- Home
- Sports
- Cricket
- ఇంకా ఫిట్‌నెస్ సాధించని జస్ప్రిత్ బుమ్రా... టీ20 వరల్డ్ కప్ 2022 జట్టు ఎంపిక విషయంలో...
ఇంకా ఫిట్‌నెస్ సాధించని జస్ప్రిత్ బుమ్రా... టీ20 వరల్డ్ కప్ 2022 జట్టు ఎంపిక విషయంలో...
టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి కౌంట్‌డౌన్ మొదలైపోయింది. అక్టోబర్ 16న గ్రూప్ మ్యాచులతో ప్రారంభమయ్యే పొట్టి ప్రపంచకప్‌కి ఇప్పటికే జట్లను ప్రకటించాయి ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్లు. ఈ నెల 20వ తేదీలోపు మిగిలిన బోర్డులు కూడా జట్లను ప్రకటించాల్సిందిగా డెడ్‌లైన్ విధించింది ఐసీసీ...

bumrah
ఆసియా కప్ 2022 టోర్నీ పర్ఫామెన్స్ ఆధారంగా సెప్టెంబర్ 15న టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి జట్టును ప్రకటించాలని అనుకుంది బీసీసీఐ. అయితే భారత జట్టు ఫైనల్ చేరకుండానే సూపర్ 4 లెవెల్ నుంచే నిష్కమించడంతో అందరి ఫోకస్ టీ20 వరల్డ్‌కప్‌పైకి మారింది...
అయితే డెడ్‌లైన్ దగ్గర పడుతున్నా భారత కీ ప్లేయర్ జస్ప్రిత్ బుమ్రా గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడం టీమిండియాని కలవరబెడుతోంది. దాదాపు నెల రోజులుగా క్రికెట్‌కి దూరంగా ఉన్న జస్ప్రిత్ బుమ్రా... గాయం నుంచి కోలుకుంటున్నట్టు సోషల్ మీడియాలో పోస్టులు షేర్ చేశాడు...
ప్రస్తుతం ఎన్‌సీఏలో రిహాబిటేషన్ ప్రోగ్రామ్‌లో పాల్గొంటున్న జస్ప్రిత్ బుమ్రాకి ఇప్పటికి మూడు సార్లు ఫిట్‌నెస్ టెస్టు నిర్వహించారు ఎన్‌సీఏ అధికారులు. అయితే ఈ మూడు టెస్టుల్లోనూ జస్ప్రిత్ బుమ్రా పూర్తి ఫిట్ సాధించలేదని తేలింది...
Image credit: Getty
పూర్తి ఫిట్‌నెస్ సాధించని ప్లేయర్‌ని టీ20 వరల్డ్ కప్ 2022 వంటి మెగా టోర్నీకి ఎలా ఎంపిక చేయడం? అనేది సెలక్టర్లను వేధిస్తున్న ప్రశ్న. ఇంతకుముందు టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ సమయంలో పూర్తి ఫిట్‌గా లేని హార్ధిక్ పాండ్యాని కీ టోర్నీకి ఎంపిక చేసి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు సెలక్టర్లు...
అప్పుడు తమకు హార్ధిక్ పాండ్యాని ఎంపిక చేయడం ఇష్టం లేకపోయినా మెంటర్ ఎంఎస్ ధోనీ సూచనలతో సెలక్ట్ చేశామని చెప్పి తప్పించుకున్నారు సెలక్టర్లు. ఇప్పుడు అలా తప్పించుకోవడానికి కూడా అవకాశం లేదు...
Harshal Patel
జస్ప్రిత్ బుమ్రా కోలుకోకపోతే అతనికి సరైన ప్రత్యామ్నాయం కూడా టీమిండియాకి అందుబాటులో లేదు. హర్షల్ పటేల్ కూడా గాయం నుంచి కోలుకుంటున్నాడు. ఆవేశ్ ఖాన్ భారీగా పరుగులు ఇస్తూ, అతనిపై పెట్టుకున్న అంచనాలను అందుకోలేకపోయాడు...
arshdeep
అర్ష్‌దీప్ సింగ్ డెత్ ఓవర్లలో చక్కని బౌలింగ్ పర్ఫామెన్స్ చూపిస్తున్నా అతనికి తోడుగా మరో బౌలర్ అవసరం ఉంది. దీపక్ చాహార్ రూపంలో ఓ ఫాస్ట్ బౌలర్ అందుబాటులో ఉన్నా, అతను డెత్ ఓవర్ బౌలర్ కాదు...
bhuvneshwar
భువనేశ్వర్ కుమార్, ఆసియా కప్ 2022 టోర్నీలో పవర్ ప్లేలో చక్కని బౌలింగ్ పర్పామెన్స్ చూపించాడు. కానీ డెత్ ఓవర్లలో భారీగా పరుగులు సమర్పించి టీమిండియా ఓటమికి ప్రధాన కారణంగా నిలిచాడు. దీంతో అతన్ని పవర్ ప్లే బౌలర్‌గానే వాడుకునేందుకు టీమిండియా ఆసక్తి చూపించొచ్చు...
Image credit: PTI
అలాగే దీపక్ చాహార్ ఒక్కటే మ్యాచ్ ఆడి, భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. దీపక్ చాహార్ కూడా చక్కని పవర్ ప్లే బౌలర్. ఆరంభ ఓవర్లలో ఒకటి, రెండు వికెట్లు తీయడం దీపక్ చాహార్ స్పెషాలిటీ. అయితే అతనితో డెత్ ఓవర్లలో బౌలింగ్ వేయించలేం...
మహ్మద్ షమీ, టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ తర్వాత ఒక్క టీ20 మ్యాచ్ కూడా ఆడలేదు. ఒకవేళ బుమ్రా కోలుకోకపోతే మళ్లీ షమీపైనే ఆధారపడాల్సి ఉంటుంది భారత జట్టు. వచ్చే ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా సిరీస్‌లను మహ్మద్ షమీని సెలక్ట్ చేసి, టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ నాటికి సిద్ధమయ్యేలా చేయాల్సి ఉంటుంది...