కపిల్‌దేవ్ ఆల్‌టైమ్ బెస్ట్ వన్డే టీమ్ ఇదే... రోహిత్ శర్మకు నో ఛాన్స్... కోహ్లీ, సచిన్‌తో పాటు...
First Published Nov 26, 2020, 3:57 PM IST
భారత జట్టుకి మొట్టమొదటి వన్డే వరల్డ్‌కప్ అందించిన కెప్టెన్ కపిల్‌దేవ్... తన ఆల్‌టైమ్ బెస్ట్ భారత వన్డే టీమ్‌ను ప్రకటించాడు. భారత క్రికెట్ చరిత్రలో పదకొండు మంది బెస్ట్ క్రికెటర్లను తన జట్టుగా ఎంచుకున్నాడు కపిల్‌దేవ్. అయితే వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలు సాధించిన రోహిత్ శర్మకు కపిల్ దేవ్ ప్రకటించిన బెస్ట్ ఎలెవన్ టీమ్‌లో చోటు దక్కకపోవడం విశేషం. కపిల్‌దేవ్ ప్రకటించిన ఆల్‌టైం బెస్ట్ వన్డే టీమ్ ఎలెవన్‌లో ఎవరెవరు ఉన్నారంటే...

సచిన్ టెండూల్కర్: వన్డేల్లో 49 సెంచరీలతో పాటు 18 వేలకు పైగా పరుగులు చేసిన ‘క్రికెట్ గాడ్’ సచిన్ టెండూల్కర్‌కి కపిల్‌దేవ్ వన్డే టీమ్‌లో చోటు దక్కింది...

వీరేంద్ర సెహ్వాగ్: ధనాధన్ ఆటతీరుతో క్రికెట్‌లో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన సూపర్ మ్యాన్ వీరేంద్ర సెహ్వాగ్‌కి కూడా కపిల్‌దేవ్ ఆల్‌టైమ్ బెస్ట్ వన్డే టీమ్‌లో చోటు దక్కింది. 251 వన్డేల్లో 15 సెంచరీలతో 8273 పరుగులు చేసిన సెహ్వాగ్‌ను సచిన్‌తో కలిసి ఓపెనర్‌గా ఎంచుకున్నాడు కపిల్.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?