- Home
- Sports
- Cricket
- ఎన్నిసార్లు చెప్పినా వినరా..? వాళ్లను చూసైనా బుద్ది తెచ్చుకోండి : వామిక ఫోటోలు తీసినందుకు అనుష్క శర్మ ఆగ్రహం
ఎన్నిసార్లు చెప్పినా వినరా..? వాళ్లను చూసైనా బుద్ది తెచ్చుకోండి : వామిక ఫోటోలు తీసినందుకు అనుష్క శర్మ ఆగ్రహం
Virat Kohli-Anushka Sharma: టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లి బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ ల గారాల పట్టి వామిక ఫోటోలు మరోసారి ఇంటర్నెట్ లో వైరల్ అయ్యాయి.

ఐపీఎల్-15 లో అట్టర్ ఫ్లాఫ్ అయిన టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లి వెకేషన్ ముగించుకుని ఇటీవలే భారత్ కు చేరుకున్నాడు. భార్య, కూతురు తో కలిసి అతడు సోమవారం ఢిల్లీకి చేరాడు.
అయితే ఈ క్రమంలో విమానాశ్రయం వద్ద కార్లో కూర్చుని ఉన్న అనుష్కశర్మతో పాటు వామిక ఫోటోలను తీసిన పలువురు ఫోటోగ్రాఫర్లు వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అదీగాక ఓ పేరు మోసిన వెబ్సైట్ కూడా ఈ ఫోటోలకు సంబంధించి ఓ ఆర్టికల్ కూడా పోస్ట్ చేసింది.
ఇది అనుష్క శర్మకు కోపం తెప్పించింది. సోషల్ మీడియాలో వామిక ఫోటోలు మరోసారి వైరల్ కావడంతో ఆమె స్పందించింది. ఇన్స్టా వేదికగా ఓ కామెంట్ చేస్తూ.. ‘మేం పదే పదే అభ్యర్థించినప్పటికీ ఫోటోలు తీయడం వాటిని పబ్లిక్ గా పోస్ట్ చేయడం చూస్తుంటే తల్లిదండ్రుల కంటే పిల్లలకు ఏది మంచిదో "టైమ్స్ గ్రూప్" కు తెలిసినట్టుంది.
ఆమె ప్రైవసీని కాపాడాలని మేం పలుమార్లు అభ్యర్థించాం. అయినా వినకుండా ఫోటోలు తీస్తూనే ఉన్నారు. ఇతర మీడియా గ్రూపుల నుంచైనా కాస్త నేర్చుకోండి...’ అని కామెంట్ చేసింది.
గత జనవరిలో మొదటి పుట్టినరోజును జరుపుకుంది వామిక. గతంలో ఒకసారి కూడా అనుష్క శర్మ.. వామికను ఎత్తుకుని ఆడిస్తున్న ఫోటోను పలువురు ఫోటోగ్రాఫర్లు తీసి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఆ సమయంలోనే కోహ్లితో పాటు అనుష్క లు వామిక ప్రైవసీని కాపాడాలని.. ఇకపై ఆమె ఫోటోలను తమకు తెలియకుండా తీయాలని అభ్యర్థించారు. అప్పట్నుంచి మీడియా గానీ అభిమానులు గానీ వామిక ఫోటోలను తీయలేదు.
కానీ తాజాగా టైమ్స్ ఫోటోగ్రాఫర్ ఒకరు అత్యుత్సాహం ప్రదర్శించి ఫోటోలు తీసి వాటిని పోస్ట్ చేయడంతో విరుష్క ఆగ్రహానికి గురయ్యాడు.