మహ్మద్ షమీ బట్టతల మీద వెంట్రుకలు ఎలా వచ్చాయి?
mohammed shami : టీమిండియా స్టార్ బౌలర్ మహ్మద్ షమీ లుక్ మారిపోయింది. బట్టతలతో ఉండే షమీ ఇప్పుడు పూర్తి హెయిర్ తో ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త లుక్ లో కనిపించడంతో.. షమీ బట్టతలపై వెంట్రుకలు ఎలా వచ్చాయని ఆరా తీస్తున్నారు. ఆ వివరాలు మీకోసం..
mohammed shami hair secret
mohammed shami hair secret: భారత క్రికెట్ జట్టు స్టార్ ప్లేయర్ మహ్మద్ షమీకి బట్టతల ఉంది. తలపై అక్కడక్కడ మాత్రమే వెంట్రుకలు ఉన్నాయి. వన్డే ప్రపంచ కప్ 2023 నుంచి గాయం కారణంగా షమీ క్రికెట్ కు దూరంగా ఉంటున్నాడు. ఇటీవలే కోలుకున్న అతను రాబోయే దేశవాళీ క్రికెట్ సీజన్ తో మళ్లీ గ్రౌండ్ లోకి అడుగుపెట్టనున్నాడు.
అయితే, బట్టతలో కనిపించే షమీ ఇప్పుడు కొత్త లుక్ లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఇప్పుడు మహ్మద్ షమీ లుక్ పూర్తిగా మారిపోయింది. తలతల మెరుస్తూ కనిపించే షమీ బట్టతల ఇప్పుడు పూర్తిగా వెంట్రుకలతో నిండిపోయింది. అతని తలపై ఒత్తుగా నల్లటి జుట్టు కొత్త లుక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ క్రమంలోనే మహ్మద్ షమీ జుట్టు గురించి అభిమానులు సోషల్ మీడియాలో ఆరా తీస్తున్నారు.
mohammed shami hair secret
బట్టతలతో కనిపించే షమీ తాను ఎప్పుడూ కూడా విగ్గులు పెట్టుకోను అని చాలా సార్లు చెప్పారు. ఇప్పుడు అతని ఫోటోలు చూస్తుంటే విగ్గుపెట్టుకున్నట్టు కూడా అనిపించడం లేదు. అయితే, బట్టతలపై వెంట్రుకలు వస్తాయా? షమీ బట్టతలపై ఇలా జట్టు ఎలా వచ్చింది? షమీ వెంట్రుకల రహస్యం ఏంటి? అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఇప్పుడు ఆ వివరాలు తెలుసుకుందాం..
బట్టతల క్రమంలో మహ్మద్ షమీ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకున్నారు. దీంతో ఒత్తుగా, నల్లని జుట్టుతో తన లుక్స్‌తో ఎక్కువ మందిని ఆకర్షిస్తున్నాడు. షమీకి తల ముందు భాగంలో, నెత్తిమీద వెంట్రుకలు ఉండేవి కావు. వెనుక భాగంలో మాత్రమే కొంత వెంట్రుకలు ఉన్నాయి. దాంతో షమీ బట్టతల తల స్పష్టంగా కనిపించేది. ఇప్పుడు తన బట్టతల పూర్తిగా జట్టుతో నిండిపోయింది.
mohammed shami hair secret
ప్రస్తుతం జుట్టు రాలడం అనేది ఒక సాధారణ సమస్య. చాలా మంది జట్టురాలడం, బట్టతల సమస్యతో బాధపడుతున్నారు. ఇందులో పలువురు సెలబ్రిటీలు కూడా ఉన్నారు. కొందరు తమ బట్టతలని కప్పుకోవడానికి విగ్గులు ధరిస్తారు. మరికొందరు చికిత్స పొందుతున్నారు.
ఇప్పుడు మహ్మద్ షమీ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకున్నాడు. షమీకి డైరెక్ట్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ పద్ధతిలో హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేశారు. ఇది హెయిర్‌లైన్‌ను స్ట్రెయిట్ చేయడమే కాకుండా పక్కనే ఉన్న వెంట్రుకల సాంద్రతను కూడా మెరుగుపరుస్తుంది.
mohammed shami hair secret
షమీకి హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ యూజెనిక్స్ హెయిర్ సైన్సెస్‌లో జరిగింది. మొదటి రెండు వారాల మూడు నెలల్లో షమీకి ఫలితాలు రావడం మొదలైంది. యూజెనిక్స్ హెయిర్ సైన్సెస్ తన వెబ్‌సైట్‌లో మహ్మద్ షమీకి ఇచ్చిన చికిత్స గురించి సమాచారాన్ని పంచుకుంది. షమీ బట్టతలపై మొత్తం 4505 వెంట్రుకలు గ్రాఫ్ట్ వేశారు. వెంట్రుకలకు సంబంధించి ఒక వ్యక్తి ఏ రకమైన సమస్యతో బాధపడుతున్నారో గుర్తించి వారికి దానికి అనుగుణంగా చికిత్స అందిస్తారు.
నార్వుడ్ క్లాస్ 3 బట్టతల ఉన్నవారిలో 1000 నుండి 3000 గ్రాఫ్ట్‌లను ఉంచుతారు. దీనికి తక్కువ ఖర్చు అవుతుంది. నార్వుడ్ క్లాస్ 7 బట్టతల ఉన్నవారికి, 2,000 నుండి 5,000 గ్రాఫ్ట్‌లు చేయాల్సి వుంటుంది. దీనికి ధర ఎక్కువగా ఉంటుందని సదరు కంపెనీ తెలిపింది. ఒక్క గ్రాఫ్ట్‌లో ఎన్ని వెంట్రుకలు నాటాలనే రూల్ లేదు. సాధారణంగా రెండు వెంట్రుకలు మార్పిడి చేస్తారు.
mohammed shami hair secret
యూజెనిక్స్ హెయిర్ సైన్సెస్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ కోసం ఛార్జీలను చాలా ఎక్కువగానే వసూలు చేస్తుంది. యూజెనిక్స్ హెయిర్ సైన్సెస్ దీనిని ఖర్చు కాకుండా పెట్టుబడిగా చూడాలని సలహా ఇస్తుంది. ఒక్కో గ్రాఫ్ట్‌కు 100 నుంచి 500 వరకు వసూలు చేస్తున్నారు. అంటే షమీ చేయించుకున్న మెయిర్ ట్రాన్స్ ప్లాంట్ కు లక్షల్లోనే ఖర్చు అవుతుంది.
4.50 లక్షల నుంచి 22.50 లక్షల వరకు ఆండ్రీ 4500 గ్రాఫ్ట్ ఖర్చు అయ్యే అవకాశం ఉంది. కొద్ది రోజుల క్రితం మహ్మద్ షమీ తన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. సెలబ్రిటీ హెయిర్ స్టైలిస్ట్ అలీమ్ హకీమ్ షమీకి కొత్త హెయిర్ లుక్ ఇచ్చాడు. బట్టతలతో బాధపడుతున్న వారు వైద్యులను సంప్రదించి మీరు ఏరకమైన సమస్యతో వెంట్రుకలను కోల్పోతున్నారో తెలుసుకుని దానికి చికిత్సను తీసుకోవచ్చు.