- Home
- Sports
- Cricket
- ఒక్క మ్యాచ్ ఓడినంత మాత్రాన రోహిత్ శర్మ బ్యాడ్ కెప్టెన్ అయిపోడు! - ఆసీస్ మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్...
ఒక్క మ్యాచ్ ఓడినంత మాత్రాన రోహిత్ శర్మ బ్యాడ్ కెప్టెన్ అయిపోడు! - ఆసీస్ మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్...
భారీ అంచానలతో టీమిండియా కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న రోహిత్ శర్మ, గడిచిన ఏడాదిన్నరలో ఆశించిన స్థాయిలో విజయాలను అందుకోలేకపోయాడు. టీ20 వరల్డ్ కప్ 2022 సెమీస్, ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2023 ఫైనల్స్‌లో రోహిత్ సేన ఓటమి పాలైంది...

Rohit Sharma
ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్, టీమిండియా టెస్టు కెప్టెన్‌గా రోహిత్ శర్మకు మొట్టమొదటి ఫారిన్ టెస్టు కూడా... విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో ఇదే గ్రౌండ్‌లో మొట్టమొదటి విదేశీ టెస్టు సెంచరీ చేసిన రోహిత్ శర్మ, కెప్టెన్‌గా డబ్ల్యూటీసీ ఫైనల్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 15, రెండో ఇన్నింగ్స్‌లో 43 పరుగులు చేసి నిరాశపరిచాడు..
‘టెస్టు కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న తర్వాత రోహిత్ శర్మ, స్వదేశంలో ఆస్ట్రేలియాపై టెస్టు సిరీస్ గెలిచాడు. బ్యాటర్‌గా కూడా బాగానే రాణించాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టెస్టు సెంచరీ కూడా సాధించాడు...
Rohit Sharma
ఒక్క ఫైనల్ ఓడినంత మాత్రం బ్యాడ్ కెప్టెన్ అయిపోడు, అలాగే ఒక్క మ్యాచ్ ఓడిపోయినంత మాత్రం టీమిండియా బ్యాడ్ టీమ్ అయిపోదు. వరుసగా రెండు సార్లు ఫైనల్స్ ఆడడం కూడా ఈజీ కాదు...
Rohit Sharma-Gill
నాలుగేళ్ల కాలంలో వరుసగా రెండు సార్లు వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్స్ ఆడిన ఒకే ఒక్క టీమ్ భారత్. అలాంటి ఫీట్ సాధించాలంటే టెస్టుల్లో పూర్తిగా డామినేట్ చేయగలిగాలి. అందుకే వాళ్లు టాప్ టీమ్‌గా ఉన్నారు...
నాకు ఇంకా రోహిత్ శర్మపై పూర్తి నమ్మకం ఉంది. అతను చాలా మంచి కెప్టెన్. పాజిటివ్ మైండ్‌సెట్‌తో టీమ్‌ని నడిపిస్తాడు. ఐపీఎల్‌లో అతని ట్రాక్ రికార్డు అందరికీ తెలుసు..
rohit sharma
ఒక్క వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ ఓడినందుకు రోహిత్ శర్మ, టీమిండియాని నడిపించడానికి సరైన వ్యక్తి కాదని చెప్పడం తగదు. అదీకాకుండా వన్డే వరల్డ్ కప్ రాబోతోంది.
ఇప్పుడున్న పరిస్థితుల్లో టీమ్‌లో పాజిటివిటీ నింపి, వారిని ప్రపంచకప్‌కి రెఢీ చేయగల సత్తా రోహిత్‌కి మాత్రమే ఉంది...’ అంటూ కామెంట్ చేశాడు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్..