అతను కెప్టెన్‌గా ఉన్నప్పుడు కుల్దీప్ యాదవ్‌ని పట్టించుకోలేదు! ఇప్పుడేమో ఇలా...
కెరీర్ పీక్ స్టేజీలో ఉన్నప్పుడే సరైన అవకాశాలు దక్కించుకోలేకపోయాడు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్. టీమిండియాతో పాటు ఐపీఎల్‌లోనూ కుల్దీప్ యాదవ్‌కి సరైన ఛాన్సులు రాలేదు. బంగ్లాదేశ్‌తో తొలి టెస్టులో ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ గెలిచిన తర్వాత కూడా రెండో టెస్టులో రిజర్వు బెంచ్‌కే పరిమితమయ్యాడు...

ఐపీఎల్‌లో ఎక్కువ మ్యాచులు ఆడకపోవడంతో టీమిండియాలో రిజర్వు బెంచ్‌కే పరిమితమైన కుల్దీప్... భారత జట్టు తరుపున బెంచ్‌లో ఉండడంతో ఐపీఎల్‌లోనూ అదే కంటిన్యూ చేశారు... గౌతమ్ గంభీర్ కెప్టెన్‌గా ఉన్నప్పుడు కేకేఆర్‌కి కీ బౌలర్‌గా ఉన్న కుల్దీప్... ఆ తర్వాత రెండు సీజన్లలో కలిపి 14 మ్యాచులే ఆడాడు...
2019 సీజన్‌లో 9 మ్యాచులు ఆడినా కుల్దీప్ యాదవ్ వేసింది 33 ఓవర్లే. 2020 సీజన్‌లో అయితే 5 మ్యాచులు ఆడిన కుల్దీప్ యాదవ్, 4 మ్యాచుల్లో మాత్రమే బౌలింగ్ చేశాడు. ఇందులో వేసింది సరిగ్గా 12 ఓవర్లే... టీమ్ మారిన తర్వాత కుల్దీప్ యాదవ్ ఫేట్ మారింది...
‘దినేశ్ కార్తీక్ కెప్టెన్‌గా ఉన్న సమయంలో కుల్దీప్ యాదవ్‌కి కేవలం 1-2 ఓవర్లు మాతమ్రే ఇచ్చేవాడు. ఇప్పుడు అతను టీమిండియాలో ఫెవరెట్ బౌలర్ కుల్దీప్ అని చెబుతున్నాడు. ఫెవరెట్ అయినప్పుడు అప్పుడు బౌలింగ్ ఎందుకు ఇవ్వలేదు...
గత విషయాల గురించి ఆలోచించడం వేస్ట్. అయితే ఐపీఎల్‌లో కుల్దీప్ యాదవ్‌ని తీవ్రంగా అవమానించారు. టీమ్‌లో కుల్దీప్ యాదవ్ కేవలం ఆటలో అరటిపండులా చూశారు. కుల్దీప్‌కి ఐపీఎల్‌లో సరైన గౌరవం దక్కి ఉంటే, ఇప్పుడు అతని పరిస్థితి ఇలా ఉండేది కాదు...
కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌లో కుల్దీప్ యాదవ్‌ని తీవ్రంగా నిర్లక్ష్యం చేశారు. అయితే ఢిల్లీ క్యాపిటల్స్‌కి వచ్చిన తర్వాతే కుల్దీప్ కెరీర్ మళ్లీ గాడిలో పడింది. రిషబ్ పంత్, రికీ పాంటింగ్, షేన్ వాట్సన్... అతన్ని బాగా ఎంకరేజ్ చేశారు...
కుల్దీప్ యాదవ్‌కి అన్ని మ్యాచుల్లో అవకాశం ఇస్తానని భరోసా నింపి, మాట నిలబెట్టుకున్నాడు రికీ పాంటింగ్. ఓ బౌలర్‌కి ఇంతకుమించిన బూస్ట్ ఏముంటుంది. కుల్దీప్ యాదవ్ కమ్‌బ్యాక్‌లో రిషబ్ పంత్‌కి కూడా క్రెడిట్ ఇవ్వాల్సిందే...’ అంటూ కామెంట్ చేశాడు కుల్దీప్ యాదవ్ చిన్ననాటి కోచ్ కపిల్ పాండే...