రాసిపెట్టుకోండి, ఈ వరల్డ్ కప్‌లో టాప్ స్కోరర్ అతనే! కెఎల్ రాహుల్‌పై మాజీ క్రికెటర్ కామెంట్..
టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ ఘనంగా ప్రారంభమైంది. 16 జట్లు, 29 రోజుల పాటు పొట్టి ప్రపంచకప్ టైటిల్ కోసం పోటీపడబోతున్నాయి. ఈ 8వ ఎడిషన్‌లో ఆతిథ్య ఆస్ట్రేలియాతో పాటు ఇంగ్లాండ్, పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్లు టైటిల్ ఫెవరెట్లుగా బరిలో దిగుతుంటే... టీమిండియాపైన కూడా భారీ అంచనాలే ఉన్నాయి...
Jasprit Bumrah
భారత ప్రధాన బౌలర్ జస్ప్రిత్ బుమ్రా గాయం కారణంగా టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి దూరం కావడం టీమిండియాపై తీవ్రంగా ప్రభావం చూపింది. బుమ్రా ప్లేస్‌లో షమీ ఎంట్రీ ఇచ్చినా ఈసారి భారత జట్టుపై భారీ అంచనాలైతే లేవు...
అంచనాలు లేకుండా టీ20 వరల్డ్ కప్ 2007 ఆడిన టీమిండియా టైటిల్ నెగ్గి చరిత్ర సృష్టించినట్టే, ఈసారి కూడా రోహిత్ సేన వండర్స్ చేస్తుందని అంచనా వేస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్. ‘నా ఉద్దేశంలో టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో టీమిండియా తరుపున కెఎల్ రాహుల్ టాప్ స్కోరర్ అవుతాడు...
Image credit: PTI
అతను ఓపెనర్ కాబట్టి 20 ఓవర్లు బ్యాటింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఆఖరి ఓవర్ వరకూ క్రీజులో నిలబడగల సత్తా కెఎల్ రాహుల్ సొంతం. అంతేకాకుండా ఆస్ట్రేలియాలోని పిచ్‌లు, కెఎల్ రాహుల్ బ్యాటింగ్‌కి సరిగ్గా సెట్ అవుతాయి..
Image credit: PTI
టీమిండియా అర్ష్‌దీప్ సింగ్‌ని సరిగ్గా వాడుకుంటే పర్ఫెక్ట్ డెత్ బౌలర్ అవుతాడు. కొత్త బంతితో కూడా అతను మ్యాజిక్ చేయగలడు. మిడిల్ ఓవర్లలోనూ అర్ష్‌దీప్ సింగ్‌ని వాడుకోవచ్చు. రోహిత్ శర్మ, అతన్ని ఎలా వాడతాడో చూడాలి...
Mohammed Shami
వరల్డ్‌లో బెస్ట్ టీమ్ అని చెప్పుకోవాలంటే బ్యాటింగ్‌లో, బౌలింగ్‌లో డెప్త్ ఉండాలి. ఐపీఎల్‌ని బెస్ట్ లీగ్‌గా చెప్పుకుంటున్నాం... టీ20 వరల్డ్ కప్ గెలిస్తేనే అది నిజమని ప్రపంచానికి నిరూపించినట్టు అవుతుంది...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా...