MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Sports
  • Cricket
  • Ashes 2023: మనసు మార్చుకున్న మోయిన్ అలీ.. జట్టును మార్చిన ఇంగ్లాండ్

Ashes 2023: మనసు మార్చుకున్న మోయిన్ అలీ.. జట్టును మార్చిన ఇంగ్లాండ్

Ashes 2023: ఇంగ్లాండ్ వెటరన్ ఆల్ రౌండర్ మోయిన్ అలీ  మనసు మార్చుకున్నాడు.  రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. 

2 Min read
Author : Srinivas M
Published : Jun 07 2023, 03:34 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

రెండేండ్ల క్రితం టెస్టుల నుంచి రిటైర్మెంట్ తీసుకున్న ఇంగ్లాండ్ వెటరన్ ఆల్ రౌండర్  మోయిన్ అలీ తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. టెస్టు రిటైర్మెంట్ ను తాను వెనక్కి తీసుకున్నాడు.   యాషెస్ -2023  కోసం అలీ మనసు మార్చుకుని  మరోసారి రెడ్ బాల్ క్రికెట్  ఆడనున్నాడు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఇంగ్లాండ్ - ఆస్ట్రేలియా మధ్య  ఈ నెల 16 నుంచి  యాషెస్ సిరీస్ మొదలుకానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ఇదివరకే 15 మంది ఆటగాళ్లతో కూడిన జట్టును ప్రకటించింది. ఇందులో ఇంగ్లాండ్ స్టార్ స్పిన్నర్ జాక్ లీచ్ కూడా ఉన్నాడు. కానీ ఐర్లాండ్ తో  టెస్టు ముగిసిన తర్వాత లీచ్.. వెన్ను గాయం కారణంగా  ఈ సిరీస్ నుంచి తప్పుకున్నాడు. 

36

దీంతో ఇంగ్లాండ్ కు  మరో స్పిన్నర్ ను వెతకాల్సిన పని పడింది.  ఈసీబీ ఈ మేరకు మోయిన్ అలీని సంప్రదించింది. తన  టెస్ట్ రిటైర్మెంట్ ను వెనక్కి తీసుకోవాలని  కోరింది. ఇంగ్లాండ్ టెస్టు టీమ్ హెడ్ కోచ్ బ్రెండన్ మెక్‌కల్లమ్ కూడా రంగంలోకి దిగి  అలీని ఒప్పించాడు.  

46

అలీ కూడా తన రిటైర్మెంట్ నిర్ణయంపై ఈఎస్పీఎన్ క్రిక్ ఇన్ఫోతో స్పందిస్తూ.. తిరిగి టెస్టులు ఆడేందుకు సిద్ధమయ్యానని ఖాయం చేశాడు.  దీంతో ఈసీబీ జట్టును మార్చింది.  లీచ్ స్థానంలో అలీని చేర్చింది. 

56

మోయిన్ అలీ  తన  కెరీర్ లో  64 టెస్టులు ఆడి 2,914 పరుగులు  సాధించాడు.  ఇందులో ఐదు సెంచరీలు కూడా ఉన్నాయి. బౌలింగ్ లో అలీ.. 195 వికెట్లు పడగొట్టడం విశేషం.  2021 సెప్టెంబర్ లో  భారత్ తో నాలుగో టెస్టు ముగిసిన తర్వాత అలీ రిటైర్మెంట్ ప్రకటించాడు. 

66

యాషెస్ సిరీస్ లో తొలి రెండు టెస్టులకు ఇంగ్లాండ్ జట్టు : బెన్ స్టోక్స్ (కెప్టెన్), ఓలీ పోప్, జానీ బెయిర్ స్టో, జో రూట్, జేమ్స్ అండర్సన్, హ్యారీ బ్రూక్, మోయిన్ అలీ, బెన్ డకెట్, జాక్ క్రాలే, మాథ్యూ పాట్స్, ఓలీ రాబిన్సన్,  డాన్ లారెన్స్, క్రిస్ వోక్స్, మార్క్ వుడ్, జోష్ టంగ్ 

About the Author

SM
Srinivas M

Latest Videos
Recommended Stories
Recommended image1
Team India: 14 ఏళ్ల తర్వాత మళ్లీ భారత జట్టులో ద్రావిడ్ - సెహ్వాగ్ కాంబినేషన్
Recommended image2
IND vs SL: ఇండియా చేతిలో ఓడే మ్యాచ్‌ను నిలబెట్టిన దినూష.. కొలంబో టెస్టులో ఏం జరిగిందంటే?
Recommended image3
ICC Rankings: నెం.1 ర్యాంక్ ఖేల్ ఖతం.. బుమ్రాకు ఊహించని షాక్ ఇచ్చిన ఆసీస్ దిగ్గజం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved