MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Romanchakam Movie Review
Ayodhya Ram Mandir CEO
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Sports
  • Cricket
  • యువరాజ్ సింగ్ కారణంగా వరల్డ్‌ కప్‌లో ప్లేస్ కోల్పోయిన ఎమ్మెస్ ధోనీ... ఇదెప్పుడు జరిగిందంటే...

యువరాజ్ సింగ్ కారణంగా వరల్డ్‌ కప్‌లో ప్లేస్ కోల్పోయిన ఎమ్మెస్ ధోనీ... ఇదెప్పుడు జరిగిందంటే...

క్రికెటర్లలో ఎమ్మెస్ ధోనీకి ఉన్న మాస్ ఫాలోయింగ్ వేరు. టీమిండియాకి మూడు ఐసీసీ ట్రోఫీలు, చెన్నై సూపర్ కింగ్స్‌కి నాలుగు ఐపీఎల్ ట్రోఫీలు అందించిన మాహీ... యువరాజ్ సింగ్ కారణంగా వరల్డ్ కప్ ఆడలేకపోయాడంటే నమ్మగలరా? అవును, ఇది నిజం...

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : Nov 27 2021, 03:06 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
112

టీమిండియా కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్, ఇర్ఫాన్ పఠాన్, యూసఫ్ పఠాన్ వంటి ఎందరో సీనియర్లు జట్టులో చోటు కోల్పోవడానికి కారణమయ్యాడు ఎమ్మెస్ ధోనీ...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
212

యువరాజ్ సింగ్‌కి తగినంత గుర్తింపు రాకపోవడానికి, 2011 వన్డే వరల్డ్‌ కప్ టోర్నీలో యువీ ఇన్నింగ్స్‌లకు గుర్తింపు దక్కకపోవడానికి కూడా ఎమ్మెస్ ధోనీయే కారణమని ఆరోపించాడు యువీ తండ్రి...

312

2007 వన్డే వరల్డ్ కప్ పరాభావం తర్వాత భారత జట్టు కెప్టెన్సీ పగ్గాలు చేపట్టిన ఎమ్మెస్ ధోనీ, భారత జట్టుకి అద్వితీయమైన విజయాలు అందించి, మోస్ట్ సక్సెస్‌ఫుల్ ఇండియన్ కెప్టెన్‌గా నిలిచాడు...

412

జార్ఖండ్ నుంచి వచ్చిన ఎమ్మెస్ ధోనీ, 2000 అండర్-19 వరల్డ్ కప్ టీమ్‌లో చోటు దక్కించుకోలేకపోయాడు. ధోనీకి జూనియర్ ప్రపంచకప్‌లో చోటు దక్కకపోవడానికి కారణం యువరాజ్ సింగ్...

512

కూచ్ బెహర్ ట్రోఫీ 1999-2000 టోర్నీలో బీహార్, పంజాబ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో యువరాజ్ సింగ్, ఎమ్మెస్ ధోనీ తొలిసారి క్రికెట్ ఫీల్డ్‌లో కలిసారు...

612

ఆ మ్యాచ్‌లో పంజాబ్ జట్టుకి యువరాజ్ సింగ్ కెప్టెన్‌గా వ్యవహరించగా, ఎమ్మెస్ ధోనీ బీహార్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్‌గా వ్యవహరించాడు. ఆ మ్యాచ్‌లో ఎమ్మెస్ ధోనీ 84 పరుగులు చేసి సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు...

712

అయితే ఈ మ్యాచ్‌లో యువరాజ్ సింగ్ విశ్వరూపమే చూపించాడు. 40 ఫోర్లు, ఆరు సిక్సర్లతో 358 పరుగులు చేసి, పంజాబ్ 839 పరుగుల భారీ స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించాడు...

812

ఎమ్మెస్ ధోనీ ఇన్నింగ్స్ కారణంగా బీహార్ జట్టు మొత్తం కలిసి 357 పరుగులు చేస్తే, యువరాజ్ సింగ్ ఒక్కడే 358 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో అండర్-19 వరల్డ్ కప్‌కి యువరాజ్ సింగ్‌ని ఎంపిక చేశారు సెలక్టర్లు...

912

యువరాజ్ సింగ్ సూపర్ ఇన్నింగ్స్ కారణంగా వికెట్ కీపర్ ఎమ్మెస్ ధోనీకి అండర్-19 వరల్డ్ కప్ టీమ్‌లో చోటు దక్కలేదు..

1012

మహ్మద్ కైఫ్ కెప్టెన్సీలో 2000 అండర్-19 వరల్డ్ కప్ గెలిచిన జట్టులో ఆల్‌రౌండర్ పాత్ర పోషించి, ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ గెలిచాడు యువరాజ్ సింగ్...

1112

యువరాజ్ సింగ్ 2000వ సంవత్సరంలోనే టీమిండియాలోకి ఎంట్రీ ఇస్తే, నాలుగేళ్ల తర్వాత జట్టులోకి రాగలిగాడు. అయితే రాహుల్ ద్రావిడ్ కెప్టెన్‌గా తప్పుకున్న తర్వాత టీమిండియా కెప్టెన్సీ ఆశించాడు యువీ..

1212

అయితే ఆశ్చర్యకరంగా ఎమ్మెస్ ధోనీని కెప్టెన్‌గా ప్రకటించారు సెలక్టర్లు. నాలుగేళ్లు ముందే టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన యువీని తన కంటే మూడేళ్ల ముందే టీమ్‌కి దూరం చేసి, పగ తీర్చుకున్నాడని మాహీని ట్రోల్ చేస్తారు యువరాజ్ సింగ్ ఫ్యాన్స్..

About the Author

CR
Chinthakindhi Ramu
ఎం.ఎస్. ధోని

Latest Videos
Recommended Stories
Recommended image1
T20 Cricket Centuries: టీ20ల్లో అత్యధిక సెంచరీలు బాదిన టాప్ 7 బ్యాటర్లు ఎవరో తెలుసా?
Recommended image2
Hardik Pandya: అఫ్గానిస్తాన్‌తో T20I సిరీస్‌కు హార్దిక్ పాండ్యా ఎందుకు ఎంపిక కాలేదు?
Recommended image3
Richest Women Cricketers : టాప్ 5 రిచ్చెస్ట్ ఉమెన్ క్రికెటర్స్ వీళ్లే.. టాప్ 3 లో మన తెలుగమ్మాయి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved