MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Sports
  • Cricket
  • MI vs LSG: ఐపీఎల్ చరిత్రలో ఒకేఒక్కడు.. కెప్టెన్ గా హార్దిక్ పాండ్యా కొత్త రికార్డు

MI vs LSG: ఐపీఎల్ చరిత్రలో ఒకేఒక్కడు.. కెప్టెన్ గా హార్దిక్ పాండ్యా కొత్త రికార్డు

Hardik Pandya 5 Wickets: ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్) 2025 16వ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ను లక్నో సూపర్ జెయింట్స్ 12 ప‌రుగుల తేడాతో ఓడించింది. అయితే, ఈ మ్యాచ్ లో ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా అద్భుత బౌలింగ్ తో చ‌రిత్ర సృష్టించాడు.   

2 Min read
Author : Mahesh Rajamoni
| Updated : Apr 05 2025, 12:40 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Image Credit: ANI

Image Credit: ANI

Hardik Pandya 5 Wickets : లక్నో సూపర్ జెయింట్స్ - ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్) 2025 16వ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలో ఒకే మ్యాచ్‌లో 5 వికెట్లు తీసిన తొలి కెప్టెన్‌గా హార్దిక్ రికార్డు సాధించాడు. అత‌ని కంటే ఐపీఎల్ లో  ఎవరూ ఈ  రికార్డును సాధించ‌లేక‌పోయారు. తొలి ఇన్నింగ్స్ చివరి ఓవర్‌లో ఆకాశ్‌దీప్‌ను పెవిలియన్‌కు పంపడంతో హార్దిక్ ఈ ఘనత సృష్టించాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
Hardik Pandya. (Photo: IPL)

Hardik Pandya. (Photo: IPL)

హార్దిక్ పాండ్యా ఆల్ రౌండ్ షో !

ల‌క్నో తో జరిగిన మ్యాచ్ లో హార్ధిక్ పాండ్యా ఆల్ రౌండ్ షో చూపించాడు. బౌలింగ్ లో 5 వికెట్ల‌తో పాటు బ్యాటింగ్ లో 28 ప‌రుగులు నాటౌట్ ఇన్నింగ్స్ ను ఆడాడు. హార్దిక్ పాండ్యాకు ఐపీఎల్ 5 వికెట్లు తీసుకోవ‌డం ఇదే తొలి సారి. మొత్తంగా త‌న టీ20 కెరీర్ లో తొలిసారి ఐదు వికెట్లు తీసుకున్నాడు. 

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్న తర్వాత, హార్దిక్ బంతితో అద్భుతంగా రాణించాడు. త‌న 4 ఓవర్లలో 36 పరుగులకు 5 వికెట్లు పడగొట్టాడు. ఐడెన్ మార్క్రమ్, నికోలస్ పూరన్, డేవిడ్ మిల్లర్, రిషబ్ పంత్ వంటి ప్రమాదకరమైన బ్యాట్స్‌మెన్‌లను పెవిలియన్‌కు పంపాడు. ఆకాశ్‌దీప్ అతని 5వ వికెట్. 

35
Image Credit: Twitter/Mumbai Indians

Image Credit: Twitter/Mumbai Indians

టీ20 క్రికెట్ లో హార్దిక్ పాండ్యా బెస్ట్ బౌలింగ్ రికార్డులు 

5/36 vs లక్నో సూపర్ జెయింట్స్, లక్నో, 2025
4/16 vs న్యూజిలాండ్, అహ్మదాబాద్, 2023
4/33 vs ఇంగ్లాండ్, సౌతాంప్టన్, 2022
4/38 vs ఇంగ్లాండ్, బ్రిస్టల్, 2018

45
rohit sharma and hardik pandya

rohit sharma and hardik pandya

16 ఏళ్ల చరిత్రను మార్చేసిన హార్దిక్ పాండ్యా 

హార్దిక్ పాండ్యా 5 వికెట్లు పడగొట్టడం ద్వారా 16 ఏళ్ల ఐపీఎల్ చరిత్రను తిరగరాశాడు. కెప్టెన్‌గా ఒకే ఐపీఎల్ మ్యాచ్‌లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాల రికార్డు అనిల్ కుంబ్లే పేరిట ఉంది. అతను 2009లో డెక్కన్ ఛార్జర్స్‌పై 16 పరుగులకు 4 వికెట్లు పడగొట్టాడు. ఇప్పుడు హార్దిక్ పాండ్యా ఈ రికార్డును బ‌ద్ద‌లు కొట్టాడు. 5/36 వికెట్ల‌తో హార్దిక్ కెప్టెన్‌గా ఐపీఎల్ మ్యాచ్‌లో అత్యుత్తమ బౌలర్‌గా నిలిచాడు.

55

ఐపీఎల్ మ్యాచ్‌లో కెప్టెన్‌గా బెస్ట్ బౌలింగ్ రికార్డులు 

5/36 - హార్దిక్ పాండ్యా vs లక్నో సూపర్ జెయింట్స్, లక్నో, 2025
4/16 - అనిల్ కుంబ్లే vs డెక్కన్ ఛార్జర్స్, జోహన్నెస్‌బర్గ్, 2009
4/16 - అనిల్ కుంబ్లే vs డెక్కన్ ఛార్జర్స్, నవీ ముంబై, 2010
4/17 - జేపీ డుమినీ vs సన్‌రైజర్స్ హైదరాబాద్, వైజాగ్, 2015
4/21 - షేన్ వార్న్ vs డెక్కన్ ఛార్జర్స్, నాగ్‌పూర్, 2010

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
భారత జాతీయ క్రికెట్ జట్టు
క్రీడలు
ఇండియన్ ప్రీమియర్ లీగ్
భారత దేశం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Abhishek Sharma Secret: అభిషేక్ శర్మ విధ్వంసం వెనకున్న సక్సెస్ సీక్రెట్ ఇదే !
Recommended image2
Abhishek Sharma: ఒకేఒక్క ఇన్నింగ్స్ తో 7 రికార్డులు బద్దలు కొట్టిన అభిషేక్ శర్మ
Recommended image3
IND vs AFG 3rd T20: ఆఫ్ఘన్‌ను చిత్తుగా ఓడించిన టీమిండియా.. 127 పరుగులతో భారీ విజయం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved