అటు మొయిన్ ఆలీ ఎంట్రీ, ఇటు టీమిండియాలో గాయాలు... రెండో టెస్టులో కీలక మార్పులు...
తొలి టెస్టులో విజయం దాకా వచ్చిన టీమిండియాను వరుణుడు అడ్డుకున్నాడు. విజయానికి 157 పరుగులు చేయాల్సిన దశలో ఐదో రోజు భారీ వర్షం కురవడం, ఆట సాధ్యం కాకపోవడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. అయితే తొలి టెస్టులో పరాభవం నుంచి తృటిలో తప్పించుకున్న ఇంగ్లాండ్ జట్టు మార్పులు చేసేందుకు సిద్ధమైంది...

స్వదేశంలో జరిగిన ఇండియా, ఇంగ్లాండ్ టూర్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు మొయిన్ ఆలీ. ఐపీఎల్ 2021 వేలానికి ముందు జరిగిన టెస్టు మ్యాచ్‌లో 18 బంతుల్లో మూడు ఫోర్లు, ఐదు సిక్సర్లతో 43 పరుగులు చేసి ప్రేక్షకులను అలరించాడు మొయిన్...
చెన్నైలో జరిగిన టెస్టులో మాత్రమే ఆడిన మొయిన్ ఆలీ ఆ మ్యాచ్‌లో 49 పరుగులతో ఇంగ్లాండ్ తరుపున టాప్ స్కోరర్‌గా నిలవడమే కాకుండా 8 వికెట్లు తీసి, అత్యధిక వికెట్లు తీసిన ఇంగ్లాండ్ బౌలర్‌గానూ నిలిచాడు. ఆ తర్వాత గాయం కారణంగా స్వదేశానికి వెళ్లిపోయాడు...
టీమిండియాపై మొయిన్ ఆలీకి మంచి రికార్డు ఉంది. టెస్టు ఫార్మాట్‌లో భారత్‌పై 673 పరుగులు చేసిన మొయిన్ ఆలీ, 49 వికెట్లు కూడా పడగొట్టి ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టాడు...
వన్‌డౌన్‌లో వచ్చిన జాక్ క్రావ్లీని రెండో టెస్టు నుంచి తప్పించిన ఇంగ్లాండ్, అతని స్థానంలో హసీబ్ హమీద్‌కి అవకాశం ఇచ్చింది. చివరిసారిగా 2016 నవంబర్‌లో మ్యాచ్ ఆడిన హమీద్, ఇండియాతో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో సెంచరీతో ఆకట్టుకుని, జట్టులో చోటు సంపాదించుకున్నాడు...
రెండో టెస్టుకి ఇంగ్లాండ్ జట్టు ఇది: రోరీ బర్న్స్, డామ్ సిబ్లీ, హసీబ్ హమీద్, జో రూట్, బెయిర్ స్టో, మొయిన్ ఆలీ, డానియల్ లారెన్స్, బట్లర్, సామ్ కుర్రాన్, ఓల్లీ రాబిన్‌సన్, స్టువర్ట్ బ్రాడ్, అండర్సన్..
మరో వైపు టీమిండియాను గాయాలు వెంటాడుతున్నాయి. నెట్స్‌లో సిరాజ్ బౌన్సర్ బలంగా తాకడంతో గాయపడిన మయాంక్ అగర్వాల్ గాయం నుంచి కోలుకుని, రెండో టెస్టుకి అందుబాటులో రానున్నాడు.
అయితే మయాంక్ స్థానంలో ఆఖరి నిమిషంలో ఓపెనర్‌గా వచ్చిన కెఎల్ రాహుల్, టీమిండియా తరుపున టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కాబట్టి రాహుల్‌ను పక్కనబెట్టి, మయాంక్‌ను ఆడించడం సరైన నిర్ణయం కాదు...
మయాంక్ గాయం నుంచి కోలుకున్నాడని సంతోషించేలోపు ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ గాయంతో బాధపడుతున్నాడని తెలిసింది. తొలి టెస్టులో బ్యాటింగ్‌లో రాణించకపోయినా బౌలింగ్‌లో నాలుగు వికెట్లు తీసి అదరగొట్టాడు శార్దూల్ ఠాకూర్...
తొలి ఇన్నింగ్స్‌లో జో రూట్, రాబిన్‌సన్‌లను అవుట్ చేసిన శార్దూల్ ఠాకూర్, రెండో ఇన్నింగ్స్‌లో లారెన్స్, జోస్ బట్లర్ వికెట్లు తీశాడు. శార్దూల్ ఠాకూర్ స్థానంలో అశ్విన్ లేదా ఉమేశ్ యాదవ్ ఆడే అవకాశం ఉంది.