- Home
- Sports
- Cricket
- త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్న కెఎల్ రాహుల్...గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన మామ సునీల్ శెట్టి...
త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్న కెఎల్ రాహుల్...గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన మామ సునీల్ శెట్టి...
భారత క్రికెటర్ కెఎల్ రాహుల్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. ఈ ఏడాది సౌతాఫ్రికా టూర్‌లో టీమిండియాకి కెప్టెన్‌గా వ్యవహరించిన కెఎల్ రాహుల్, ఐపీఎల్ 2022 సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్‌గా రూ.17 కోట్లు అందుకుని, అత్యధిక పారితోషికం అందుకున్న ప్లేయర్‌గా విరాట్ కోహ్లీ రికార్డును సమం చేశాడు...

బాలీవుడ్ బ్యూటీ అథియా శెట్టితో చాలా కాలంగా రిలేషన్‌లో ఉన్నాడు కెఎల్ రాహుల్. ఈ ఇద్దరూ పెళ్లికి ముందే చాలా టూర్లకు కలిసి వెళ్లారు. ఇంగ్లాండ్ టూర్‌ని గర్ల్‌ఫ్రెండ్‌ని వెంటేసుకెళ్లిన కెఎల్ రాహుల్, సర్జరీ కోసం జర్మనీ వెళ్లినప్పుడు కూడా అథియాని వెంటేసుకెళ్లాడు...
జర్మనీలో సర్జరీ సక్సెస్ అయినా పూర్తిగా కోలుకుని టీమిండియాకి అందుబాటులోకి రావడానికి కెఎల్ రాహుల్‌కి మూడు నెలల వరకూ సమయం పడుతుందట. ఆసియా కప్ 2022 టోర్నీ తర్వాత రాహుల్, టీమిండియాతో కలవచ్చని సమాచారం...
ఈ లోపు విలువైన సమయాన్ని వేస్ట్ చేయకుండా పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యారట అథియా శెట్టి, కెఎల్ రాహుల్. ఈ పెళ్లికి అథియా శెట్టి తండ్రి, బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట...
టీ20 వరల్డ్ కప్ 2022, ఆ తర్వాత వచ్చే ఏడాది వన్డే వరల్డ్ కప్ ఉన్న కారణంగా వీలైనంత త్వరగా పెళ్లి చేసుకుని, హనీమూన్ కూడా ఎంజాయ్ చేసేయాలని ఆలోచనలో ఉన్నారట కెఎల్ రాహుల్, అథియా శెట్టి...
అతికొద్ది మంది ఆత్మీయ స్నేహితుల మధ్య ఎంగేజ్‌మెంట్, వివాహ వేడుక జరిపి... అతిరథ మహారథుల మధ్య ఘనంగా రిసెప్షన్ వేడుక నిర్వహించాలని ప్లాన్స్ వేస్తున్నారట ఈ ప్రేమ జంట, వారి కుటుంబ సభ్యులు...
ఇప్పటికే భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మను... ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా, బాలీవుడ్ మోడల్ నటాశాని వివాహం చేసుకోగా బాలీవుడ్ హీరోయిన్‌ని పెళ్లాడబోతున్న క్రికెటర్‌గా ఈ జాబితాలో చేరబోతున్నాడు కెఎల్ రాహుల్...
బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కూతురుగా బాలీవుడ్ తెరంగ్రేటం చేసిన అథియా శెట్టి, ‘హీరో’, ‘ముబారకాన్’, ‘నవాబ్‌జాదే’, ‘మోతీచూర్ చక్నాచూర్’ వంటి నాలుగు సినిమాల్లో నటించింది. అయితే ఈ సినిమాలేవీ బాక్సాఫీస్ దగ్గర ఆశించిన వసూళ్లు రాబట్టలేకపోయాయి.
అథియా శెట్టి తండ్రి సునీల్ శెట్టి ఈ మధ్య కాలంలో నటించిన సౌత్ సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి. తెలుగులో మంచు విష్ణు ‘మోసగాళ్లు’, వరుణ్ తేజ్ ‘గని’ వంటి సినిమాల్లో నటించాడు సునీల్ శెట్టి. ఈ రెండూ డిజాస్టర్లుగా మిగిలాయి...