MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • మోదీ మామూలోడు కాదు.. ICCలో మళ్లీ మనోడే

మోదీ మామూలోడు కాదు.. ICCలో మళ్లీ మనోడే

భారత ప్రధాని నరేంద్ర మోదీ మామూలోడు కాదు... ఇప్పటికే భారత రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న ఆయన అంతర్జాతీయ క్రీడలపై దృష్టి సాారించారు. ఈ క్రమంలోనే తన మంత్రివర్గంలోని కీలక నాయకుడి తనయుడిని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ చీఫ్ ను చేసేసారు.   

2 Min read
Author : Arun Kumar P
| Updated : Aug 28 2024, 12:10 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Jay shah

Jay shah

బిసిసిఐ కార్యదర్శి జై షా ఐసిసి నూతన ఛైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో ఇప్పటివరకు ఐసిసి బాధ్యతలు చేపట్టిన అతి చిన్న వయస్కుడిగా రికార్డ్ సృష్టించాడు. కేవలం 35 ఏళ్ళ వయసులోని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ బాధ్యతలు చేపట్టనున్నారు జై షా.   

16 మంది సభ్యులతో కూడిన ఐసిసి పాలకవర్గ అధ్యక్ష పదవికి ఎన్నికలు చేపట్టారు. ప్రస్తుత ఐసిసి చీఫ్ గ్రెగ్ బార్క్లె పదవికీలం ఈ ఏడాది నవంబర్ లో ముగుస్తుంది. దీంతో ఆలోపు నూతన అధ్యక్షుడిని ఎన్నుకునే ప్రక్రియను చేపట్టారు. ఇటీవల ఎన్నికల ప్రక్రియ ప్రారంభించగా ఇవాళ్టితో నామినేషన్ గడువు ముగిసింది. కేవలం ఒకే ఒక నామినేషన్ రావడంతో జై షా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.  

నవంబర్ 30న ప్రస్తుత అధ్యక్షుడు గ్రెగ్ బార్క్లే పదవీకాలం ముగియనుంది... అంటే డిసెంబర్ ఆరభంలో జై షా బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయన ఈ పదవిలో రెండు సంవత్సరాలు కొనసాగనున్నారు. ఆ తర్వాత కూడా కొనసాగాలంటూ మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయాల్సి వుంటుంది. 

అయితే జై షా కంటే ముందు ఐసిసి ఛైర్మన్లుగా పలువురు భారతీయులు పనిచేసారు. ఇలా అంతర్జాతీయ క్రికెట్ ను శాసించిన ఆ భారతీయులెవరో చూద్దాం. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
Jagmohan Dalmiya

Jagmohan Dalmiya

జగ్‌మోహన్ దాల్మియా (1997-2000) : 

భారతీయ క్రికెట్ చరిత్రలో నిలిచివుండే పేరు జగ్‌మోహన్ దాల్మియా.  ఈయన హయాంలో భారత క్రికెట్ అత్యున్నత స్థాయికి చేరింది. ఇలా బిసిసిఐలో కీలక బాధ్యతలు చేపట్టిన ఈయన 1997 నుండి 2000 వరకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) ఛైర్మన్ గా పనిచేసారు. క్రికెట్ మ్యాచ్‌ల స్లాట్‌లను టెలివిజన్ ఛానెళ్లకు వేలం వేయడం ద్వారా బోర్డు ఆదాయాన్ని పెంచారు. క్రికెట్ నుండి ఆదాయాన్ని పొందే ఆయన నమూనే నేడు ప్రపంచంలోని అన్ని బోర్డులను ధనవంతులుగా మార్చింది. ఈయన బిసిసిఐ అధ్యక్షుడిగా పనిచేశారు. ప్రపంచంలోని అన్ని బోర్డుల కంటే BCCIని ధనవంతులుగా మార్చిన ఘనత దాల్మియాకే దక్కుతుంది.

35
Sharad Pawar

Sharad Pawar

శరద్ పవార్ (2010-2012) :

మహారాష్ట్రకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకులు, ఎన్సిపి అధ్యక్షులు శరద్ పవార్ కూడా ఐసిసి ఛైర్మన్ గా పనిచేసారు.  2010 నుండి 2012 వరకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) చీఫ్ గా పనిచేశారు. అంతకుముందు 2005 నుండి 2008 వరకు బిసిసిఐ అధ్యక్షుడిగా కూడా పనిచేసారు. 

45
N. Srinivasan

N. Srinivasan

ఎన్. శ్రీనివాసన్ (2014-2015):

భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు అధ్యక్షుడిగా పనిచేసిన ఎన్. శ్రీనివాసన్ ఐసిసి ఛైర్మన్ గా కూడా చేసారు.  2014లో ICC చైర్మన్ పదవిని చేపట్టారు. ఆయన హయాంలో ICC కీలకమైన పరిపాలనా మార్పులను తీసుకొచ్చింది. "బిగ్ త్రీ" క్రికెట్ బోర్డులకు మరింత అధికారం ఇవ్వడం ఇందులో భాగం. బిగ్ త్రీ అంటే భారతదేశం, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పందెం కుంభకోణానికి సంబంధించిన వివాదాలతో ఆయన పదవీకాలం ముగిసింది. 

55
Shashank Manohar

Shashank Manohar

శశాంక్ మనోహర్ (2015-2020):

శశాంక్ మనోహర్ 2015 నుండి 2020 వరకు ICC చైర్మన్‌గా పనిచేశారు. అంతకుముందు ఆయన BCCI అధ్యక్షుడిగా రెండుసార్లు పనిచేశారు. ICC అధ్యక్షుడిగా, ప్రపంచ క్రికెట్ అభివృద్ధిని ప్రోత్సహించడానికి... "బిగ్ త్రీ" బోర్డుల ప్రభావాన్ని తగ్గించడానికి పరిపాలనా నిర్మాణంలో సంస్కరణలు తీసుకొచ్చారు.  క్రికెట్ ఆడే అన్ని దేశాల మధ్య ఆదాయ పంపిణీని పెంచడానికి ఆయన హయాంలో కృషి జరిగింది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
 
1st ODI • NZ vs IND 2026
Result
NZNZ
185
INDIND
143/5
IND beat NZ by 5 wickets (D/L) method
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
IND vs NZ: తొలి వన్డేలో భారత్ జోరు.. కోహ్లీ మెరుపులు, కివీస్‌పై ఘన విజయం
Recommended image2
IND vs NZ: న్యూజిలాండ్‌లో అర్ష్‌దీప్ సింగ్ సరికొత్త రికార్డు.. మనోడి దెబ్బకు కుప్పకూలిన కివీస్
Recommended image3
Glenn Maxwell: అంతర్జాతీయ క్రికెట్‌కు ది బిగ్ షో గుడ్ బై.. గ్లెన్ మాక్స్‌వెల్ రిటైర్మెంట్ కు కారణం ఏమిటి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved