కుల్దీప్ యాదవ్ ఫెయిల్యూర్‌కి అతనే కారణమా... అప్పుడు మహేంద్ర సింగ్ ధోనీ వల్లే...
కుల్దీప్ యాదవ్... ఒకప్పుడు టీమిండియాలో స్టార్ స్పిన్నర్. మణికట్టు మాంత్రికుడిగా, చైనామెన్ యాక్షన్‌తో వైవిధ్యమైన బంతులతో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను ముప్పుతిప్పలు పెట్టిన బౌలర్... అయితే ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది...
ఊహించని రీతిలో ఇంగ్లాండ్‌తో జరిగిన మొదటి రెండు వన్డేల్లో చోటు దక్కించుకున్నాడు కుల్దీప్ యాదవ్. మొదటి వన్డేలో 9 ఓవర్లు వేసి 68 పరుగులిచ్చిన కుల్దీప్, రెండో వన్డేలో ఏకంగా 84 పరుగులు సమర్పించుకున్నాడు...
2017లో ఎంట్రీ ఇచ్చిన కుల్దీప్ యాదవ్, తాను ఆడిన మొదటి 31 మ్యాచుల్లో 67 వికెట్లు తీసి అదరగొట్టాడు. అయితే 2019 తర్వాతే అతని పర్ఫామెన్స్ గ్రాఫ్ పూర్తిగా పడిపోయింది...
మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ గైడెన్స్‌లో, మాహీ చెప్పినట్టుగా బౌలింగ్ వేసి వికెట్లు తీసేవాడు కుల్దీప్ యాదవ్. మాహీ రిటైర్మెంట్ తర్వాత కుల్దీప్ పూర్తిగా విఫలం అవుతున్నాడు...
ధోనీ, ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ బ్యాటింగ్‌ను క్షుణ్ణంగా అర్థం చేసుకుని, ఎలా బౌలింగ్ వేయాలో బౌలర్లకు సూచించేవాడు. ఒకవేళ తాను చెప్పినట్టుగా బౌలింగ్ వేయకపోతే తిట్టేవాడు కూడా. అది బౌలర్, తాను చేసిన తప్పులను గుర్తించి, సరిదిద్దుకోవడానికి ఉపయోగపడేది...
భారత జట్టు తరుపున వన్డేల్లో రెండు హ్యాట్రిక్‌లు నమోదుచేసిన ఏకైక బౌలర్ కుల్దీప్ యాదవ్. 2017లో ఆస్ట్రేలియాపై హ్యాట్రిక్ తీసిన కుల్దీప్, 2019లో విండీస్‌పై వరుసగా మూడు వికెట్లు తీశాడు...
మాహీతో పోలిస్తే రిషబ్ పంత్‌కి అంత అనుభవం లేదు. రెండో వన్డేలో వేగంగా బౌలింగ్ వేస్తే, వికెట్ పడుతుందని సూచించాడు రిషబ్ పంత్. కానీ స్పిన్ వేగం పెరిగేకొద్దీ, బ్యాట్స్‌మెన్‌కి సిక్సర్లు బాదడం తేలికయింది...
రిషబ్ పంత్ లేని మ్యాచుల్లో వికెట్ కీపర్‌గా వ్యవహారించే కెఎల్ రాహుల్ గురించి చెప్పాల్సిన పనే లేదు. బౌలర్లకు ఎలాంటి సలహాలు ఇవ్వకుండా కేవలం కీపింగ్ చేయడమే తన పని అన్నట్టుగా ఉంటాడు కెఎల్ రాహుల్...
2017, 2018 ఏడాదిలో 70 నుంచి 77 కి.మీ.ల వేగంతో బౌలింగ్ చేసిన కుల్దీప్ యాదవ్, ఆ తర్వాత బౌలింగ్ వేగాన్ని 80కి పైగా పెంచాడు. ఈ కారణంగానే అతని పర్ఫామెన్స్ స్థాయికి తగ్గట్టుగా ఉండడం లేదనేది విశ్లేషకుల అంచనా...
బంతి, బంతికి వైవిధ్యం చూపిస్తూ బ్యాట్స్‌మెన్‌ను కంఫ్యూజ్ చేస్తూ వికెట్లు రాబట్టడం కుల్దీప్ యాదవ్ స్పెషాలిటీ. కానీ గత రెండు మ్యాచుల్లో కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో ఇది కనిపించలేదు...
అదీకాకుండా ఐపీఎల్‌లో కూడా కుల్దీప్ యాదవ్‌కి పెద్దగా బౌలింగ్ చేసే అవకాశం రావడం లేదు. 2019లో 9 మ్యాచులు, 2020లో అయితే కేవలం ఐదు మ్యాచులు మాత్రమే ఆడాడు కుల్దీప్ యాదవ్...
2018లో 16 మ్యాచుల్లో 17 వికెట్లు తీసిన కుల్దీప్ యాదవ్‌కి అవకాశాలు ఇవ్వకుండా జట్టుతో కొనసాగిస్తూ కోల్‌కత్తా నైట్‌రైడర్స్ వ్యవహారిస్తున్న విధానం కూడా ఈ స్పిన్నర్ ఫెయిల్యూర్‌కి కారణం కావచ్చు...
కేకేఆర్‌తో పాటు భారత జట్టు కూడా కుల్దీప్ యాదవ్ విషయంలో ఇలాగే వ్యవహరిస్తోంది. ప్రతీ సిరీస్‌కు కుల్దీప్ యాదవ్‌ని ఎంపిక చేయడం, రిజర్వు బెంచ్‌కే పరిమితం చేయడం కామన్ అయిపోయింది...
ఈ కారణంగానే తనకి అవకాశం రాదని కుల్దీప్ యాదవ్ ఫిక్స్ అయిపోయాడు. ఇంగ్లాండ్‌తో జరిగన రెండో టెస్టులో కుల్దీప్ యాదవ్‌కి చోటు దక్కినా అతను వేసింది పట్టుమని 12 ఓవర్లే... ఈ అపనమ్మకమే కుల్దీప్ యాదవ్‌ని కృంగదీసి, అతని కెరీర్ గ్రాఫ్ పడిపోవడానికి కారణమైంది..
సత్తా ఉన్న ప్లేయర్‌ను ఎంపిక చేయకపోతే, అతను మరింత మెరుగ్గా రాణించాలనే కసితో ఆడతాడు. అదే ప్లేయర్‌ను ఎంపిక చేసి, తుది జట్టులో అవకాశం ఇవ్వకపోతే, అది అతని పర్ఫామెన్స్‌ను దెబ్బతీయడమే అవుతుంది..
అద్భుతమైన టాలెంట్ ఉన్న స్పిన్నర్లుగా కెరీర్‌ను మొదలెట్టిన శ్రీలంక మిస్టరీ స్పిన్నర్ అజంతా మెండీస్, ఆ తర్వాత ఆ రేంజ్ పర్ఫామెన్స్ ఇవ్వలేక కెరీర్‌ను ఫినిష్ చేసుకున్నాడు. కుల్దీప్ యాదవ్ కూడా ఇప్పుడు అలాంటి ప్రమాదంలోనే ఉన్నాడు. మెండిస్, కుల్దీప్ యాదవ్ ఇద్దరూ కూడా మొదటి 20 టీ20 మ్యాచుల్లో 39 వికెట్లు తీయడం కొసమెరుపు...