- Home
- Sports
- Cricket
- ద్రావిడ్ వచ్చి రేపు ఆడుతున్నావ్ అన్నాడు! బ్యాగు పోయింది, షూస్ కూడా లేవు... సింహాల మధ్య మేక పిల్లలా..
ద్రావిడ్ వచ్చి రేపు ఆడుతున్నావ్ అన్నాడు! బ్యాగు పోయింది, షూస్ కూడా లేవు... సింహాల మధ్య మేక పిల్లలా..
కపిల్ దేవ్ తర్వాత టీమిండియా తరుపున 100కి పైగా టెస్టులు ఆడిన భారత ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ. 300లకు పైగా టెస్టు వికెట్లు తీసిన ఇషాంత్ శర్మ, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ విజయంలో కీలక పాత్ర పోషించాడు...

Zaheer Khan-Ishant Sharma
2007లో సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో వన్డే ఆరంగ్రేటం చేసిన ఇషాంత్ శర్మ, 80 వన్డేలు ఆడి 115 వికెట్లు తీశాడు. 105 టెస్టుల్లో 311 వికెట్లు తీశాడు. ఆరంగ్రేటానికి ముందు తనకి ఎదురైన వింత అనుభవం గురించి తాజాగా బయటపెట్టాడు ఇషాంత్ శర్మ..
Ishant Sharma and Virat Kohli
‘ఆరంగ్రేటం మ్యాచ్ కంటే ముందు ప్రయాణంలోనే ఎక్కువ ఇబ్బంది పడ్డాను. ఐర్లాండ్ టూర్‌కి వెళ్లినప్పుడు జెట్ ల్యాగ్ కారణంగా నా కిట్ బ్యాగ్ పోయిందనే విషయాన్ని లేటుగా గుర్తించాను. ట్రైయిన్‌లో బ్యాగులు కొట్టేస్తారని తెలుసు కానీ విమానంలో కూడా ఇలా జరుగుతుందని నాకు తెలీదు..
Ishant-Sharma DC
ఆ రోజు నా ఒంటి మీద ఉన్న బట్టలతోనే పడుకున్నాను. నా కిట్ బ్యాగ్ లేదు, సూట్ కేసు లేదు. కార్డులు లేవు, డబ్బులు కూడా లేవు. అన్నీ ఆ పోయిన బ్యాగులోనే ఉన్నాయి. నిజానికి అప్పటికి డెబిట్ కార్డుకీ, క్రెడిట్ కార్డుకి తేడా ఏంటో కూడా నాకు తెలీదు..
Ishant Sharma
అందుకే మా నాన్న, నీకు కార్డులు వాడడం రాదు, క్యాష్ మాత్రమే ఉపయోగించమని చెప్పారు. పోయిన కిట్ బ్యాగు కోసం ఎలా క్లెయిమ్ చేయాలో కూడా నాకు తెలీదు. అందుకే అది కూడా చేయలేకపోయా. రాహుల్ ద్రావిడ్ వచ్చి, రేపు నువ్వు ఆడుతున్నావ్ అన్నాడు..
Wriddhiman Saha and Ishant Sharma
‘‘షూస్ కూడా లేకుండా నేను ఆడలేనుగా! ప్రాక్టీస్ కూడా చేయలేదు..’’ అని చెప్పా. ఏమైనా చెయ్, నువ్వు ఆడుతున్నావని ద్రావిడ్ చెప్పేసి వెళ్లిపోయాడు.. జాక్ (జహీర్ ఖాన్)ని 11 నెంబర్ షూస్ అడిగాను. అతను ఇచ్చాడు కానీ అవి నాకు సరిపోలేదు.
వాటితో బౌలింగ్ చేస్తుంటే ఒత్తుకుపోయి చాలా నొప్పిగా ఉండేది. అయితే ఆరంగ్రేటం చేయాలనే ఉద్దేశంతో నొప్పిని పట్టించుకోకుండా ప్రాక్టీస్ చేశా.. అలా నా అంతర్జాతీయ ఆరంగ్రేటం ఓ వింత అనుభవాన్ని మిగిల్చింది..
బంగ్లాదేశ్ సిరీస్‌లో నా టెస్టు ఆరంగ్రేటం కూడా నాకు ఇంకా గుర్తుంది. డ్రెస్సింగ్ రూమ్‌లో హర్భజన్ సింగ్, రాహుల్ భాయ్, దాదా (సౌరవ్ గంగూలీ), యువీ భాయ్, వసీం భాయ్, సచిన్ పాజీ అందరూ ఉన్నారు. జహీర్‌తో కలిసి కూర్చునేవాడిని. మొన్నటిదాకా వాళ్లను టీవీల్లో చూశా. సడెన్‌గా డ్రెస్సింగ్ రూమ్ షేర్ చేసుకోవడం చాలా వింతగా అనిపించేది.
నాకు నిద్ర వచ్చినా సరే ఆపుకునేవాడిని. సీనియర్లు పడుకున్నాకే పడుకోవాలని ఏమీ మాట్లాడేవాడిని కాదు. మాహీ భాయ్, ఆర్‌పీ సింగ్ కూడా ఉండేవాళ్లు. సింహాల మధ్య ఉన్న మేక పిల్లలా సైలెంట్‌గా ఉండేవాడిని. జాక్ భాయ్ నా పరిస్థితి అర్థం చేసుకున్నాడు..
టెన్షన్ పడకుండా రిలాక్స్ అవ్వమని, అందరితోనూ ఫ్రీగా ఉండమని చెప్పాడు. అప్పటి నుంచి కాస్త ఫ్రీగా ఉండేవాడిని. అయితే ఓ మూలన సైలెంట్‌గా కూర్చొని వాళ్ల మాటలు వింటుండేవాడిని. నాకు టీమిండియా నుంచి పిలుపు రాగానే మా నాన్న కళ్లలో ఆనందభాష్ఫాలు చూశా..
మా నాన్న అంటే నాకెంతో ఇష్టం, ఆయనకి నేనంటే కూడా. కానీ తండ్రీకొడుకుల మధ్య ఎంత బలంగా ఉన్నా, కౌగిలించుకోవడం, ప్రేమగా చూడడం వంటి జరగవు...
ఆ రోజు మా నాన్న తన ఎమోషన్స్ దాచుకోలేక నన్ను కౌగిలించుకున్నారు. నాకు ఊహ తెలిశాక నేను ఆయన్ని అలా చూడడం అదే మొదటిసారి..’ అంటూ చెప్పుకొచ్చాడు ఇషాంత్ శర్మ..