుంది..
ఈ సమయంలో చదువుకునేందుకు భగవద్గీతను ఎంచుకున్నాడు మహేంద్రుడు. ఇది మాహీని ఆయన ఫ్యాన్స్‌కి మరింత చేరువ చేసింది. అయితే ధోనీ ఫోటో వైరల్ అవుతుండడంతో విరాట్ ఫ్యాన్స్ కూడా భగవద్గీత చదవాల్సిందిగా కోహ్లీని కోరుతుండడం విశేషం...
దీనికి కారణం ఏంటంటే ఐపీఎల్‌లో 5 టైటిల్స్ గెలిచిన రోహిత్ శర్మ కూడా ఇంతకుముందు భగవద్గీత చదువుతున్నట్టు సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు. ఇప్పుడు ధోనీ కూడా అదే భగవద్గీత పుస్తకంతో కనిపించాడు..
ఈ ఇద్దరూ ఐపీఎల్‌లో ఐదేసి టైటిల్స్ గెలిచి మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్లుగా నిలిచాడు. ప్లేయర్‌గా 16 సీజన్లు, కెప్టెన్‌గా 9 సీజన్లు ఆడినా విరాట్ కోహ్లీ ఖాతాలో మాత్రం ఐపీఎల్ టైటిల్ లేదు, రాలేదు... 2023 సీజన్‌లోనూ ఆర్‌సీబీ ప్లేఆఫ్స్‌కి అడుగు దూరంలో ఆగిపోయింది..
కాబట్టి గీతా పారాయణంతో రోహిత్ శర్మ, మహేంద్ర సింగ్ ధోనీ... ఐపీఎల్ టైటిల్స్ గెలిచినట్టే, విరాట్ కోహ్లీ కూడా తన ఐపీఎల్ టైటిల్ కల నెరవేర్చుకోవచ్చేమోనని కోరుతున్నారు...
అదీకాకుండా టీమ్‌లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఆవేశం, అగ్రెసివ్ యాటిట్యూడ్‌తో ఎంతోమంది హేటర్స్‌ని సంపాదించుకున్న విరాట్ కోహ్లీ, భగవద్గీత చదివితే మానసిక ప్రశాంతత పొందడమే కాకుండా జీవితతత్వాన్ని తెలుసుకుంటాడని హితవు చేస్తున్నారు. మరి ఫ్యాన్స్ డిమాండ్‌ని కోహ్లీ పట్టించుకుంటాడో? లేదో చూడాలి..