- Home
- Sports
- Cricket
- నీ ముఖంలో నవ్వు, నేను అక్కడి నుంచి చూడాలి... ఆ టెస్టుకి ముందు కుల్దీప్ యాదవ్‌తో షేన్ వార్న్...
నీ ముఖంలో నవ్వు, నేను అక్కడి నుంచి చూడాలి... ఆ టెస్టుకి ముందు కుల్దీప్ యాదవ్‌తో షేన్ వార్న్...
ఐపీఎల్ 2022 సీజన్ ద్వారా ఘనమైన రీఎంట్రీ చాటుకున్నాడు భారత సీనియర్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్. కెరీర్ ఆరంభంలో రికార్డు లెవెల్లో దూసుకుపోయిన కుల్దీప్ యాదవ్, 2019 వన్డే వరల్డ్ కప్ తర్వాత రెండేళ్ల పాటు తుదిజట్టులో చోటు దక్కించుకోవడానికి చాలా కష్టాలు పడ్డాడు...

ఐపీఎల్‌లోనూ కోల్‌కత్తా నైట్‌రైడర్స్ టీమ్‌కి ఆడిన కుల్దీప్ యాదవ్‌ని దినేశ్ కార్తీక్ కానీ, ఆ తర్వాత కెప్టెన్‌గా వచ్చిన ఇయాన్ మోర్గాన్ కానీ సరిగ్గా వాడుకోలేకపోయారు. ఈ సీజన్‌లో మాత్రం ఢిల్లీ క్యాపిటల్స్‌కి ప్రధాన స్పిన్నర్‌గా మారిపోయాడు కుల్దీప్ యాదవ్...
గ్రూప్ స్టేజీలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు, ఐపీఎల్ 2022 సీజన్‌లో 7 విజయాలు అందుకుంటే... అందులో నాలుగు మ్యాచుల్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గెలిచాడు కుల్దీప్. కుల్దీప్ ఫెయిల్ అయిన మ్యాచుల్లో ఢిల్లీ విజయం అందుకున్న సందర్భాలు కూడా చాలా తక్కువ...
ఐపీఎల్ 2022 సీజన్‌లో 14 మ్యాచులు ఆడి 21 వికెట్లు తీసిన కుల్దీప్ యాదవ్, ఓవరాల్‌గా పర్పుల్ క్యాప్ లిస్టులో నాలుగో స్థానంలో నిలిచాడు. ఈ పర్ఫామెన్స్‌తో టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చాడు కుల్దీప్..
2018-19 ఆస్ట్రేలియా పర్యటనలో సిడ్నీలో జరిగిన నాలుగో, ఆఖరి టెస్టు మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసిన కుల్దీప్ యాదవ్, టీమిండియా సిరీస్ గెలవడంలో కీలక పాత్ర వహించాడు...
‘సిడ్నీ టెస్టు మ్యాచ్ ఆరంభానికి ముందు టన్నెల్ దగ్గర షేన్ వార్న్‌ని కలిశాను. ఆయన నా భుజాలపై చేయి వేసి, ‘నేను కామెంటరీ బాక్సులో ఉంటాను. నువ్వు నవ్వడం నేను అక్కడి నుంచి చూడాలి...
నువ్వు ఎలా బౌలింగ్ వేస్తావో నాకు తెలీదు, కానీ నీ నవ్వు ముఖం చూడాలి.’ అన్నారు. ఆ మాటలు నాలో స్ఫూర్తిని నింపాయి...
Image Credit: Getty Images
నేను నవ్వడానికి నేనేం చేయాలో అన్నీ చేశా. పాజిటివ్ మైండ్‌సెట్‌తో మ్యాచ్‌ని ప్రారంభించి, అదే పర్ఫామెన్స్‌లోనూ కనిపించింది. అందుకే ఆ మ్యాచ్ తర్వాత నా పర్ఫామెన్స్‌ని ఆయనకే అంకితం ఇచ్చాడు.. ఆయనెప్పుడూ నా ఐడెల్...
నా గురువు కామెంటరీ బాక్సులో ఉండగా ఐదు వికెట్లు తీయడం నాకు చాలా పెద్ద విషయం. షేన్ వార్న్ ఆటను చూస్తూ పెరిగాను. ఎంతో నేర్చుకున్నాను...’ అంటూ కామెంట్ చేశాడు భారత క్రికెటర్ కుల్దీప్ యాదవ్...