- Home
- Sports
- Cricket
- పాక్ ప్లేయర్లను ఫ్రెండ్స్‌గా అనుకుంటే, గెలవాలనే కసి రాదు! అదంతా గ్రౌండ్ బయటే... గౌతమ్ గంభీర్ కామెంట్స్...
పాక్ ప్లేయర్లను ఫ్రెండ్స్‌గా అనుకుంటే, గెలవాలనే కసి రాదు! అదంతా గ్రౌండ్ బయటే... గౌతమ్ గంభీర్ కామెంట్స్...
ఒకప్పుడు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అంటే యుద్ధ వాతావరణం కనిపించేది. ప్లేయర్లు గ్రౌండ్‌లోనే కొట్టుకుంటారా? అనేంత హై డ్రామా నడిచేది. మాటా మాటా పెరిగి, కళ్లు ఉరిమి చూసుకోవడం చాలా కామన్‌గా కనిపించేవి..

ఇప్పుడు ఇండియా- పాకిస్తాన్ మ్యాచ్‌లో అలాంటి సీన్స్ కనిపించడం లేదు. భారత ప్లేయర్లు, పాక్ ప్లేయర్లతో స్నేహంగా ఉంటున్నారు. పాక్ ప్లేయర్లు కూడా ఇండియన్ ప్లేయర్లను నవ్వుతూ పలకరిస్తున్నారు...
2021 టీ20 వరల్డ్ కప్‌లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ తర్వాత విరాట్ కోహ్లీతో పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్, వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్ నవ్వుతూ మాట్లాడడం కెమెరాల్లో స్పష్టంగా కనిపించింది. ఆసియా కప్ 2023 టోర్నీలో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్‌కి ముందు కూడా ఇలాంటి సీన్సే కనిపించాయి..
ఆసియా కప్ 2023 టోర్నీలో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్‌కి ముందు ఇరు జట్లు ఒకే గ్రౌండ్‌లో కలిసి ప్రాక్టీస్ చేశాయి. ఈ సమయంలో పాక్ పేసర్ హారీస్ రౌఫ్, భారత క్రికెటర్ విరాట్ కోహ్లీని కలిసి నవ్వుతూ మాట్లాడాడు. సెప్టెంబర్ 2న మ్యాచ్ ఆరంభానికి ముందు కూడా ఇలాంటి సీన్సే కనిపించాయి..
వర్షం కారణంగా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఫలితం తేలకుండానే రద్దు అయ్యింది. ఈ సమయంలో కూడా పాక్ ప్లేయర్లతో విరాట్ కోహ్లీ, హార్ధిక్ పాండ్యా కలిసి నవ్వుతూ మాట్లాడుకోవడం కెమెరాల్లో కనిపించింది. ఈ సీన్స్‌పై తన స్టైల్‌లో స్పందించాడు టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్..
India vs Pakistan
‘టీమిండియా తరుపున ఆడుతున్నప్పుడు ఫ్రెండ్‌షిప్‌ని గ్రౌండ్ బయటే వదిలి రావాలి. గేమ్‌లో ప్రత్యర్థి జట్టును శత్రువుగానే చూడాలి. అప్పుడే ఎలాగైనా గెలవాలనే కసి పెరుగుతుంది..
ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్‌లో ఇరు జట్ల ప్లేయర్లలో నాకు అగ్రెషన్ కనిపించలేదు. ఇలాంటి ఫ్రెండ్లీ మ్యాచులు, గెలవాలనే కసిని తగ్గిస్తాయి. ఏదో మొక్కుబడిగా ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడుతున్నట్టుగా ఉంది...
మ్యాచ్ ముగిసిన తర్వాత ఆ ఆరు, ఏడు గంటల తర్వాత మీరు స్నేహంగా కలిసి మాట్లాడుకున్నా పర్లేదు, నవ్వుతూ ఫోటోలకు ఫోజులు ఇచ్చినా పర్లేదు. అయితే ఆట మొదలవ్వడానికి ముందు మాత్రం గెలవాలనే ఆలోచన మాత్రమే మనసులో ఉండాలి..
ఎందుకంటే మీరు ఓ ప్లేయర్‌గా ఆడడం లేదు, ఇండియా తరుపున ఆడుతున్నారు. 130 కోట్ల మంది తరుపున ఆడుతున్నారు. మేం అదే ఆలోచనతో ఉండేవాళ్లం. పాక్‌పై గెలవాలని ఇండియా మొత్తం కోరుకునేది. అదే ఆలోచనతో మేం బరిలో దిగేవాళ్లం..
మ్యాచ్ జరుగుతున్నంత సేపు గెలవాలనే కసి ఉన్నప్పుడు ప్రత్యర్థి ప్లేయర్ ఎప్పుడూ శత్రువుగానే కనిపిస్తాడు. ఇంతకుముందు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ చూస్తుంటే గూస్ బంప్స్ వచ్చేవి.
మీ ఫ్రెండ్‌షిప్ వల్ల ఇప్పుడైతే అలాంటి ఫీలింగ్ కలగడం లేదు.. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ చూస్తున్నట్టే అనిపించడం లేదు...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్..