- Home
- Sports
- Cricket
- మిస్టర్ RP అంటే రిషబ్ పంత్ కాదు! ఎవరో చెప్పేసిన ఊర్వశి రౌతెల్లా... ఏకంగా టాలీవుడ్ హీరోపైనే కన్నేసిన...
మిస్టర్ RP అంటే రిషబ్ పంత్ కాదు! ఎవరో చెప్పేసిన ఊర్వశి రౌతెల్లా... ఏకంగా టాలీవుడ్ హీరోపైనే కన్నేసిన...
కొందరు హీరోయిన్లు సూపర్ హాట్ ఫోటోలు పోస్టు చేసి, జనాల అటెన్షన్ పొందడానికి అష్టకష్టాలు పడుతుంటే... బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతెల్లా మాత్రం ‘ఆర్‌పీ’ దుమారం రేగి సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. నెల రోజుల కిందట తనను కలవడానికి ‘మిస్టర్ ఆర్‌పీ’ వచ్చాడని ఓ ఇంటర్వ్యూలో ఊర్వశి చేసిన కామెంట్లు, అటు ఇటు తిరిగి టాలీవుడ్ హీరో రామ్ పోతినేని దాకా వచ్చి ఆగాయి..

‘నా కోసం మిస్టర్ ఆర్‌పీ, వారణాసికి వచ్చాడు. నేను ఆ రోజంతా షూటింగ్ చేసి అలిసిపోయి, హోటల్ రూమ్‌కొచ్చి పడుకున్నా. మిస్టర్ ఆర్‌పీ ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తలేదు. దాంతో అతను అలిగి వెళ్లిపోయాడు...’ అంటూ ఓ టీవీ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కామెంట్ చేసింది బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశి రౌతెల్లా...
ఈ సంఘటన తర్వాత రిషబ్ పంత్,‘నన్ను వదిలేయి అక్కో’ అనే లెవెల్లో రియాక్ట్ అవ్వడం, దానికి ఊర్వశి రౌతెల్లా... ‘బ్యాటు బాల్ ఆట చూసుకో తమ్ముడూ’ అంటూ సమాధానం ఇవ్వడంతో ఇన్‌స్టాలో ఓ ‘నిబ్బా నిబ్బీ’ స్టైల్ వార్ నడిచింది...
రిషబ్ పంత్ అని నేరుగా పేరు చెప్పకపోయినా, ‘మిస్టర్ ఆర్‌పీ’ అని ప్రస్తావించడం... అంతకుముందే చాలా రోజుల పాటు రిషబ్ పంత్, ఊర్వశి రౌతెల్లా మధ్య ప్రేమాయణం నడిచిందనే వార్తలు రావడంతో ఆ ‘ఆర్‌పీ’ ఎవరో అందరికీ ఇట్టే అర్థమైపోయింది... గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టు రిషబ్ పంత్ రియాక్ట్ అయ్యి, ఆమె కామెంట్లు తన గురించేనని చెప్పకనే చెప్పేశాడు..
అయితే ‘ఆర్‌పీ’ అంటే రిషబ్ పంత్ కాదని ఊర్వశి రౌతెల్లా వ్యాఖ్యానించడంతో మరి ఆ ‘ఆర్‌పీ’ ఎవరు? అనే కొత్త ప్రశ్నకు కొంటె సమాధానాలు, ఫన్నీ మీమ్స్ వైరల్ అయ్యాయి. కొందరు ఆర్‌పీ అంటే రికీ పాంటింగ్ అయ్యుంటుందని, మరికొందరు రియాన్ పరాగ్ అయ్యుంటాడని రకరకాల కథనాలు అల్లేశారు కూడా...
తాజాగా ఈ ఆర్‌పీ లిస్టులోకి చేరాడు టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని. ‘ది వారియర్’ సినిమా రిజల్ట్ తేడా కొట్టడంతో కాస్త బ్రేక్ తీసుకున్న ఎనర్జిటిక్ స్టార్ రామ్, ప్రస్తుతం మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో ఊర్వశి రౌతెల్లా ఓ ఐటెమ్ సాంగ్ చేయబోతోంది...
ఈ ఐటెమ్ సాంగ్ కోసం రామ్‌ని కలిసిన ఊర్వశి రౌతెల్లా అతనితో దిగిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ఇక్కడి దాకా బాగానే ఉంది కానీ ఈ ఫోటోకి ఆమె ‘ఆర్‌పీ’ అనే ట్యాగ్ ఇచ్చి లవ్, ఎర్ర గులాజీ ఎమోజీలను జోడించడంతో క్రికెట్ ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. కొంపతీసి ‘మిస్టర్ ఆర్‌పీ’ అంటే రిషబ్ పంత్ కాదు, రామ్ పోతినేని అని ఊర్వశి చెప్పినా చెబుతుందని టాలీవుడ్ హీరో ఫ్యాన్స్ దిగులుపడుతున్నారు...
Image credit: Getty
ఐసీసీ విడుదల చేసిన టీ20 వరల్డ్ కప్ 2022 ప్రోమోలో బిగ్గెస్ట్ స్టార్‌గా కనిపించిన రిషబ్ పంత్, ఇప్పటిదాకా జరిగిన మొదటి రెండు మ్యాచుల్లో రిజర్వు బెంచ్‌కే పరిమితమయ్యాడు. పాకిస్తాన్‌తో, నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచుల్లో సీనియర్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్‌కి తుది జట్టులో చోటు కల్పించింది టీమిండియా...