- Home
- Sports
- Cricket
- కోహ్లీకి, విలియంసన్‌కి చాలా తేడా ఉంది, మైకేల్ నువ్వు ఒక్క సెంచరీ అయినా చేశావా... మాజీ క్రికెటర్ సల్మాన్ భట్
కోహ్లీకి, విలియంసన్‌కి చాలా తేడా ఉంది, మైకేల్ నువ్వు ఒక్క సెంచరీ అయినా చేశావా... మాజీ క్రికెటర్ సల్మాన్ భట్
కేన్ విలియంసన్ చాలా గొప్ప క్రికెటర్ అని, అతను ఇండియాలో పుట్టి ఉంటే, అతనికి మరింత పేరు వచ్చి ఉండేదని, విలియంసన్‌తో పోలిస్తే విరాట్ కోహ్లీ పెద్దగా సాధించిందేమీ లేదంటూ ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాగన్ చేసిన కామెంట్లపై పాక్ మాజీ క్రికెటర్ సల్మాన్ భట్ ఫైర్ అయ్యాడు.

‘విరాట్ కోహ్లీకి కేవలం సోషల్ మీడియాలో 100 మిలియన్ల ఫాలోవర్లు ఉండడం.... అతను చేసే ప్రతీ పోస్టుకి లక్షల్లో లైకులు, కామెంట్లు రావడం వల్లే తనని వరల్డ్ బెస్ట్ బ్యాట్స్‌మెన్‌గా కీర్తిస్తున్నారని’ వివాదస్పద కామెంట్లు చేశాడు మైకేల్ వాగన్.

‘కోహ్లీ ఓ అత్యధిక జనాభా ఉన్న దేశానికి చెందినవాడు. కాబట్టి అతనికి ఫ్యాన్ బేస్, ఫాలోయింగ్ విపరీతంగా ఉంటుంది. అతని పర్ఫామెన్స్ కూడా చాలా బాగుంది...

ప్రస్తుతం విరాట్ కోహ్లీకి 70 అంతర్జాతీయ సెంచరీలు ఉన్నాయి. ఈ తరంలో మరే ప్లేయర్‌కి కూడా అన్ని సెంచరీలు లేవు. కొన్ని ఏళ్లుగా అతను ఐసీసీ ర్యాంకింగ్స్‌లో తన డామినేషన్ చూపిస్తున్నాడు. ఇవన్నీ చూసుకుంటే కోహ్లీ అద్భుతమైన పర్ఫామెన్స్ ఇస్తున్నట్టే కదా...

విరాట్ కోహ్లీకి, ప్రస్తుత తరంలో ఎవ్వరితోనూ పోటీలేదు. ఇద్దరు క్రికెటర్లను పోల్చాలంటే వారిద్దరి మధ్య సరైన పోలికలు, పోటీ ఉండాలి. కానీ కోహ్లీ అందరికంటే చాలా ముందున్నాడు. కేన్ విలియంసన్ కూడా మంచి బ్యాట్స్‌మెన్. కానీ కోహ్లీతో పోల్చడానికి లేదు.

అదీగాక ఈ ఇద్దరినీ పోల్చి చెప్పింది ఎవరు మైకేల్ వాగన్. అతను ఇంగ్లాండ్‌కి బ్రిలియెంట్ కెప్టెన్, కానీ బ్యాటింగ్‌లో అతని రికార్డులు చూడండి. టెస్టుల్లో రాణించినప్పటికీ, మైకేల్ వాగన్ వన్డేల్లో ఒక్క సెంచరీ కూడా చేయలేకపోయాడు.

ఓపెనర్‌గా కూడా నువ్వు వన్డేల్లో ఒక్క సెంచరీ చేయలేనప్పుడు, 70 సెంచరీలు సాధించిన ప్లేయర్‌ను విమర్శించే అర్హత నీకు ఉందా? ఇది కేవలం మైకేల్ వాగన్‌కే కాదు, కోహ్లీతో మిగిలిన ప్లేయర్లను పోల్చి చూసి మాట్లాడే అందరూ గుర్తుపెట్టుకోవాలి...

ఎందుకంటే విరాట్ కోహ్లీకి మిగిలిన ప్లేయర్లకీ మధ్య చాలా గ్యాప్ ఉంది. కోహ్లీ గణాంకాలు, అతని పర్ఫామెన్స్... బ్యాటింగ్‌లో ముందుండి నడిపించే నాయకత్వం, ముఖ్యంగా చేధనలో అతనే అసలైన ఛేజ్ మాస్టర్...

విరాట్ కోహ్లీ క్రికెట్ ఆడడం మొదలెట్టిన తర్వాత అతను ఏ ప్లేయర్ కూడా అతను చూపించిన నిలకడ ప్రదర్శించలేకపోయాడు. మైకేల్ వాగన్ చెప్పినవన్నీ సంబంధం లేని విషయాలు’... అంటూ తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా చెప్పుకొచ్చాడు పాక్ మాజీ క్రికెటర్ సల్మాన్ భట్.

అయితే సల్మాన్ భట్ కామెంట్లపై మైకేల్ వాగన్ వ్యంగ్యంగా స్పందించాడు. ‘అవును... నేను వన్డేల్లో సెంచరీ చేయలేదు. కానీ నేనెప్పుడూ మ్యాచ్ ఫిక్సింగ్‌కి పాల్పడలేదు...’ అంటూ పాక్ మాజీ క్రికెటర్‌ను ట్రోల్ చేశాడు మైకేల్ వాగన్.

పాకిస్తాన్ తరుపున 33 టెస్టులు, 78 వన్డేలు ఆడిన సల్మాన్ భట్, మొత్తంగా 11 సెంచరీలు, 24 హఫ్ సెంచరీలు చేశాడు. 2010లో స్పాట్ ఫిక్సింగ్ కేసులో మహ్మద్ అమీర్, మహ్మద్ అసీఫ్‌లతో పాటు సల్మాన్ భట్ కూడా అరెస్ట్ అయ్యి, 10 ఏళ్లు నిషేధానికి గురయ్యాడు.