MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • LSG vs GT: లక్నోను దంచికొట్టిన గిల్.. గుజరాత్ తొలి ప్లేయర్ గా రికార్డు

LSG vs GT: లక్నోను దంచికొట్టిన గిల్.. గుజరాత్ తొలి ప్లేయర్ గా రికార్డు

LSG vs GT  IPL 2025: ఐపీఎల్ 2025లో  26వ మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్-గుజరాత్ టైటాన్స్ తలపడ్డాయి. టాస్ గెలిచిన రిషబ్ పంత్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. దీందో మొదట బ్యాటింగ్ కు దిగిన గుజరాత్ కు కెప్టెన్ శుభ్ మన్ గిల్ సూపర్ నాక్ తో అదరగొట్టి మరో ఐపీఎల్ రికార్డు సాధించాడు.  

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Apr 12 2025, 09:21 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Shubman Gill. (Photo  IPL)

Shubman Gill. (Photo- IPL)

Shubman Gill: లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్ మన్ గిల్ సూపర్ నాక్ తో అదరగొట్టాడు.  ఐపీఎల్ 2025 26వ మ్యాచ్‌లో లక్న్ - గుజరాత్ జట్లు లక్నోలోని భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఎకానా క్రికెట్ స్టేడియంలో తలపడ్డాయి. 

టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. ఇందులో గిల్, సాయి సుదర్శన్ మధ్య 120 పరుగుల బిగ్  ఓపెనింగ్ భాగస్వామ్యం కూడా ఉంది. గిల్ మరోసారి కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో రికార్డుల మోత మోగించాడు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
Shubman Gill

Shubman Gill

లక్నో బౌలింగ్ ను దంచికొట్టిన గిల్ 

టాస్ గెలిచిన రిషబ్ పంత్ గుజరాత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. సాయి సుదర్శన్‌తో కలిసి ఓపెనర్‌గా బరిలోకి దిగిన గిల్, సెంచరీ ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నెలకోల్పాడు. వీరిద్దరి సూపర్ నాక్ తో ఒక్క వికెట్ నష్టపోకుండా 120 పరుగులకు చేర్చాడు. 38 బంతుల్లో 60 పరుగులు చేసిన గిల్ తన ఇన్నింగ్స్ లో  6 ఫోర్లు, ఒక సిక్సర్ బాదాడు. 

అలాగే, సాయి సుదర్శన్ 37 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్సర్ తో 56  పరుగులు చేశాడు. అయితే, వీరిద్దరూ ఔటవగానే, గుజరాత్ బ్యాటింగ్ తడబడింది. 200లకు పైగా పరుగులు చేస్తుందనుకున్న జీటీ 180 పరుగులు మాత్రమే చేసింది. 

35
Shubman Gill

Shubman Gill

గుజరాత్ తరఫున తొలి బ్యాట్స్‌మన్ గా గిల్ మరో ఐపీఎల్ రికార్డు 

శుభ్‌మన్ గిల్ తన 60 పరుగుల ఇన్నింగ్స్‌తో గుజరాత్ టైటాన్స్ తరపున 2000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఐపీఎల్ లో గుజరాత్ ఫ్రాంచైజీ తరపున ఈ మార్కును అందుకున్న మొదటి బ్యాట్స్‌మన్ గిల్. ఒక జట్టు తరపున అత్యంత వేగంగా 2000 పరుగులు చేసిన బ్యాట్స్‌మన్ గా కూడా గిల్ 5వ స్థానంలో ఉన్నాడు.

ఐపీఎల్ 2022 ప్రీ-వేలం డ్రాఫ్ట్‌లో గిల్ గుజరాత్‌తో చేరాడు. వేలానికి ముందు గుజరాత్ టైటాన్స్ హార్దిక్ పాండ్యా, రషీద్ ఖాన్‌లను కూడా ఎంపిక చేసింది. 2022 ఐపీఎల్‌లో శుభ్‌మన్ 16 మ్యాచ్‌ల్లో 483 పరుగులు చేశాడు. 2018లో అరంగేట్రం చేసిన తర్వాత ఇది అతని అత్యుత్తమ ఐపీఎల్ ప్రదర్శన. హార్దిక్ కెప్టెన్సీలో గుజరాత్ ఐపీఎల్ 2022 ఫైనల్‌లో రాజస్థాన్ రాయల్స్‌ను ఓడించి, ఐపీఎల్ తొలి సీజన్‌లోనే ట్రోఫీని గెలుచుకోవడంలో గిల్ కీలకపాత్ర పోషించాడు.

45
Shubman Gill

Shubman Gill

ఒక జట్టు తరపున అత్యంత వేగంగా 2000 పరుగులు చేసిన బ్యాట్స్‌మన్

క్రిస్ గేల్ - 41 ఇన్నింగ్స్ (ఆర్సీబీ)
కేఎల్ రాహుల్ - 43 ఇన్నింగ్స్ (పంజాబ్ కింగ్స్)
డేవిడ్ వార్నర్ - 47 ఇన్నింగ్స్ (ఎస్‌ఆర్‌హెచ్)
జోస్ బట్లర్ - 49 ఇన్నింగ్స్ (ఆర్‌ఆర్)
శుభ్‌మాన్ గిల్ - 51 ఇన్నింగ్స్ (గుజరాత్ టైటాట్స్)

55
Shubman Gill (Photo: IPL)

Shubman Gill (Photo: IPL)

గత కొన్ని సంవత్సరాలుగా గిల్ ఐపీఎల్ లో అద్భుతంగా రాణిస్తున్నాడు. ఐపీఎల్ 2023లో శుభ్‌మాన్ అద్భుతమైన ఫామ్‌తో పరుగులు వర్షం కురిపిచాడు. 59.33 సగటుతో 890 పరుగులు చేశాడు. అందులో 3 సెంచరీలు, 4 అర్ధ సెంచరీలు ఉన్నాయి. అయితే, ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో గుజరాత్ ఓడిపోయింది. దీంతో వరుసగా రెండవ ఐపీఎల్ టైటిల్ గెలుచుకోవాలనే వారి కల చెదిరిపోయింది. ఐపీఎల్ 2024లో ముందు హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్‌లో చేరడంతో గిల్ గుజరాత్ జట్టును ముందుకు నడిపిస్తూ 12 మ్యాచ్‌ల్లో 426 పరుగులు చేశాడు.

గుజరాత్ టైటాన్స్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్లు

శుభ్ మన్ గిల్ - 2007
సాయి సుదర్శన్ - 1363
డేవిడ్ మిల్లర్ - 950
హార్దిక్ పాండ్యా - 833
వృద్ధిమాన్ సాహా - 824

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్
క్రికెట్
భారత జాతీయ క్రికెట్ జట్టు
క్రీడలు
శుభ్‌మన్ గిల్
 
1st ODI • NZ vs IND 2026
Result
NZNZ
185
INDIND
143/5
IND beat NZ by 5 wickets (D/L) method
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th ODI • NZ vs IND 2026
NZNZ
Sun, 15 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
SRH vs CSK : సిఎస్కే తో సన్ రైజర్స్ హైదరాబాద్ బిగ్ డీల్.. రూ.13 కోట్ల ప్లేయర్ ఔట్, టాప్ బౌలర్లు ఇన్
Recommended image2
IPL 2027: ముంబై ఇండియన్స్ నుంచి ఔట్.. ఐపీఎల్ 2027లో హార్దిక్ పాండ్యా కొత్త టీమ్ ఇదే !
Recommended image3
IND vs NZ: తొలి వన్డేలో భారత్ జోరు.. కోహ్లీ మెరుపులు, కివీస్‌పై ఘన విజయం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved