- Home
- Sports
- Cricket
- బుమ్రా రాకపోతే ఆ ఇద్దరికీ చోటు... ఆస్ట్రేలియా ఫ్లైట్ ఎక్కబోతున్న ఉమ్రాన్ మాలిక్, మహ్మద్ సిరాజ్...
బుమ్రా రాకపోతే ఆ ఇద్దరికీ చోటు... ఆస్ట్రేలియా ఫ్లైట్ ఎక్కబోతున్న ఉమ్రాన్ మాలిక్, మహ్మద్ సిరాజ్...
ఆసియా కప్ 2022 టోర్నీకి దూరమైన జస్ప్రిత్ బుమ్రా, సరిగ్గా రెండు మ్యాచులు ఆడాడో లేదో మళ్లీ గాయపడ్డాడు. వెన్ను నొప్పి తిరగబెట్టడంతో జస్ప్రిత్ బుమ్రా, టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ నుంచి తప్పుకున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే బుమ్రా, టీ20 వరల్డ్ కప్ 2022 నుంచి తప్పుకోలేదని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కామెంట్ చేయడంతో కొత్త ఆశలు చిగురించాయి...

bumrah
టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో టీమిండియా మ్యాచులు ప్రారంభం కావడానికి మరో 20 రోజులకు పైగా సమయం ఉండడంతో ఆ లోగా జస్ప్రిత్ బుమ్రా కోలుకుంటాడని ఆశాభావం వ్యక్తం చేశాడు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ...
Image credit: Getty
అందుకే సౌతాఫ్రికాతో జరిగే టీ20 సిరీస్‌లో గాయపడిన జస్ప్రిత్ బుమ్రా ప్లేస్‌లో మహ్మద్ సిరాజ్‌కి చోటు కల్పించిన బీసీసీఐ, టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ జట్టులో మార్పులు చేస్తున్నట్టు మాత్రం ప్రకటించలేదు...
umran malik
టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో జస్ప్రిత్ బుమ్రా ఆడతాడా? లేదా? అనే విషయంలో క్లారిటీ లేకపోవడంతో అతనికి రిప్లేస్‌మెంట్‌గా ఇద్దరు ఫాస్ట్ బౌలర్లను ఆస్ట్రేలియాకి పంపించబోతోంది భారత జట్టు...
Image credit: Getty
ఐపీఎల్ 2022 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తరుపున అదరగొట్టి, వరుసగా 150+ కి.మీ.ల వేగంతో బౌలింగ్ చేసిన ఉమ్రాన్ మాలిక్‌తో పాటు మహ్మద్ సిరాజ్ కూడా టీ20 వరల్డ్ కప్ కోసం ఆస్ట్రేలియా ఫ్లైట్ ఎక్కబోతున్నారని సమాచారం...
Image credit: Getty
ఆస్ట్రేలియాలో బౌన్సీ పిచ్‌లు, అక్కడి ట్రాక్, వాతావరణ పరిస్థితులను ఉమ్రాన్ మాలిక్ అద్భుతంగా వాడుకోగలుగుతాడని క్రికెట్ ఎక్స్‌పర్ట్స్ అంచనా వేశారు. అలాగే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2020-21 ట్రోఫీలో అదరగొట్టిన మహ్మద్ సిరాజ్, ఆస్ట్రేలియాలో మంచి పర్ఫామెన్స్‌తో మెప్పించాడు.