మిథాలీ రాజ్ పెళ్లి చేసుకోకపోవడానికి అదే కారణమా... ఆ క్రికెటర్‌తో ప్రేమాయణం...
భారత మహిళా టీమ్ కెప్టెన్, లెజెండరీ బ్యాటర్ మిథాలీ రాజ్ అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించింది. 16 ఏళ్ల టీనేజ్ వయసులో టీమిండియాలోకి వచ్చిన మిథాలీ రాజ్, 39 ఏళ్ల వయసులో క్రికెట్ నుంచి తప్పుకుంది. అయితే ఇంత వయసొచ్చినా మిథాలీ పెళ్లి ఎందుకు చేసుకోలేదు? వివాహంపై ఆమె అభిప్రాయం ఏంటి?...

డిసెంబర్ 3, 1982న రాజస్థాన్‌లో జోద్‌పూర్‌లో జన్మించిన మిథాలీ రాజ్, హైదరాబాద్‌లో చదువుకుంది. ఆంధ్రా టీమ్ తరుపున దేశవాళీ క్రికెట్ టోర్నీలు ఆడిన మిథాలీ రాజ్... ఎయిర్ ఇండియా, రైల్వేస్ టీమ్స్ తరుపున కూడా ప్రాతినిథ్యం వహించింది...
Mithali Raj
అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో 12 టెస్టులు, 232 వన్డేలు, 89 టీ20 మ్యాచులు ఆడిన మిథాలీ రాజ్... టెస్టుల్లో 699, వన్డేల్లో 7805, టీ20ల్లో 2364 పరుగులు చేసి... అత్యధిక పరుగులు చేసిన వుమెన్ క్రికెటర్‌గా టాప్‌లో నిలిచింది...
అయితే 39 ఏళ్ల మిథాలీ రాజ్, ఇప్పటిదాకా ఎందుకు పెళ్లి చేసుకోలేదనేది చాలా ఆసక్తికరంగా మారింది. వాస్తవానికి మిథాలీ రాజ్‌కి 22 ఏళ్లు వచ్చినప్పటి నుంచి ఆమె కోసం పెళ్లి సంబంధాలు వెతకడం ప్రారంభించారు కుటుంబసభ్యులు...
అయితే క్రికెట్‌తో బిజీగా ఉండే మిథాలీరాజ్, ఎన్ని సంబంధాలు వచ్చినా వాటిని రిజెక్ట్ చేసేసింది. 27-30 ఏళ్లు వచ్చిన తర్వాత మిథాలీ రాజ్ పెళ్లి గురించి ఆలోచన చేసిందట.అయితే అప్పుడు వచ్చిన సంబంధాల్లో చాలా మంది క్రికెట్‌ని వదిలేయాలని చెప్పడంతో వారిని వదిలేసిందట మిథాలీ...
Mithali Raj
ఇలా మిథాలీ రాజ్ క్రికెట్ కోసం తన పర్సనల్ లైఫ్‌ని, మ్యారేజ్ లైఫ్‌ని త్యాగం చేసేసింది. అయితే పెళ్లి చేసుకోనందుకు తానేం బాధపడడం లేదని, సింగిల్ లైఫ్‌లో చాలా హ్యాపీగా ఉన్నానని అంటుంది మిథాలీరాజ్...
‘కొన్నాళ్ల క్రిందట నాకు పెళ్లి ఆలోచన వచ్చింది. అయితే ఇప్పుడు అలాంటి ఆలోచనలు ఏమీ లేవు. ఎందుకంటే పెళ్లైన వాళ్లను చూసిన తర్వాత సింగిల్‌గా ఉండడమే చాలా బెటర్ అనిపిస్తోంది... ’ అంటూ కామెంట్ చేసింది మిథాలీ రాజ్...
అయితే కొన్నాళ్ల కిందట మిథాలీరాజ్, భారత సీనియర్ క్రికెటర్ శిఖర్ ధావన్‌తో ప్రేమలో ఉందని, త్వరలో ఈ ఇద్దరూ వివాహం చేసుకోబోతున్నట్టు వార్తలు వచ్చాయి. ఇప్పటికే తన కంటే 10 ఏళ్లు పెద్దదైన అయేషా ముఖర్జీని పెళ్లి చేసుకుని, 8 ఏళ్ల వైవాహిక జీవితం తర్వాత ఆమెతో విడాకులు తీసుకున్నాడు శిఖర్ ధావన్..
టీమిండియా తరుపున వన్డేలు ఆడుతున్నా టీ20, టెస్టు ఫార్మాట్లలో చోటు కోల్పోయిన శిఖర్ ధావన్, రీఎంట్రీ కోసం తెగ శ్రమిస్తున్నాడు. మ్యారేజ్ లైఫ్‌లో దెబ్బతిన్న గబ్బర్, మరోసారి ఇలాంటి నిర్ణయం తీసుకుంటాడా? మిథాలీరాజ్, శిఖర్ ధావన్‌ల మధ్య ఏదో ఉందనే వార్త ఉట్టి పుకారే అని చాలా మంది అభిప్రాయం..