- Home
- Sports
- Cricket
- కుల్దీప్ యాదవ్‌కి షాక్... హార్ధిక్ పాండ్యా, శిఖర్ ధావన్, అజింకా రహానే, పూజారాలకు డిమోషన్...
కుల్దీప్ యాదవ్‌కి షాక్... హార్ధిక్ పాండ్యా, శిఖర్ ధావన్, అజింకా రహానే, పూజారాలకు డిమోషన్...
భారత సీనియర్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌కి ఊహించని షాక్ ఇవ్వబోతోంది భారత క్రికెట్ బోర్డు. బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ ప్లేయర్ల లిస్టులో నుంచి కుల్దీప్ యాదవ్‌ని తొలగించాలని బీసీసీఐ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం...

భారత క్రికెట్ బోర్డు, పురుష క్రికెటర్లకు నాలుగు కేటగిరీలవారీగా పారితోషికాలు చెల్లిస్తోంది. A+ కేటగిరీ ప్లేయర్లకు ఏటా రూ.7 కోట్లు, A కేటగిరీ ప్లేయర్లకు ఏటా రూ.5 కోట్లు, B కేటగిరి ప్లేయర్లకు అయితే ఏడాదికి రూ.3 కోట్లు ఇస్తోంది. C కేటగిరీలో ఉన్న ప్లేయర్లకు ఏటా రూ.1కోటి పారితోషికంగా అందిస్తోంది...
కొన్నాళ్లుగా బీసీసీఐ నుంచి C కేటగిరి సెంట్రల్ కాంట్రాక్ట్ రూపంలో కోటి రూపాయలు అందుకుంటున్న కుల్దీప్ యాదవ్, గత ఏడాది ప్రదర్శన కారణంగా ఏకంగా కాంట్రాక్ట్ కోల్పోయాడని సమాచారం.
గత ఏడాదే బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ లిస్టులోకి వచ్చిన భారత యంగ్ పేసర్ నవ్‌దీప్ సైనీ, గాయాలతో జట్టుకి దూరమై కాంట్రాక్ట్ కోల్పోయాడు...
అలాగే గత ఏడాది సరైన ప్రదర్శన ఇవ్వలేక, శ్రీలంకతో టెస్టు సిరీస్‌లో చోటు కోల్పోయిన అజింకా రహానే, ఛతేశ్వర్ పూజారా... A కేటగిరి నుంచి B కేటగిరికి మార్చబడ్డారు...
భారత సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మకు కూడా డిమోషన్ ఇచ్చింది బీసీసీఐ. ఇంతుముందు A కేటగిరిలో ఉన్న ఇషాంత్‌ను B కేటగిరికి మార్చారు...
2021 ఫిబ్రవరిలో అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసి, టీమిండియాలో కీ ప్లేయర్‌గా మారిన సూర్యకుమార్ యాదవ్‌కి C కేటగిరి సెంట్రల్ కాంట్రాక్ట్ దక్కనుంది...
సరైన ప్రదర్శన ఇవ్వలేకపోతున్న భారత ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్‌పై కూడా బీసీసీఐ వేటు వేసింది. ఇంతకుముందు A కేటగిరిలో ఉన్న ఈ ఇద్దరు, C కేటగిరిలోకి డిమోషన్ పొందారు...
మయాంక్ అగర్వాల్, ఉమేశ్ యాదవ్ కూడా B నుంచి C కేటగిరికి మారగా శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, మహ్మద్ సిరాజ్‌లకు ప్రమోషన్ దక్కనుంది...
గత ఏడాది బీసీసీఐ C కేటగిరి దక్కించుకున్న శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, మహ్మద్ సిరాజ్... B కేటగిరిలోకి మార్చబడి, రూ.3 కోట్లు అందుకోబోతున్నారు...